మానవతా విలువలు

మానవతా విలువలు

రచన: జీ వీ నాయుడు

.రామయ్య కు ఇద్దరు కుమారులు. ఓ కుమార్తె. పెద్ద కుమారుడు సుమన్ అమెరికా లో ఉద్యోగం. రెండో కుమారుడు ఇండియా లోనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్. కుమార్తె రమణి వివాహం అనంతరం అమెరికా లో స్థిరపడ్డారు. రామయ్య తో పాట చిన్న కుమారుడు అజయ్, కోడలు దీపిక  ఒకే ఇంట్లో ఉంటున్నారు. రెండు ఏళ్ల క్రితం రామయ్య భార్య అనారోగ్యం తో కన్ను మూసింది.  తల్లీ మృత్యువు తో కొట్టుమిట్టాడుతూ పెద్ద కుమారడిని చూడకుండానే పరలోకం వెళ్ళిపోయింది.
కనీసం అంత్యక్రియలు, ఖర్మ కాండలకు కూడా హాజరు కాలేదు. ఓ వీడియో కాల్ చేసి ” నాన్న.. నువ్వు బాధ పడకు.. నేను ఇక్కడ సెలవు దొరకడం లేదు. అందుకే రాలేక పోతున్నా.. మీ కోడలు సుగుణ కూడా గర్భిణీ. అందుకే రాలేక పోతున్నా. తమ్ముడు, మరదలు రాధిక దగ్గర ఉండి అన్నీ చేస్తారు.. ఆరోగ్యం జాగ్రత్త. ఏమి దిగులు పడకు. నేను రెండు, మూడు నెలల్లో వస్తాను.. ” అని కాల్ కట్ చేసిన సంఘటన రామయ్య రెండు ఏళ్ళు గడిచినా మరువలేకున్నాడు.
తల్లి కాలం చేసి రెండేళ్లు అయినా కనీసం తండ్రి ని చూసేదానికి రాలేని కొడుకులు ఉన్న కాలం ఇది. రోజూ రామయ్య ఒక్క సారి అయినా పెద్ద కుమారుడు నడవడిక ను తలచుకొని కన్నీరు పెట్టని రోజు లేదు. వ్యవసాయం గిట్టుబాటు గా లేకున్నా కాయ కష్టం చేసి రామయ్య దంపతులు ముగ్గురు పిల్లలు ఉన్నత చదువులు చదివేలా శ్రమించారు. ఆర్ధిక ఇబ్బందులు అధికమించి స్వయంగా పొలం దున్నీ పంట పండించిన రామయ్య కష్టం వర్ణణాతీతం.
ఓ వైపు పెద్ద కుమారుడు రాలేదనే బెంగ రామయ్య ను కుంగదీస్తుంటే మరో వైపు గోరు చుట్టుపై రోకలి పోటులా ” ఎలాంటి కొడుకు ను కన్నావు రామయ్య, తల్లి ని కడచూపు కూడా చూడని కొడుకు ఉంటేనేమి, లేకుంటే నేమి? ” అంటూ దెప్పి పొడిచే ఇరుగుపొరుగు మరో వైపు రామయ్య మస్తీస్కమ్ తినేసే వారు.
కొడుకులు, కూతుర్లకు ఉన్న తేడా నీకే అర్ధం అయింది కదా అని దెప్పి పొడిచే వారు మరికొందరు.
తల్లి సీరియస్ అని సమాచారం తెలుసుకున్న అమెరికా లో ఉన్న కూతురు రమణి తాను ఉద్యోగం చేస్తున్న కంపెనీ నీ సెలవు అడిగింది. సెలవు కుదరదు అన్నారు సదరు కంపెనీ. నాకు నా తల్లి ముఖ్యం. ఆమె చావుబ్రతుకుల్లో ఉంటే నేను ఇక్కడ ఉద్యోగం చెయ్యలేను. నాకు సెలవు కావాలి అని డిమాండ్ చేసింది రమణి. కంపెనీ ఎండి కుదరదు అంటే ఒకే క్షణం ” క్షమించండి.. నేను రిజైన్ చేస్తున్నా ” అంటూ నూతనం గా వచ్చిన ఉద్యోగం వదులుకొని ఇండియా కు వచ్చింది. తన భర్త రాలేను అన్నప్పటికి. కుదరదు. వెళ్లి తీరాలి అని ఒప్పించి ఇద్దరు వచ్చారు. తల్లిని చూసి కన్నీరు మున్నీరు అయింది రమణి. అది కన్న ప్రేగు బంధం. ఈ సంఘటన ప్రతి ఒక్కరిని ఆలోచింప చేసింది. అందుకే ఇప్పటికి కొన్ని ప్రాంతాల్లో ఓ సామెత ప్రాచుర్యంలో ఉంది. ” కంటే కూతురునే కనాలి, తింటే గారెలే తినాలి ” అనేది.
కూతురు, కొడుకు అనే అంశం కాకుండా, తల్లిదండ్రులను విస్మరిస్తే వారు ఎంత ఉన్నత స్థాయి లో ఉన్నా ప్రయోజనం శూన్యం.అయితే రామయ్య తన కూతురు ఆదర్శ మూర్తి అంటూ గర్వం గా చెప్పుకునేవాడు.
గమనిక : కొడుకులను కించ పర్చాలి అనేది ఈ రచన ఉద్దేశం కాదు. కేవలం మానవతా విలువలు కాపాడాలి అనేదే ఈ  కథ సారాంశం.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!