మధుర భావన

(అంశం:”ప్రేమ ఎంత మధురం”)

మధుర భావన

రచన:పి. వి. యన్. కృష్ణవేణి

ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కటినం, మింగినాను హాలహలం, చేసినాను ప్రేమ క్షీర సాగర మధనం.

ఎంత మంచి పాట ఇది. ఒక ప్రేయసి కోసం పడే తపన కనపడుతుంది ఈ రాగం లో.

ప్రేమ అమృతం కంటే, మధురమైనది. కానీ, ఆ ఆమ్మాయి వల్ల ఆ అమృతం,  విషం  లాగ మారింది. విష సముద్రంలో కొట్టుకున్నట్టె కదా. అదే మనసు పడే సంఘర్షణ.

శ్రవణ్  నువ్వు తప్పుగా ఆలోచించకు, ఆ అమ్మాయి, నిన్ను మొదటినుంచి ఇష్టపడలెదెమో, అనవసరం గా నువ్వే ఎక్కువ ఊహించుకుని ఇప్పుడు ఇబ్బంది పడటం ఎందుకు. ఇంకా ఆలోచించకు తన గురించి. అని చాలా సింపుల్ గా చెప్పేసాడు. ధీరజ్.

కానీ అది అంత సులభం కాదని వాడికీ తెలుసు. అందుకే ఏమి మాట్లాడకుండా, వాడి ముఖం చూసాను. సరే, ఇంకా శృతి గురించి ఆలోచించి మనసు పాడు చేసుకొవద్దు. ఏదీ ఎలా జరిగితే, అలాగే జరగని అని బయటకు వెళ్లిపోయాడు.

నేను, శృతి 3 ఏళ్ళు గా, ఒకే కాలేజీ లో బిఎస్సి చేశాము. అప్పుడే ఒక్కరంటే, ఒకరికి ఇష్టం ఏర్పడినది.  తర్వాత తను పి. జి. చేస్తోంది. నేను, జాబ్ లో జాయిన్ అయ్యి, ప్రైవేట్ గా పి.జి చేస్తున్నాను. అలాగే మధ్య మధ్యలో ఫోన్ లో మాట్లాడుతుంటే, ఇంట్లో వాళ్లు పెళ్లి ఫిక్స్ చేసినట్టుగా చెప్పింది.

వాళ్ళ అమ్మ నాన్న కి ఎదురు చెప్పలేను అంటుంది. పోని నేను మాట్లాడతాను అంటే ఇంట్లో పెళ్ళి ఏర్పాట్లు జరిగిపోతున్నాయి, చుట్టాలు వచ్చేసారు. ఇప్పుడు నువ్వు వస్తే పరువు పోతుంది. వద్దు అంటుంది. ఇంకా రెండు రోజుల్లో పెళ్లి.

ప్రేమికుల విషాద పాటలు విని, నవ్వుకుంటూ ఉండే వాడిని. కాని, విడిపోతే ఇంత భాద ఉంటుందా మనసులో అనిపిస్తోంది. అది విప్పి చెప్పటానికి భాష లేని మధుర భావన ఈ ప్రేమ.

ప్రేమించుటేనా నా పాపము. పూజించుటేనా నా నేరము. ఎన్నాళ్ళని ఎదలో ముళ్ళు. మళ్లీ, ఆ పాట గుర్తుకి వచ్చింది. గుండె పగిలే లాగా ఏడవాలని ఉంది. ఏమి చెయ్యలేని పరిస్తితి.

తరవాత ఉదయం నిద్ర లేచి, ఫ్రెష్ అయ్యి బయటకి వచ్చి కూర్చున్నాను. ఎంట్రా ఏమైంది, నాలుగు రోజుల నుంచి దిగులుగా కూర్చొని ఆలోచిస్తున్నావ్. అంది అమ్మ.

ఇంకా దాచకుండా, మొత్తం చెప్పాను. అమ్మ కూడా చాలా భాద పడింది. నాన్న కూడ అక్కడే ఉన్నారు.

ఇంతలో బయట కాలింగ్ బెల్ మోగింది.

అమ్మ వెళ్ళి డోర్ తీసింది. తల తిప్పి చూసేసరికి, ఎదురుకుండా శృతి,వాళ్ళ నాన్న. నమ్మలేనట్లు ఆయన వైపు చూసాను.

శ్రవణ్ మేము ఎమైనా నీకు కొత్త వాళ్లమా?  మీరు మొదట నుంచీ ఫ్రెండ్లీ గా ఉండటం వల్ల, మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ గురించి  తెలుసుకోలేకపోయాము. నువ్వు అయినా చెప్పాల్సింది కదా, మేము వద్దంటామా, నీ గురించి తెలిసికూడా, ఎలా వద్దంటామనుకున్నావ్. అన్నారు వాళ్ల నాన్న గారు.

నేను శృతి వైపు చూసాను.

శృతి, నాతో చెప్పలేక ఒక్కతే, గది లో కూర్చుని ఏడుస్తూ ఉంది. నేను వెళ్ళి అడిగితే, చాలా సేపటి తరువాత చెప్పింది మీ ఇద్దరి ప్రేమ గురించి. అన్నారు.

అంటే, ఇక్కడ నేను ఎంత మదన పడ్డానో, తను కూడా అంతే మదన పడి ఉంటుంది కదా, అని భాదగా తన వైపు చూసాను. ముఖం బాగా వాడి పోయి ఉంది.

మరి పెళ్లి వాళ్లకి ఏమి… అని ఆగాను అంకుల్ వైపు చూసి.

పెళ్లి కొడుకు తండ్రి, నా  ఫ్రెండు. అందుకే, ముందు ఫోన్ చేసీ విషయం చెప్పాను. తర్వాత ఇంటికి వెళ్ళి మాట్లాడాలి. ఆ విషయం నేను చూసుకుంటాను. ఇంకా మీరు పెళ్ళికి రెడీ అవ్వండి.

మీకు ఇష్టమైతే,  రేపు అదే ముహుర్తంలోనే ఈ  పెళ్లి జరిపిందాము అని మా అమ్మా,నాన్న వైపు చూసారు. ఇద్దరూ సరే అనటంతో, జీవితంలో జరగదు అనుకున్న మా ప్రేమ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది.

కానీ, ఈ నాలుగు రోజులూ మేము పడ్డ ఈ ప్రేమ సంఘర్షణ, మేము జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేము. ఇంకా, మా జీవితాలలో ఇంతకు మించి భాద ఇంకెప్పుడూ పడకూడదు. అని మనసులో కోరుకుంటూ, తృప్తిగా పెళ్లి కూతురు గేటప్ లో ఉన్న  శృతి ని చుసుకున్నాను. తను కూడా నన్ను చూసి సంతోషంతో,  తృప్తిగా నవ్వింది.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!