కొసమెరుపు

కొసమెరుపు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన- సుజాత కోకిల

ఆ రోజు ఇళ్లంతా సందడిగా వుంది.శాస్త్రిగారు ఒకటే హడావుడి పెడుతున్నారు శాస్త్రిగారు భార్య మాణిక్యమ్మగారు నిదానస్తురాలు చాలా ఓపిక శాస్త్రిగారు ఏమన్నా ఓపిగ్గా సమాధానం చెప్తుంది పూజ కావాల్సిన పూజా సామాగ్రినంతా తెచ్చిపెట్టింది. అయినా కూడా ఏదో చిన్న గొడవ పెడుతునెే ఉన్నారు ఎందుకండి  అంతా గొడపెడుతున్నారు.తెస్తున్నానుగా అంది.ముక్తసరిగా తన మనసంతా తన చిన్న కొడుకైన రవి పైనే ఉంది.చిన్నప్పుడే ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయాడు.రవి గురించి మాణిక్యమ్మ గారికి బెంగగా ఉండేది.
పైకి చెప్పుకోలేదు రవి అంటే చాలా ప్రేమ ఎదురు చూడగా ముగ్గురు బిడ్డల తరవాత రవి పుట్టాడు తనకు వంశోధ్ధారకుడు కొడుకు పుట్టాడని మురిసిపోయేది. చిన్నకొడుకైన రవి అంటే చాలా ప్రేమ శాస్త్రిగారు ఇవేమీ పట్టించుకోరు.
ఆయన అదోరకమైన మనిషి తన కొడుకు అంటే తనకు చాలా ప్రేమ కానీ పైకి అలా కనిపించరు.చాలా గాoభీరంగా కనిపిస్తారు. తన బాధనంతా పూజలతో గడిపేస్తారు.
బయట చూసే వాళ్లకు మాత్రం.శాస్త్రిగారికి పిల్లలంటే ప్రేమ లేదా అన్నట్టుగా కనిపిస్తారు ఎవరికి ఉండదు చెప్పండి మగాళ్లు బయటపడరు.ఆడ పిల్లలపై ప్రేమ ఎక్కువ ఉంది అనుకుంటారందరు.ఆడ పిల్లలు ఇంటిపట్టున ఉండి అన్ని సవరించేవారు.
బయట వాళ్లకు శాస్త్రి గారంటే చాలా మర్యాద గౌరవం ప్రేమ! గౌరవం లేని ఇంటికి వెళ్లరు.అందరితో కలివిడిగా మర్యాదగా ఉంటారు.
ఏంటి మాణిక్యం ఎం ఆలోచిస్తున్నావ్ వంటవాడు వచ్చాడు.వంటకు సిద్ధంచేసావ అంటూ చిన్నత్త గారు అడిగారు.మీ చిన్న మనవరాళు అన్నీ చూసుకుంటుంది అని చెప్పింది సరే ఎక్కడ పని అక్కడే ఉంది అన్నీ నేనే చూసుకోవాలి మాణిక్యంగారి అత్తగారు పోగానే చిన్న అత్తగారు ఇక్కడే ఉంటుంది.అన్ని పనులు చూసుకుంటుంది.తనకు ఎవరూ లేకపోవడంతో ఇక్కడే ఉంటుంది.
ఈరోజు నుండి రామ నవరాత్రలు మొదలు పెద్ద పెద్ద వేద పండితులు వచ్చారు శాస్త్రోక్తంగా జరిపిస్తున్నారు ఇది వెనుకటి నుండి వస్తున్న ఆచారం పండితుల మంత్ర ఉచ్చారణతో మారుమ్రోగుతున్నది.అందరూ శ్రద్ధగా వింటున్నారు. పూజా కార్యక్రమం ముగిసే సరికి రెండు అయిపోయింది.భోజనాల కార్యక్రమం అందరూ తృప్తిగా భోజనం చేశారు.
వస్సు అంటూ మాణిక్యమ్మగారు పిలిచారు ఏంటమ్మా చెప్పు అంటూ వచ్చింది.తమ్ముడి జాడ ఏమైనా తెలిసిందా అంటూ అడిగింది. నువ్వు టెన్షన్ పడకు అమ్మ వెతుకుతున్నారు అంది.
