ఊరంతా సంక్రాంతి పోటీలు

ఊరంతా సంక్రాంతి పోటీలు
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)  

రచన: నారు మంచి వాణి ప్రభాకరి

సూర్యుడు తల్లి ఒడిలో నుంచి బాల భానుడి లే లేత కిరణాలు మానవాళికి అందిస్తూ మేల్కొలిపి కార్య సన్నద్దుల్ని చేస్తూ విశ్వ మంతా వీక్షిస్తున్నారు. మానవాళి స్వార్థమే ధ్యేయం గా ఉన్నతి కోసం వెంపర్లాడటం వల్ల ప్రపంచంలో అనేక సమస్యలు నీ ఇంటికొస్తే నాకేమీ ఇస్తావు, మా ఇంటికి వస్తె నాకేమి తెస్తావు ఇది నేటి ప్రపంచము. ఇంకా పల్లెల్లో ఆ పద్దతి రాలేదు. ఒక కారణం అక్కడ భోజన హోటల్ సదుపాయము వసతి గృహాలు ఉండవు కనుక అతిథి అభ్యాగతీ అనే తత్వం ఉన్నది.
ఇలాంటి వారే సమాజం నేడు బాగుంది అనడానికి మూల కారకులు. అభిరామ్ ఆ ఊరి ప్రెసిడెంట్ గారి అబ్బాయి. మంచి స్పుర దృపి విద్య వంతుడు. అగ్రి కల్ చర్ ఎం ఎస్ సి చదివాడు.  కొన్నాళ్ళు చదివిన యూనివర్సిటీ లో పార్ట్ టైమ్ లెక్చరర్ చేసి మంచి అనుభవం సంపాదించాడు ఆధునిక పద్దతిలో పంటలు పండించే విధానము దాని ఫలితాలు చక్కగా తెలుసుకుని సొంత వ్యవసాయము ఆధునిక పద్దతిలో చయ్యలి అని నిర్యించుకుని స్వగ్రామం వచ్చేశాడు.  తల్లి తండ్రి ఎంతో ఆనందించారు. ఈ నాడు అంతా విదేశీ పరుగులో ఉన్నారు తమ కొడుకు ఇంకా పుట్టిన ఊరు మనుష్యులు అని వచ్చాడు అని అందరికీ చెప్పారు.
బావగారి కొడుకుల మధ్య కాలంలో ఎక్కడా విదేశాల నుంచి రాలేదు అభిరామ్ తండ్రి రమణ  అన్నగారు బాగోగులు చూస్తూ ఉంటాడు. అయితే పిల్లలు ఇద్దరు కెనడా లో ఉన్నారు వారికి ఇది అంత ఇష్టం ఉండదు పోని బాబు చూస్తున్నావు అనుకోరు అయినా తన బాధ్యత గా రమణ అన్నను వదినను చూసి వస్తూ ఉంటాడు
వంట మనిషి పని మనిషి అంతా ఉంటారు. ఊరికే లేచావా అనడానికి కూడా నోరు రాదు ఎవరికి కూడా కొడుకులు ఇంటికే పరిమిత మవ్వాలి అంటారు. ఇది వారి సంగతి అందుకు తమ్ముడు కొడుకు వచ్చినందుకు ఈర్ష్య పడ్డారు. అభిరామ్ కి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి కానీ కొందరు ఉద్యోగము లేదు అత్త కాంతమ్మ మంచిదే కాని పల్లెలో ఉండ లేదు అని మానేశారు. ఊళ్ళో సంబంధాలు వచ్చాయి కానీ నక్షత్రం కుదరలేదు జాతకం బాగాలేదు అంటూ వెనక్కి వెళ్లి పోయాయి దీనికి కారణం మధ్య వర్తుల ప్రమేయం ఉన్నది.
పిల్ల బాగుంటే చదువు లేదు చదువు ఉంటే పిల్ల బాగా లేదు పల్లెటూరి వాళ్ళు గనుక పెట్టు పోతలు అడగక పోయినా ఇస్తారు. ఆడ పిల్లల పెళ్ళిళ్ళు అయ్యాయి అల్లుళ్ళు సిటీ లో ఉంటారు అందరూ హైదరాబాద్ సాఫ్టు వేరే ఉద్యోగాలు హార్డ్ వేర్ మనస్తత్వాలు కలిగిన మేదావులు పని అయ్యేవరకు తెగ పొగుడుతారు అరచేతిలో వైకుంఠం చూపిస్తారు.
