కన్నీటి జలపాతం

(అంశం:”అంతరంగం ప్రశ్నిస్తే’)

కన్నీటి జలపాతం

రచన: పోలగాని.భానుతేజశ్రీ

మదినిండిన భావాలు మనసుని ముంచెత్తుతుంటే
మౌనమే మాటలయ్యి సరిగమలు పలుకుతుంటే..

భావాల బంధీగా నా మనసు వేదన పరీక్షలు రాస్తుంటే
నిత్యం సెలయేరులా పొంగే నా మాటలు ఇంకిపోతుంటే…

ఆత్మ జపిస్తూ శివయ్యనే కదిలిస్తుంటే
కటిక చీకటి కూడా నన్ను చూస్తూ నవ్వుతుంటే…

నిండు పౌర్ణమి లాంటి నా మోము అమావాస్యలా మారుతుంటే
జలపాతమే నా కంట కన్నీరై ప్రవహిస్తుంటే…

అంతరంగాన నిండిన ప్రశ్నలు గొంతెత్తి అరుస్తుంటే
మూగబోయిన నా గొంతు మౌనంగా రోధిస్తుంటే…

ఏమని సమాధానం ఇవ్వను
బాధకు బంధీని నేననా…!!!
ఆవేదనకు అర్థం నేననా…!!!
అనుభవాలు నేర్చిన మౌనాన్ని నేననా…!!!
భావాలు తెలుపలేని రాతిని నేననా…!!!

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!