దైవత్వం
అంశం : నిన్ను దాటి పోగలనా
మరుపురానిది నా బాల్యం
చెరిగిపోనిది నా సౌశీల్యం
ఎదురులేనిది నా ధైర్యం
తిరిగిరానిది నా జీవిత కైవల్యం.
ఎన్నో విజయాలు సాధించాను
ఎన్నో ఆటుపోట్లను ఎడుర్కొన్నాను
ఎన్నో సమస్యలను పరిష్కరించాను
మరెన్నో సంఘటనలు చవిచుసాను
తీపి గుర్తులు ఎన్నో
చేదు జ్ఞాపకాలు ఇంకెన్నో
అవన్నీ అనుభవాలే
నా జీవితంలో మధుర జ్ఞాపకాలే
నేనేమీ చేసినా వెన్నంటి ఉండే దైవం
నా హృదయంలో కొలువుండే దైవం
చేయిపట్టి నడిపించే ఆ దైవం
దైవత్వం నిండిన ఆ సాయినాధుడే.
మంచైనా, చెడైనా
ఆనందమయినా, దుఃఖమయినా
నేను నిన్ను దాటిపోలేను
ఓ దైవమా!! నన్ను కాపాడు…
రచయిత :: పి వి. యన్. కృష్ణవేణి
దైవానికి మీ వేడుకోలు బాగుందండి 👏👏👏😊