ఆశ్రమం

ఆశ్రమం

రచన : మాధవి కాళ్ల

              కాలేజీకి వెళుతున్న ఒక అమ్మాయిని కొంత మంది రౌడీలు కిడ్నాప్ చేస్తారు. అక్కడ ఎవరూ లేరు కాబట్టి ఎవరూ చూడరు. ఆశ్రమంలో అమ్మాయి కోసం వాళ్ళ అక్క ఎదురుచూస్తూ ఉంటుంది. ఎంతసేపైనా రావడం లేదు అని రాకపోయేసరికి కొంచెం కంగారుతో కాలేజీ కి వెళ్తుంది. అప్పటికే అందరూ వెళ్లిపోయారు అని వాచ్మెన్ చెప్తాడు.

కాలేజీ చుట్టుపక్కల వాళ్ళ ఫ్రెండ్స్ ని అడుగుతుంది ఎవరు రాలేదు అని చెపుతారు.రాత్రి వరకు ఎదురు చూస్తుంది కానీ తన చెల్లెలు రాదు. తర్వాత రోజు పోలీస్ స్టేషన్కు వెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. తను చెల్లెలు కోసం చాలా బాధపడుతుంది. ప్రతి రోజూ పోలీస్ స్టేషన్ కి వెళ్లి అడుగుతూనే ఉంది కానీ ఎస్. ఐ. మాత్రం మీ చెల్లి ని కిడ్నాప్ చేసిన దగ్గర సీసీ కెమెరాలు లేవు ఎవరు చూడలేదు, ఏ సాక్ష్యం లేదు ఎంక్వయిరీ చేస్తున్నాను అని చెప్పాడు. తన చెల్లెలు గురించి బాధపడుతూ ఆశ్రమానికి వెళ్ళిపోయింది స్వాతి.

                                 కొన్ని రోజులు తరువాత ఆశ్రమం మొత్తం అలంకరిస్తున్నారు. పంతులుగారు వచ్చి రామయ్యని అడుగుతున్నారు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారా?. పెళ్లి కి కావలసిన ఏర్పాట్లు పూర్తి చేసాము, ఇంకా ఏమైనా కావాలంటే చెప్పండి అని చెప్పాడు రామయ్య. రామయ్య ఎవరో కాదు ఈ ఆశ్రమానికి పెద్ద ఆశ్రమంలో ఉన్న వారిని తన కన్నబిడ్డల చూసుకుంటాడు. పంతులుగారు పెళ్ళికొడుకుని పిలవండి అని చెప్తాడు. కార్తీక్ వచ్చి పెళ్లి పీటల మీద కూర్చుంటాడు తర్వాత పెళ్లి కూతురుని కూడా పిలుస్తారు, స్వాతి కూడా కార్తీక్ పక్కన కూర్చుంది. ఉన్నంతలో పెళ్లి ఘనంగా చేస్తారు రామయ్య. తర్వాత భోజనం ఏర్పాట్లు చేశారు అందరూ చాలా ఆనందంగా ఉన్నారు.

