దిల్లు నీకు ఇచ్చేస్తా

అంశం:హాస్య కవితలు

దిల్లు నీకు ఇచ్చేస్తా
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: సుజాత.పి.వి.ఎల్

భక్తి టి.వి.లో నీ పేరుతో భజనలు చేయిస్తా
బజారుల్లో బ్యాండ్ బాజా కొట్టిస్తా
కిరాణా కొట్లో అప్పుంటే తీరుస్తా
చౌరస్తాలో ఫ్లెక్సీలు పెట్టిస్తా
లారీల వెనుక లవ్ కోట్స్ రాయిస్తా
బస్సులకి బ్యానర్లు కడతా
వార్తల కింది స్క్రోలింగ్ లిస్తా
జంక్షన్లో జెండాలు పాతుతా
ఇన్స్టాగ్రామ్లో ఎం.ఒ.జీలు పెడతా
టెలిగ్రామ్ లో డైలీ టెక్స్ట్ చేస్తా
నీ పేరుతో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తా
సబ్స్కైబ్ చేస్తే ప్రైజ్ మనీ అని స్టేటస్లో షేర్ చేస్తా
అత్యధిక లైక్స్ అన్నీ నేనే తెప్పిస్తా
ఓవర్ నైట్లో నిను సెలబ్రిటిగా మారుస్తా
నీ లైఫ్ పార్ట్నర్ నేనేనని తెగ పబ్లిసిటీ చేసేస్తా
మీ నాన్నకి నా కాళ్లు కడిగే అవకాశమిచ్చేస్తా
నను కాదనకుండా కనికరించి లవ్వాడవే పిల్లా..దిల్లు నీకు రాసిస్తా!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!