నిన్ను నువ్వు రక్షించుకో
రచన: బుదారపులావణ్య
కాలం ఎంత మారిన
నీ కన్నీళ్లు ఆగనివి
చట్టాలు ఎన్ని వచ్చిన
చావు కేకలు తప్పనివి
మదించిన మానవమృగాల నడుమ
కన్నీళ్లతో కాలం గడుపుతూ
మదిని మెలి పెడుతున్న
మాటల ప్రవాహంలో కొట్టుకుపోతూ
బరువెక్కిన గుండెతో
ఎరుపెక్కిన కళ్ళతో
ప్రాణం ఉన్న శవంలా
నిర్జీవమైన నీడలా
కాటేసే మృగాల నడుమ
మౌనంగా రోదిస్తూ
ఊపిరి ఉన్నంత కాలం
ఊహలతో జీవిస్తూ
నిలువని నీ… కంటి
కన్నీళ్లను నేలకు రాస్తూ
ఎన్నాళ్ళిలా
జీవనం సాగిస్తావు…
మగువ…లే
రక్తాన్ని మరిగించి
అన్యాయాన్ని అదిలించి
బానిస సంకెళ్లను ఛేదించి
నీ ఉనికిని నింగి వరకు చాటు
నీకు నువ్వే ఒక
ఆయుధమై పోరాడు
నిన్ను నువ్వు రక్షించుకో
మగువా… నిన్నునువ్వురక్షించుకో.
********************
Chala bhagundi
💐💐💐