చిన్నతనం నుంచి ఇద్దరు ఆశ్రమంలో పెరిగారు. ఇప్పుడు మంచిగా చదువుకొని ఒకే కంపెనీలో జాబ్ చేస్తున్నారు కార్తీక్ స్వాతి. వాళ్ళ ఆఫీస్ దగ్గర ఒక ఇల్లు తీసుకున్నారు.. మంచి మనసుతో కార్తీక్ స్వాతి ప్రేమని ఒప్పుకుని పెళ్లి చేశారు. ఈరోజు సాయంత్రం ఇంటికి వెళ్లిపోతారు. ఆశ్రమం నుంచి వెళ్తుంటే చాలా బాధపడింది స్వాతి. ఏడవకు స్వాతి ప్రతిరోజు సాయంత్రం వద్దాం అని చెప్పాడు కార్తీక్.
ఇంటికి వెళ్లి హ్యాపీగా గడిపారు ప్రతి రోజు ఆఫీస్ కి వెళ్లి రావడం సాయంత్రం ఆశ్రమానికి వెళ్లడం జరిగేది.. ఒకరోజు భోజనం చేస్తూ పిల్లలు అందరూ సడన్గా పడిపోయారు హాస్పిటల్ కి తీసుకొనివెళ్ళారు.. డాక్టర్ చూసి రిపోర్ట్స్ వచ్చే వరకు వెయిట్ చేయమని చెప్పారు స్వాతి, కార్తిక్ లకు. సాయంత్రం రిపోర్ట్స్ వచ్చి డాక్టర్ చూస్తున్నారు కార్తీక్ స్వాతి అప్పుడే లోపలికి వచ్చారు. డాక్టర్ రిపోర్ట్ చూసి ఫుడ్ పాయిజన్ అయ్యిందని చెప్పాడు, దాంట్లో కొంత మంది పిల్లలకి సీరియస్ గా ఉందని కూడా చెప్పాడు. కొంచెం కంగారు పడ్డారు కార్తీక్ స్వాతిలు.. కంగారు పడకండి ఏం కాదు 24 గంటలు గడిచిన తర్వాత చూద్దాం అని చెప్పాడు డాక్టర్. కార్తీక్ కి రాజేష్ ఫోన్ చేస్తాడు.. ఏంటి రాజేష్ చాలా రోజుల తర్వాత ఫోన్ చేసావ్ ఎలా ఉన్నావు? అని కార్తీక్.. నాకు పోలీస్ జాబ్ వచ్చింది మీ ఊరికి కొత్తగా ఎస్.ఐ గా వచ్చాను అని చెప్పాడు రాజేష్.

చాలా సంతోషం రా! అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు కార్తీక్. తరవాత రోజు ఐదుగురు పిల్లలు చనిపోయారు, ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోవడం ఏంటి!? అని కార్తిక్ కి అనుమానం వచ్చింది. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు అక్కడ రాజేష్ చూసి అన్ని వివరాలు చెప్పాడు. అప్పుడే కొంతమంది రౌడీలు రామయ్య మీద దాడి చేశారు ఆ దాడిలో రామయ్య చనిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రాయుడు ఆశ్రమాన్ని తగల పెట్టాలి అనుకున్నాడు, అయితే ఈ విషయం తెలుసుకున్న రాజేష్ కార్తీక్ ఆశ్రమంలో ఉన్న వాళ్లను రక్షించారు. తర్వాత కొద్ది రోజుల క్రితం అమ్మాయిల కిడ్నాప్ పై ఎంక్వయిరీ చేస్తే దాంట్లో రాయుడు హస్తం ఉందని తెలుసుకున్నాడు రాజేష్. సాక్ష్యాధారాలతో వస్తున్నా రాజేష్ ని చంపాలని అనుకుంటాడు రాయుడు. ఈ విషయం తెలుసుకున్న కార్తీక్ రాజేష్ ని కాపాడుతాడు, రాయుడు ఎవరో కాదు రామయ్య కొడుకు అని రాజేష్ కార్తిక్ కి చెప్తాడు.. అవునా మరి రామయ్య గారిని ఎందుకు చంపాడు అని కార్తీక్ రాజేష్ ని అడుగుతాడు..
ఎందుకంటే ఆశ్రమము ఉన్న స్థలం రాయుడికి కావాలి మర్యాదగా అడిగితే ఇవ్వరు కాబట్టి అందుకే రామయ్య ని  రౌడీల చేత దాడి చేయించి చంపించాడు రాయుడు. రాయుడు ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశ పెట్టారు తగిన సాక్ష్యాధారాలతో నిరూపించారు.. అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి ఎక్కడ పెట్టారో వాళ్లకు ఇక్కడికి తీసుకు రావాలని కోర్టు ఆర్డర్ వేసింది. రెండు రోజుల తర్వాత ఆ అమ్మాయి వాళ్ళు వారి కుటుంబాలకు అప్పజెప్పారు.. ఆ అమ్మాయిలు లో స్వాతి చెల్లి ప్రియా కూడా ఉంది. కొన్ని రోజుల తర్వాత ప్రియా కి రాజేష్ కి పెళ్లి చేశారు.. అందరూ కలిసి ఆ ఆశ్రమాన్ని చూసుకుంటున్నారు.

You May Also Like

2 thoughts on “ఆశ్రమం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!