మొక్కలు నాటు సంరక్షించు

ప్రక్రియ :: సున్నితం 
అంశం:: మొక్కలు నాటు సంరక్షించు

రచన :: నరేందర్ రెడ్డి దన్నవరం

చక్కగా మొక్కలు నాటు
ముద్దుగా కంచెను గట్టు
పశుల నుండి తప్పించుకునేట్టు
చూడచక్కని తెలుగు సున్నితంబు!

సహజ ఎరువుల నందించి
సమయానికి నీళ్ళు పోసి
సంరక్షణ చేద్దాం నడుంబిగించి
చూడచక్కని తెలుగు సున్నితంబు!

ఇంటికొక మొక్కను నాటినా
ఇచ్ఛతో సంరక్షణ చేసినా
ఇంపు గొలుపు నింటికది
చూడచక్కని తెలుగు సున్నితంబు!

ఒక చెట్టును నరికినచో
పది మొక్కలు నాటితే
ప్రకృతికి మేలుకలుగు ఎదగనిస్తే
చూడచక్కని తెలుగు సున్నితంబు!

పర్యావరణ సంరక్షణే బాధ్యతగా
అందరూ శపథం బూనగా
ప్రకృతికి పచ్చనిచీర తొడగొచ్చుగా
చూడచక్కని తెలుగు సున్నితంబు!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!