మసి పట్టిన మస్తిష్కం

(అంశం:”అంతరంగం ప్రశ్నిస్తే’)

మసి పట్టిన మస్తిష్కం

రచన: కార్తిక్ నిమ్మగడ్డ

మసి పట్టిన మస్తిష్కం తోసి రాజని
చెల్ల చెదురు అయిన ఆలోచనలు
కట్టిపెట్టి కావ్ కావ్ అంటూ
కొట్టు మిట్టాడుతు అడిగే అంతరంగం
ఇంకా మిగిలి ఉందా ప్రశ్నకై నాలో?
పిచ్చి తాపత్రయం కాకపోతే!
చిరుగు జేబుల చిల్లర చప్పుడుల్లో..
మాయ మర్మ చిరు నవ్వుల్లో…
ముసుగు వేసిన మనిషి మాటల్లో…
నమ్మక ద్రోహ జాతి అవసరాలలో…
రగిలే జానెడు పొట్ట జ్వాలల్లో…
నిస్సహాయ పరిస్థితుల్లో తప్పక
తల ఒగ్గి నేను మనిషినే అన్న
విషయం మరచి నాకు ఓ
అంతరంగం ఉంది అన్న ఆలోచనకే
ఊరి బిగించి బ్రతికే రోజుల్లో…
మళ్లీ అంతరంగం ప్రశ్నించే అవకాశం ఉందా…

You May Also Like

5 thoughts on “మసి పట్టిన మస్తిష్కం

  1. మీ భావాల జల్లుల్లో అక్షరాలు ఎప్పుడు పోటీపడుతుంటాయి అనుకుంటా.మీ అక్షరాలు మిమ్మల్ని మీ అంతరంగాన్ని ప్రశ్నిస్తుంటే.
    మీ రచనలు మా మనస్సులను ప్రశ్నిస్తున్నాయి.
    అద్భుతంగా రాయడం మమ్మల్ని ఆలోచింప చేయడం మీకే చెల్లింది అక్షరమహర్షి గారు👌👌👌👏👏👏💐🙏

  2. …. ప్రశ్నించే అవకాశం వుందా అని ప్రశ్నించే మీ అంతరంగం బాగుందండి 👌🙏

  3. మీ రచనలు ఎప్పుడు చదివిన కొత్త ఆలోచనలు, అవును మనం ఇలాగే బ్రతుకుతున్నాము కదా ఇది కాదు కదా..బ్రతడం అంటే అన్న నిజంలోకి లాగుతాయి.. అందరూ మర్చిపోయిన వాస్తవాలను, అసలుసిసలు జీవితనికి అర్థం మీ రచనల్లో కనపడుతుంది. మీరు రచయితలు అందరిలోకి ప్రత్యేకం👏👏👏👌👌👌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!