నా మొగుడు

(అంశం. :”చాదస్తపు మొగుడు”)

నా మొగుడు

రచయిత :: ఎన్.ధన లక్ష్మి


అందగాడు నా మొగుడు అనుకున్న కానీ
అన్నిటిలో లోపాలు వెతుకుతాడు అనుకోలేదు
ప్రతిదానికీ సమయం పాటించాలి అంటాడు.
చీర కొనాలి అన్న, ఆఖరికి ఇంట్లో ఉప్పు తీసుకోవాలి
మీనమేషాలు లెక్క పెడతాడు..

ప్రేమ ఎక్కువే, కోపం ఎక్కువే , తాపము ఎక్కువే
అన్నిటికన్నా చాదస్తం ఎక్కువే ..
పిల్లి ఎదురొచ్చిన, ఊరికే అలా తుమ్మినా ప్రయాణాన్ని వాయిదా వేసుకుని మరి ఇంట్లో కూర్చుంటారు…
సరదాగా సినిమాకి వెళ్దామంటే శుక్రవారం అంటారు
పోనీ ఇంట్లోనే సినిమా చూద్దామంటే వేళాపాళా లేదా అంటాడు.. ఎలా వేగాలి రా బాబు ఈ చాదస్తపు మొగుడుతో….

సరదాగా ఎటైనా వెళ్లేసి వద్దామంటే అంటే వర్జం అంటారు , యమగండం అంటాడు..
తీరా వెళ్లి టైమ్ కి అలిసిపోయి నిద్రపోతాడు..
అరవ లేను, కోప్పడలేను ఎందుకంటే ఏమైనా అంటే
చిన్న పిల్లాడి ల మాదిరి ఏడుస్తాడు నా మొగుడు..

అమాయకత్వం ,తింగరితనం, వెర్రితనం కలగలిపిన మొగుడు కాదు కాదు చాదస్తపు మొగుడు నా మగడు….

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!