వీడెక్కడి మొగుడు

(అంశం. :”చాదస్తపు మొగుడు”)

వీడెక్కడి మొగుడు

రచయిత :: పి. వి. యన్. కృష్ణవేణి

తిడితే అలుగుతాడు
కొడితే ఏడుస్తాడు
చెపితే అర్దం చేసుకోడు
అరిస్తే కోప్పడతాడు

మడి ఆచారం అంటాడు
కట్టుదిట్టం గావిస్తాడు
తాను కూడా శ్రమపడతాడు
నన్ను క్షోభకు గురి చేస్తాడు.

ప్రేమ నిండిన హృదయం తనది
లౌక్యం తెలియని అమాయకత్వం
భాధ్యతలను భరించే సుగుణం
నన్ను మరింత భాధించే ఆ భందం

తన ప్రేమ నాకే సొంతం అంటాడు
తను కష్టం నా కోసమే అంటాడు
ఈ జీవితం నీకే అంకితం అంటాడు
పలువురి బాధలు, భాధ్యతలు మనవే అంటాడు

సినిమాలు అంటే ఎందుకంటాడు
షికార్లు అంటే ఇప్పుడు కాదంటాడు
రుచిగా శుచిగా వండి వార్చితే
వంటల్లో మంట ఎక్కువైందంటాడు

అందరూ మన వాళ్లే అనుకుంటాడు
అందర్నీ సులభంగ నమ్మేస్తుంటాడు
అందరితో తిట్టించుకుంటూ
చివరకి నన్ను ముంచేస్తుంటాడు

అమాయక చక్రవర్తి కాదు వాడు
అతి మంచి తనం నిండిన వాడు
వేడేక్కడి మొగుడు నాకే దొరికాడు
ఈ రోజుల్లో చాదస్తపు మొగుడు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!