కరోన ఆర్తనాదాలు
రచయిత: సుజాత కోకిల
ఓ దేవుడా నీకు ఇదేమైనా న్యాయమా
నీవే సృష్టిస్తావు నీవే శిక్షిస్తావు ఎందుకు
నీ రూపంమేంటో తెలియదు నీవెవరో తెలియదు
అయిన నిన్నే నమ్మాను రాయే దేవుడని నమ్మాను
కనివిని ఎరుగని ఒకశక్తిని మాపై ఉసి గొలిపావు
ఎంతోమంది జీవచ్చల్లా పడి రాలి పోతుంటే
తోడు నీడ లేక బంధం బంధాలు లేక తిండి నీళ్ళు
లేక దిక్కు మొక్కులేక నిరాశ్రయులై ప్రాణాలను
అర చేతులలో పెట్టుకుని దిక్కులు బిక్కటిల్లేలా
ఆర్తనాదాలు చెస్తుంటే వినిపించడం లేదా దేవుడ
ఈ రగిలే జ్వాలలో ఆరిపోక తప్పదా ఇంక ఎన్నాళ్ళు
సూర్యుడు ఉదయించి అస్తమించే లోపే ఏన్నో
ప్రాణాలు గాలిలో కలిసి పొతుంటే ఎవరు లేక మేము
విది చేతిలో కీలుబొమ్మలమై బ్రతుకు భారంగా
జీవిస్తున్న అభాగ్యులకు దుష్టశక్తిని తరిమి కొట్టే
మంచి ఆయుధాన్ని ఇచ్చి మనసు నిబ్బరంగా
ఉండే ఆత్మవిశ్వాసాన్ని కల్గించు దేవుడా