రంగు రంగుల సీతాకోక చిలుక

రంగు రంగుల సీతాకోక చిలుక
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన:అరుణ తోలేటి

ఒక సీతా కోక చిలుక
ఎగురుకుంటూ వెళుతోంది
ఒక చక్కటి అప్పుడే విచ్చుకున్న అందమైన పువ్వు మీద వాలింది
ఆ పువ్వు సీతాకోక రంగు రంగుల సొగసు చూసి మురిసిపోయింది
మురిపెముగా మాట్లాడింది
సీతాకోక చిలుక మధురంగా
సంభాషించింది
మధురాన్ని త్రాగింది వీడుకోలు పలికింది.
మళ్ళీ ఎప్పుడొస్తావు అని అడిగింది పూవు
పిచ్చి పువ్వు కి ఏమిచెప్పాలి
అనుకుని సమాధానం ఇవ్వకుండానే
ఎగిరిపోయింది సీతాకోకచిలుక
ఆ కొద్దిపాటి పరిచయానికే
పనసు పడ్డ పువ్వు తన కొత్త నేస్తం కోసం
తోటి పూవులు వాడిపోతున్నా..
రోజు ఎదురు చూపూలతో
వాడని పువ్వై నిలిచింది
ఆ సీతా కోక చిలుక అలా ఎగురుకుంటూ ఎగురుకుంటూ వెళుతూనేవుంది
ఇంకొక పువ్వుపై వాలింది, నవ్వుతు మాట్లాడింది,
పువ్వుని మాట్లల్లో పెట్టి
మకరందాన్ని త్రాగింది
వీడుకోలు పలికింది
మొదటి పువ్వు ఇంకా ఎదురుచూస్తూనే ఉంది.
రంగు రంగుల సీతాకోక చిలుక రాక కోసం.
ప్రియ నేస్తం కోసం
ఒకరోజు ఎక్కడా తేనె దొరకని సీతాకోకచిలుక మొదటి పువ్వు దగ్గరకే వచ్చింది
సీతాకోకచిలుక పూవుని అసలుగుర్తించలేదు..
పూవు పులకించిపోయింది
నవ్వుతు మాట్లాడుతోంది సీతాకోక చిలుక..
తన అందమయిన రంగుల రెక్కలను వయ్యారంగా విదిలిస్తూ..కబుర్లు చెబుతోంది పూవుకు
ప్రేమతో తనను తాను మరచి
కళ్ళప్పగించి వింటోంది పూవు
తేనె లేదని తెలిసి మెల్లగా తప్పించుకుని వెళ్లిపోబోయింది
రంగురంగుల సీతాకోక చిలుక
మళ్ళీ ఎప్పుడొస్తావు అడిగింది.పూవు
ఏముందని రావాలే ఓ పిచ్చి పూవ్వూ..
అనుకుంటూ సమాధానం ఇవ్వకనే ఎగిరివెళ్లిపోయింది చిలుక
మళ్లీ పువ్వు ఎదురు చూడడం మొదలు పెట్టింది..
వాడని పువ్వై వికసిస్తూనే ఉంది నిత్యం
ఒకరోజు భయంకరమైన గాలి వీచింది..
చెట్లు  జడలు విరబోసుకుని తలలు ఊపుతూ భీకరనాట్యం చేస్తున్నాయి
సీతాకోకచిలుక పట్టు తప్పింది, ఒక కొమ్మను పట్టింది,అదుపు తప్పింది.. నెమ్మదిగా జారింది,
మొదటి పువ్వు దగ్గరకే చేరింది..
సీతాకోక చిలుక పూవుని గుర్తించనేలేదు
పువ్వు ఆనందానికి అవధులు లేవు..
తనని తానుఎలా పరిచయం
చేసుకోవాలో తన్మయత్వం లో
పూయేదకు తెలియరాలేదు
కుదిరినంత ఆసరా అందించింది.. పూవు
చేతనయిన దాని కంటే ఎక్కువ
సాయమే చేసింది..చిలుకకు పూవు
సీతాకోక చిలుక మధురంగా
చాలాసేపు మాట్లాడింది..
ఎన్నో విషయాలుచెప్పింది
నీతి సూక్తులు వల్లెవేసింది
వర్షం తగ్గింది, సీతా కోకచిలుక రెక్కలు విదిలిస్తూ..ఎగిరివెళ్ళిపోయింది
పువ్వు మళ్ళీ ఎప్పుడు వస్తావు
అని అడిగే లోపే
సీతాకోక చిలుక తుర్రుమంది
సీతాకోక చిలుక కై తాను ఎదురు చూసేది
ఉందో లేదో
చిలుక తన మాట విందో లేదో
తెలియలేక  పూవు వాడిపోయింది.నేలరాలిపోయింది

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!