పెద్ద కూతురు కూతురు పదేళ్లు చిన్నది అయిన చేసుకో అన్నారు కానీ వాడు అది చిన్న పిల్ల ఇంకా డిగ్రీ చదువుతోంది వద్దు అన్నాడు నిజమే ఎక్కడో బొంబాయిలో పెరిగి చదువుకుని ఇప్పుడు హైదరాబాద్  కాలేజి లో చదువుతోంది. అభిరామ్ వద్దు అని అక్కకు చెప్పడం బావగారికి కోపం రావడం జరిగి పోయింది. సరే దేవుడు రాత ప్రక్రారం మన బుద్ధి ఉంటుంది చివరకు విధి ఎవ్వరిని రాస్తే వాళ్ళు అవుతారు. ఊరు ఎం ఎల్ ఏ గారి అమ్మాయి ఉంది ప్రైవేట్ గా డిగ్రీ చదివింది బయటకు వెళ్ళ నివ్వ రు సంప్రదాయం గా ఉంటుంది అంటే వాళ్ళు గొప్ప వాళ్ళు అంటారు. ఈ లోగా అభిరామ్ ఊరు అంతా చుట్టి వచ్చి ఏరకంగా ఊరిని అభివృద్ది చెయ్యాలని తండ్రికి తోడు గా ఉన్నాడు.
పంటల సీజన్ వచ్చింది అయితే వర్షాలు పడటం వల్ల కొంత పొలాలు దిగుబడి తగ్గిన వాళ్ళకి చేయూత నిచ్చి ధైర్యం ఇచ్చి బ్యాంక్ రుణాలు ఎరువుల విషయం లో సహాయ పడ్డాడు దానితో కొంత ప్రజలకు అవగాహన కలిగి అభిమానం చూపి అతన్ని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా ఎన్నుకుంటే మంచిదని ఎం ఎల్ ఏ గారికి చెప్పారు దానితో ఆయన  ఆనందించి చేర్మన్ గా ఎన్నుకున్నారు.
ఆ తరువాత ఎలక్షన్స్ అన్ని అయ్యాక ప్రమాణ స్వీకారం చేశాడు. ప్రజల మనిషిగా అభి రామ ఎంతో ఉన్నతి పొందాడు దానితో ఎం ఎల్ ఏ గారు పట్టు పట్టి కూతురు రూప నీ ఇచ్చి పెళ్లి చేశారు. అభిరామ్ రూపాయి పుచ్చు కో లేదు. తన అక్కలకు కావాల్సినవి తనే కోని ఇచ్చాడు. రూప కి ఇద్దరు అక్కలు ఒక తమ్ముడు ఒక కూతురు అయిన ఉన్న ఊళ్ళో ఉంటే అదే మంచిది అని ఆనంద పడ్డారు. ఇంటికి ఎవరూ వచ్చిన ఆప్యాయంగా ఉంటుంది. ఒక మాట ఎవరైనా అన్న వెనక్కి ఉంటుంది.
ఇందరికి అభయంబులిఛ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి అంటూ రూప శ్రీ అన్నమయ్య. శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తనలు పాడుతూ వంట చేస్తూ ఉంటుంది అల చేస్తే ఆరోగ్యం అని తల్లి చెప్పింది.
మంచి సంగీత విద్వాంసుల దగ్గర విద్య నేర్చుకున్నది అందుకే సంక్రాంతి పండుగ అనగానే ఊరంతా పిలిచి ముగ్గుల పోటీ వంటకాల పోటీ
పాటల పోటీ విచిత్ర వేష ధారణ పోటీలు పెట్టీ బహుమతి ప్రదానం చేసేవారు ఊరంతా వారికి ఎంతో గౌరవం ఇచ్చేవారు. ప్రజల కాస్త సుఖాలు నాయకులు చూస్తే ఊరంతా వారికి సలాం అంటున్నాడు వారికి తగిన కోడలు వచ్చిందని సంతోష పడ్డారు మామ గారి వారసత్వ ము అల్లుడికి వచ్చింది మంచి ప్రజా పాలకులు అని ఉత్తమ గ్రామంగా ఎన్నుకుని ప్రభుత్వం అవార్డ్ కూడా ఇచ్చింది.
పల్లెలు ప్రగతికి పట్టు కొమ్మలు రైతే ప్రత్యక్ష అన్నపూర్ణ కదా సంక్రాంతి అనగానే కళా రూప సత్కారాలు, శ్రీ విష్ణు శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయము, శ్రీ కృష్ణ, శ్రీ కేశవ, శ్రీ జనార్ధన శ్రీ వినాయక ఆలయాల్లో పూజలు, గ్రామ దేవతలకు కనప నైవేద్యం పిల్లలకి భోగి నాడు భోగిపళ్లు బొమ్మల కొలువులు, సంక్రాంతి నాడు పెద్దల పండుగ అల్లుళ్ళు అతిథుల పండుగ కనుమ నాడు పశువుల పలెళ్ళ రైతుల పంటల పూజలు పండుగలు గ్రామ దేవతలకు పండుగ నైవేద్యము  పూజలు ఇలా అన్ని కూడా ఎంతో ఐకమత్యంతో సామూహికంగా చేసి ఊరంతా సంక్రాంతి చేసి బహుమతులు ఇచ్చి అభిరామ్ నిజంగానే ఆధునిక శ్రీ రాముడుగా పేరు పొందాడు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!