హృదయం
రచయిత :: సుజాత.కోకిల
నీవు ఎంత వేగంగా నడుస్తున్న నీ ఊహల్లో నేనే
నీలో నేను ఉన్నానేమో పగలంతా నీధ్యాసలే
నీ జ్ఞాపకాలతో నా మనసంతా నీవే నీ ఊసులే
కనులలో నీ రూపమే కలలోనైన ఊహించని
విధంగా అడుగిడినావు నా మనసులో నా చిన్ని
గుండెల్లో పట్టలేని ఆనందాన్ని నింపావు
కళ్లు మూస్తే ఎక్కడ మాయమైపోతావోనని
కళ్లు మూయడం మరిచా.కునుకు రాగానే ఉలిక్కి
పడుతూ లేస్తున్న నీవు ఎక్కడ జారిపోతావోనని
భవిష్యత్తులోనైన బంగారు బాటగా మలుచుకోవాలని
కాలంతో పోరాడుతూ నీ కోసం నెట్టుకొస్తున్న
కాలంతో భారంగా ఎప్పటికైన నీ వాడ్ని కావాలనే
ఆత్రంగా ఎదురు చూస్తు జీవించి ఉన్న నీ వాడినై.