మొక్కలు నాటు సంరక్షించు

ప్రక్రియ :: సున్నితం 
అంశం:: మొక్కలు నాటు సంరక్షించు

రచన :: తాళ్ల యోగానందం

కాలుష్యంతో ప్రపంచం బద్దలైతే
స్వార్థమునకు ప్రకృతి బలైతే
మొక్కలు నాటుతూ కాపాడితే
చూడచక్కని తెలుగు సున్నితంబు!

మొక్కను నాటిన వృక్షంబగున్
ఇచ్చు సమృద్దిగ ప్రాణవాయువున్
పీల్చును బొగ్గుపులుసు చెడున్
చూడచక్కని తెలుగు సున్నితంబు

జన్మదినమున మరువకు నాటుటకై
వివాహ బంధమోలే నిలుచుటకై
వెరవక తడవకుము కాపాడుటకై
చూడచక్కని తెలుగు సున్నితంబు!

మొక్కలు నాటుము ధరణిన
చిక్కులు తొలగును ప్రగతిన
అడ్డగించు నరుకుట కానలను
చూడచక్కని తెలుగు సున్నితంబు!

రోజుకొక మొక్కను నాటిన
దినచర్యలో భాగమై పోవును
నాదను స్వార్థముతో సాకుదును
చూడచక్కని తెలుగు సున్నితంబు!

 

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!