అనుకోకుండా ఒక రోజు

అనుకోకుండా ఒక రోజు

రచన :: సిరి.M

నా పేరు సిరి నేను హాస్టల్ లో ఉండి డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నా రోజుల్లో ఒక రోజు అనుకోకుండా వర్షాలు మొదలై నాలుగు రోజులు అయినా తగ్గకపోతే కాలేజీ కి శెలవులు ఇచ్చి హాస్టల్ క్లోజ్ చేస్తున్నాం అని చెప్పేరు…

పిల్లలు అందురూ లగేజ్ సర్దుకొని ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటే నేను అలోచిస్తూ కూర్చోన్నాను….

ఏమిటే ఆలోచిస్తున్నావు లేచి సర్దుకో వెళ్దాం మళ్ళీ రాత్రి అయితే బస్సు లు ఉండవు అన్నది నా ఫ్రెండ్ లత….

నేను ,లత ఇద్దరం ఒకే రూములో ఉంటాం ఇద్దరివి పక్క పక్క ఊర్లే కానీ నేను మధ్యలో దిగి వేరొక బస్ లో మా ఊరు వెళ్ళాలి…

మా ఊరి కి వర్షాలు పడితే బస్సులు అసలు రావు… ఇప్పుడు వెళ్ళితే ఉంటాయో లేదో అలోచిస్తున్నాను అన్నాను…

అయితే మా ఊరు వెళ్దాం రా అన్నది లత.. అమ్మో ఇంట్లో చెప్పకుండా అసలు రాను అని లేచి సర్దుకుంటూ ఉన్నాను…… బస్సు లు ఉండవు అంటావు మా ఊరు రమ్మంటే రావు మరి ఎలా వెళ్తావు అని అన్నది లత…

నీతో పాటు వచ్చి వచ్చి మా ఊరు వెళ్ళే  బస్ స్టాండ్ దగ్గర దిగి ఎవరైనా మా ఊరి వాళ్ళు ఉంటే వాళ్ళతో వెళ్తాను అన్నాను…

మరి మీ ఊరు వాళ్ళు అందరూ నీకు తెలియదు కదా ఎలా… నువ్వు నన్ను బయపెట్టకు ఎలాగో ఒకలా వెళ్తాను పద ఇప్పుడే వర్షం తగ్గింది. మళ్ళీ వర్షం వస్తే వెళ్ళలేం పద..పద అంటూ తొందర చేశాను…

మేము రూమ్ నుంచి బయటకు వచ్చేసరికి పిల్లలు అందరు లగేజ్ లతో గేట్ దగ్గర రెడీ గా ఉన్నారు… పేర్లు రాసి ఒక్కొక్కళ్ళు బయటకు వెళ్తుతున్నారు… మేము నిలబడి మా వంతు వచ్చిన తరువాత సైన్ చేసి బయటపడ్డం…

బయటకు వచ్చి పిల్లలు ఆటో కోసం చూస్తూ ఉన్నారు వచ్చి ప్రతి ఆటో అపి బసు స్టాండ్ ‌కి వెళ్ళి మంటున్నారు… సంధ్య అందరూ బసుల కే వెళ్తుతున్నారు…ఈ రోజు బసులు ఖాళీ ఉంటాయో లేవో అన్నది లత…ఈ లోపు ఆటో వస్తే ఆటో ఎక్కాం మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది…

ఎలాగో ఒకలా వర్షం లోనే ఆటో దిగి బస్ స్టాండ్ లోపలికి వెళ్ళి బస్ ఉంటే బస్ ఎక్కాం…. వెనుక సీట్ ఖాళీ గా ఉంటే కూర్చోన్నాం… హాస్టల్ లో బయలుదేరిన దగ్గర నుండి నేను ఒకటి గమనిస్తునే ఉన్నాను… ఒక అతను హాస్టల్ నుండి ఫాలో అవుతూ వచ్చి ఇప్పుడు మేము ‌ఎక్కిన బస్ ఎక్కి మా వెనుక కూర్చోన్నాడు…

అది లత తో చెపితే భయం తో వాళ్ళ ఊరు లాక్కొని వెళ్ళుతుంది అని చెప్పకుండా గమనిస్తున్నా….కండెక్టర్ వచ్చి టికెట్ అడిగితే తీసుకున్నాం.. అతను ఎక్కడికి తీసుకున్నాడో చూశాను…