కొడుకు రాక పోవడంతో మంచం పట్టింది.శాస్త్రిగారు ఎంత ధైర్యం చెప్పిన మాణిక్యమ్మగారు గోలుకోలెేదు మనస్తాపంతో హుషారుగా ఉండేది కాదు అలాగే ముగ్గురు పిల్లల పెళ్లిళ్లు కానిచ్చారు.
శాస్త్రిగారికి కూడా అప్పుడప్పుడు బాగుండడం లేదు ఎలాగోలా బలం తెచ్చుకుని కాలం గడుపుతుండే వారు. ఎలాగైతేనేమి ఈవార్త రవికి తెలిసింది.రవి వచ్చాడు
మాణిక్యమ్మగారి ఆనందం ఇంతా అంతా కాదు ఒక్కసారిగా లేచి కూర్చుoది.అమ్మ ఎందుకు లేస్తున్నావ్ పడుకో అన్నాడు.నాకు ఏమైంది నేను బాగానే ఉన్నాను అంది.హుషారుగా లేచిoది వెయ్యేనుగుల బలం వచ్చినట్టయింది.రవికి ఇష్టమైన పిండి వంటలు వండి పెట్టింది.అందరూ ఆశ్చర్యపోయారు.అందరికీ తెలిసిపోయింది కొడుకు మీద బెంగ వల్లనే ఇలా అయిందని విధి వెక్కిరించినట్టుగా శాస్త్రిగారు కన్నుమూశారు.మాణిక్యంగారే పోతారనుకున్న టైములో శాస్త్రి గారు కన్ను మూశారు.ఆమె బాధ వర్ణించలేం.ఇన్ని రోజులు ఇల్లు పట్టుకుని లేడు ఇప్పుడు వచ్చాడు ఆస్తి కోసమే వచ్చాడని పెద్దక్కకు కోపము.ఇంట్లో ఉండనిచ్చేది కాదు చాలా విసుక్కునేది.
ఇన్ని రోజులు తన బ్రతుకు తను బ్రతికాడు ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు.తల్లికి మాయమాటలు చెప్పి తల్లిని మార్చింది.కొడుకు మీద ఉన్న ప్రేమనంత హుష్ కాకిలా పోగొట్టింది.నానా బీభత్సం చేసింది.పుట్టి పెరిగింది అక్కడే పెళ్లయ్యాక కూడా భర్తతో ఇల్లెంట లా వచ్చింది
తనని రమ్మన్నా వారెవరూ లేరు.అధికారం అంతా తన గుప్పిట్లో పెట్టుకుంది. మిగితా చెల్లెల్ని కూడా రానిచ్చేది కాదు? సగం ఆస్తి తనెే అపహరించింది.          ఆస్తి ఇవ్వనని భయపెట్టింది వాడు మానసికంగా కుంగిపోయాడు ఇలావుంటే నాకేమీ ఆస్తి ఇవ్వరు అన్న ఉద్దేశంతో తన భాగం ఏదో తీసుకొని వెళ్ళిపోయాడు. అయినా కూడా అక్క అంటే ప్రేమతో మేనకోడలి పెళ్లి ఘనంగా జరిపించాడు కాని అవిశ్వాసం ఏమాత్రం లేదు.
ఏనాడూ తన కష్టసుఖాలు చెప్పుకోలేదు తన మానాన తను బ్రతికేవాడు.వీలైనంత లో నలుగురు పెట్టేవాడే కానీ తను ఏనాడూ చేయిచాచి ఎవరినీ అడగలేదు.      కొసమెరుపులా వచ్చి నేనున్నానని ధైర్యం చెప్పి అందరితో కలిసిమెలిసి ఉండి తన బాధను ఎవరితో చెప్పుకోలేక తన బాధను తనే అనుభవిస్తూ కొస మెరుపులా మెరిసి అందనంత దూరాలకు వెళ్లిపోయాడు.ఏంటో కొందరి జీవితాలు సగంలోనే అంతమవుతాయి. కష్ట సుఖాలు నలుగురితో పంచుకోవాలి లేకుంటే ఒంటరి తనం ఏర్పడి మానసికంగా చాలా నలిగిపోయి మనం ఏం చేస్తున్నామో మనకెే తెలియదు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!