హరివిల్లు (ప్రక్రియ)

హరివిల్లు (ప్రక్రియ)
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన : నాగ రమేష్ మట్టపర్తి

1) జ్ఞానమే జీవితానికి
అసలైన మూలధనం
అదందించే గురువులకు
సదా మన వందనం

2) తన దివ్య ప్రకాశంతో
వెలుగు నిస్తాడు రవి
తన జ్ఞాన ప్రకాశంతో
మేల్కొల్పుతాడు  కవి

3) మంది ఎక్కువైతే
మజ్జిగ పలచన
చనువు ఎక్కువైతే
బంధం చులకన

4) అమ్మా…!  నీ హృదయం
స్వచ్ఛమైన పాల పొంగు
అందుకే విడువరుగా
బిడ్డలు నీ చీర చెంగు

5) ప్రతి విషయంలో అతి
పోగొట్టును మతి
మార్చును మన స్థితి
తెచ్చిపెట్టును అధోగతి

6) విధుల నిర్వహణలో
అసలుండదు ఆరాటం
హక్కుల సాధనకేమో
చేస్తారు పోరాటం

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!