అతను నేను దిగే దగ్గరకు తీసుకున్నాడు… నాకు టెన్షన్ మొదలు అయింది… ఏమి చేయాలో అర్థం కాక భయం.. భయం గా కూర్చోన్నాను…లత చూసి భయం గా ఉందా సిరి ఇప్పటి కి మించి పోయింది ఏమి లేదు మా ఊరు కి టికెట్ తీసుకునేదా అంటే నేను వద్దు లే లత భయం ఏమి లేదు లే అని ‌కళ్ళు ముసుకుని పడుకున్నా గంట తర్వాత మా స్టాప్ వస్తే లత లేపింది…

నేను లగేజ్ తీసుకుని లతకు బై చెప్పి దిగాను…లత జాగ్రత్త సిరి అని చెప్పింది… సరే అని నడుచుకుంటూ బస్ స్టాప్ లోకి వెళ్ళి ఖాళీ ప్లేస్ లో కూర్చోని ఉన్నాను…

అతను నాకు ఇంకొక సైడ్ కూర్చోన్నాడు..బయట చూస్తే పెద్ద వర్షం లోపల మా ఊరి వాళ్ళు ఎవరైనా ఉంటారేమో అని చూస్తే ఎవరు కనిపించలేదు… నాకు లోపల టెన్షన్ మొదలైంది…

హాయిగా లత రమ్మంటే వెళ్ళకుండా పెద్ద పోటుగత్తేలాగా వచ్చాను ఇప్పుడు ఏమి చేయాలి అనుకుంటే …

అప్పుడు ఒక ఆటో డ్రైవర్ వచ్చి మా ఊరి పక్క ఊరి కి ఆటో వెళ్ళుతుంది వస్తారా అని అడుగుతుంటే నాకు ప్రాణం లేచి వచ్చింది…అన్న‌ నేను వస్తాను మాది పక్క ఊరు నన్ను మా ఊరిలో వదలిపెట్టావా అన్న అని నీకు డబ్బులు ఇస్తా ఒక్క దానినే ఉన్నాను అని బ్రతిమాలాడుతుంటే సరే అందరినీ వదిలి నిన్ను మీఊరి లో వదిలి పెడతాను అన్నాడు….

సరే అని నేను ఆటో దగ్గరకు వెళ్ళి ఆటో లో కూర్చోన్నా…ఆటో డ్రైవర్ నా వేనుక పడిన అతను ఇద్దరు కలిసి వస్తున్నారు… బాబోయ్ వీడు ఏమిటి నన్ను వదిలేలా లేడు అని తింటుకుంటుంటే అమ్మ కొంచెం లోపలికి జరుగు ఈయన కూర్చోవాలి అన్నాడు…..

నేను జరిగి కూర్చోన్నా అతను నా పక్కన కూర్చోన్నాడు.. నాకు భయం గా ఉన్నా ఈ ఆటో లో మా ఇంటి ముందే గా దిగేది ఇంకా భయం ఎందుకు అని మాములుగా కూర్చోన్నా….ఆటో డ్రైవర్ అందరినీ దింపి మా ఊరికి పోనిస్తున్నాడు..

ఇంకా ఐదు నిమిషాల్లో ఇళ్ళు వస్తుంది అనగా ఆటో ఆగిపోయింది…. ఏమైంది అన్న అన్నాను.. ఎందుకో ఆగిపోయింది…మీ ఊరు వచ్చింది గా దిగి వెళ్ళండి అన్నాడు….

అన్న చీకటి లో ఎలాగా అన్న అనేసరికి ఈ అబ్బాయి ఉన్నాడు గా తోడు వెళ్ళండి అని రిపేర్ చేసుకుంటూ ఉన్నాడు…

లగేజ్ తీసుకుని దిగి నడుచుకుంటూ వెళ్తుంటే నా వెనుక అతను వస్తూ లగేజీ నీ పట్టుకుంటా ఇవ్వండి అంటూ దగ్గరకు వస్తుంటే నాకు ఒక పక్కన వర్షం పడుతున్నా చెమటలు వచ్చాయి…

ధైర్యం కూడదీసుకుని అక్కర్లేదు నేను పట్టుకుంటాను  అన్నా వినకుండా నా చేతి లో లగేజీ తీసుకోవడానికి నా చేయ్యి పట్టుకున్నాడు.. అంతే నేను లాగి పెట్టి ఒకటి పీకి పరుగు అందుకున్నా….

