అంశం: స్వేచ్చా స్వాతంత్య్రం ఎక్కడా!?
స్వేచ్చా పతంగం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: విస్సాప్రగడ పద్మావతి
త్యాగధనుల పోరాటమే
స్వేచ్చాపతంగమై
మనముందు ఎగురుతుంది
అహింసా మార్గాలు
సాయుధ పోరాటాలు
ఎన్నో ప్రాణాల త్యాగం
స్వేచ్చా పతంగమై
మనముందు ఎగురుతుంది.
దిక్కులు పిక్కటిల్లేలా
తెల్లదొరల గుండెల్ని కొల్లగొట్టిన
మీ ప్రతిభకు మరణము సైతం
తలవంచిన వైనం
స్వేచ్చా పతంగమై
మనముందు ఎగురుతుంది.
స్వచ్ఛతనం చెరిగిపోయి
కుటిలత్వం రేగిపోయి
అవివేకం నిండిపోయి
స్వేచ్చా పతంగo
తలదించుకునేలా చేస్తున్నాం
అందివచ్చిన స్వతంత్రాన్ని
స్వార్దనికి వాడుకునే
మనుషుల మధ్య
న్యాయమనే నిప్పురవ్వ
చల్లారిపోయింది
Super. బాగుంది
బాగుంది పద్మావతి గారు మీ కవిత
🤗👍👌👌👌👌🤗👍