మనసు అందం

మనసు అందం

రచయిత: పి.వి. యన్. కృష్ణవేణి

నా మనసులోని ప్రేమ కల్మషం అంటనిది

నా మనసులో నీపై ఉన్న ప్రేమ
స్వచ్చమైనది

నా మదిలో కదలాడే నీ ఊహాలు
మలినం అంటనివి

నిన్ను చేరే ఆ తీరం నాకెంతో
సుధూరమైనది

నువ్వు ఊహల్లో రాని సమయాన ఆ కాలం నాకు ఒక సాగని పయనం

నిన్ను తలంపులో నిలుపగా నా మనసే ఒక నందనవనం

నీ ప్రేమచూపు తగలని నా మనసు అందం అడవి కాచిన వెన్నెలే కదా

నన్ను నీ హృదయంలో నిలుపని నీ నిర్లక్ష్యం నాకు ఒక పెద్ద శిక్షే అవదా

ఇది నా ఒక్కదాని ప్రేమ నీరీక్షణే కాదు, ప్రతి యొక్క ప్రేమ హృదయ
వేదన ఇది

దిక్కు తోచని స్తితిలో ఉన్న
ఒక వైపు నుంచి ప్రేమ కలిగిన ప్రతి యొక్క ప్రేమికుల హృదయ స్పందన ఇది.

ప్రేమని పరీక్షించకు – మనసు చిన్నపోతోంది.
ప్రేమను ప్రశ్నించకు – జవాబు ఉండదు
ప్రేమను ఆస్వాదించు – ఆనందించు
ప్రేమతో పోరాడు – జయం పొందు.

ప్రేమ లేని జీవితం అడవి కాచిన వెన్నెల
ప్రేమ నిండిన జీవితం అవుతుంది బంగారు లోకం…

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!