అలా పెరిగెడుతు  మా ఇంటి ముందు ఆగి అమ్మ నాన్న అంటూ పెద్దగా కేకలు వేసేసరికి ఇంట్లో వాళ్ళు బయటకు వచ్చి కంగారు గా సిరి ఏమైంది ఈ టైం లో వచ్చావు అంటూ దగ్గరకు వచ్చి వెనుక కు చూసిన మా నాన్న నా వెనుక వచ్చిన అతనిని బాబు  రామ్ నువ్వా రా లోపలికి అంటూ పిలిచాడు నాన్న నేను ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే మా అమ్మ వచ్చి ఏమిటే వర్షం లో తడుస్తూ నిలబడ్డావు రా లోపలికి అని లగేజీ తీసుకుంది….

నేను ఇంకా ఆశ్చర్యం నుండి తేరుకోలేక అమ్మ ఎవరు అతను అంటే మా అమ్మ నవ్వుతూ నిన్ను చేసుకోబోయే వాడు అని లోపలికి వెళ్ళింది…

నాకు ఏమి అర్థం కాక అలానే నా రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి బెడ్ మీద కూర్చుని ఆలోచిస్తుంటే మా అమ్మ వచ్చి సిరి అని పిలిస్తే గాని ఈ లోకంలో కి రాలేదు…

ఏమిటి అమ్మ అంటే అబ్బాయి కి కాఫీ తీసుకు వెళ్ళి ఇవ్వు అన్నది … అమ్మ నాకేమీ అర్థం కాలేదు నాకు పెళ్ళి ఏమిటి అది కాకుండా ఇద్దరం కనీసం చూసుకోను కూడా చూసుకోలేదు అంటే నువ్వు తెలుసు ఆ అబ్బాయి కి అన్నది అమ్మ .. ఎలా అన్నాను నేను….

ఒకసారి మీ నాన్న హాస్టల్ దగ్గర నిన్ను చూపించాడు అందుకే ఈ రోజు నిన్ను చూసి నీకు తోడుగా నీ వెనుక వచ్చాడు అని చెప్పి కాఫీ చేతి లో పెట్టిన ఇచ్చి రా అన్నది…

నేను కాఫీ తీసుకొని లోపలికి వెళ్ళాను తను తల తుడుచుకుంటూ అటూ తిరిగి ఉన్నాడు… ఎలా పిలవడం అని నేను చిన్నగా దగ్గాను ఆ సౌండ్ కి ఇటు తిరిగి నన్ను చూసి చిన్న స్మైల్ ఇచ్చాడు…

నేను నవ్వి కాఫీ అన్నాను.. తను దగ్గరకు వచ్చి కాఫీ తీసుకుంటూ నన్ను చూసి చాలా అందంగా ఉన్నావు అన్నాడు… నేను తనని చూసేసరికి బుగ్గ మీద నేను కొట్టిన వేళ్ళు గుర్తులు ఉన్నాయి… అసలే తెల్లగా ఉన్నాడు బుగ్గ మీద ఎర్రగా కనిపిస్తున్నాయి…

నేను అది చూస్తున్నాను అని తెలిసి ….నువ్వు  వర్షం లో ఊరు వెళ్తున్నావు అని చూసి నీ వెనుక వచ్చి నిన్ను సేఫ్ గా మీ ఇంటి దగ్గర వదిలి పెడదాం అనుకుంటే నాకు మంచి బహుమతి ఇచ్చావు గా అంటూ బుగ్గ నిమురుకున్నాడు….

నేను సిగ్గు పడుతూ సారీ అండి ‌మీరు ఎవరో తెలియక అలా కొట్టేశాను అన్నాను… అయితే నాకు సారీ వద్దు … మరి ఏమి కావాలి అంటే …. కొట్టిన చోట ఒకటి ఇవ్వు చాలు అన్నాడు… ఏమిటి మళ్ళీ ఇంకొక దెబ్బ అన్నాను … అవును కానీ చేతితో కాదు అని దగ్గరకు రాబోయే సరికి బాబు రామ్ అంటూ మా నాన్న వచ్చాడు…

ఆమ్మాయి కి తోడు గా వచ్చి మంచి పని చేశావు… భోజనానికి రా అని చెప్పి సిరి తీసుకొని రా అని వెళ్ళాడు… పదండి వెళ్దాం అనగానే మరి నేను అడిగింది అన్నాడు… అవి అన్నీ పెళ్ళి అయిన తరువాత అంటూ బయటకు పరిగెత్తాను

****

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!