తోయిబా

తోయిబా

రచన:ఎన్.ధన లక్ష్మి

అనుకోకుండా దారిలో ఎదురైనా సమస్యను అధిగమించిన చిన్నారుల కథ….
**

అమ్మమ్మ ఊరికి సెలవులకి అని వచ్చాడు పది ఏళ్ల బంటి..
అదే ఊరిలో ఉండే బన్నీ అనే ఆరేళ్ల పిల్లాడుతో స్నేహం కుదిరింది..
బంటి ,బన్నీ కలిసి ఆడుకునేవారు.పెద్దవాళ్ళు ఏమి ఇచ్చినా సరే పంచుకొని తినేవారు. కలిసిన కొద్దీ రోజులకీ ప్రాణ స్నేహితలయ్యారు ఇద్దరు..
ఆ ఊరిలో రామ్ అనే  యువకుడు ఉండేవారు.
అతను పట్నం లో  పెద్ద చదువులు చదివి ఉంటారు.
ఎన్నో కంపెనీల నుండి ఆఫర్స్ వచ్చినా  కూడా వెళ్ళకుండా తన గ్రామానికి వచ్చి తన నాన్నకి వ్యవసాయ పనుల్లో చేదోడవాదోడుగా ఉంటారు.తన తెలివితేటలతో గ్రామాన్ని ఎంతో గొప్పగా తీర్చిదిద్ది ఉంటారు.రాత్రి వేళల్లో ఊరిలోని వారు ఎవరైనా చదవాలని ఆసక్తి చూపిస్తే వారికి నేర్పించేవారు.. రామ్ అంటే ఆ ఊరిలో అందరికీ ఇష్టం మరియు గౌరవం కూడా..సాయంకాలం వేళలో  పిల్లలందరికీ  కథలు చెప్పేవారు..తెలియని ఎన్నో విశేషాలను నేర్పేవారు..పిల్లలందరూ రామ్ అన్నయ్య అంటు ఎనలేని అభిమానం చూపేవారు..అలా బంటి,బన్నీ కూడా చేరారు ఓ రోజు సాయంకాలం…
రామ్ కథన్నీ చెప్పడం మొదలుపెట్టారు
” ఒక అడివికి రాజైనా సింహం  విచ్చలవిడిగా
అడివిలో ఉండే అన్ని జంతువుల మీద పడి దాడి చేసేది.జంతువులు అన్నీ చేరి సింహంతో ఓ ఒప్పందం చేసుకున్నారు.రోజుకొక జంతువు స్వయంగా ఆహారం అవుతాము అని..
వేటాడే బదులు ఆహారం తన దగ్గరికి వచ్చి చేరుతోంది కదా సింహం కూడా ఆనందంగా  అంగీకరించింది..అలా రోజుకొక జంతువు స్వయంగా సింహం దగ్గరికి వెళ్ళసాగాయి.అడివిలో జంతువులు తగ్గిపోసాగాయి.ఆ జంతువులలో ఒక్కటైనా కుందేలు చాలా బాధ పడసాగింది. సింహానికి బుద్ది చెప్పాలని అనుకుంది. ఓ పథకం ఆలోచించింది..తన వంతు వచ్చింది.సింహం దగ్గరికి కావలనే ఆలస్యంగా వెళ్ళింది.  సింహంకి కోపం వచ్చి ఆలస్యానికి కారణం అడిగింది.
కుందేలు వినయంగా నమస్కరించి అడివిలో ఇంకో సింహం వచ్చింది అడివిలో ఉన్న అన్ని జంతువుల మీద దాడి చేస్తూ ఈ అడివికి తానే రాజు అని ప్రకటించుకుంది.దాని భారి నుంచి తప్పించుకొని వచ్చాను అని చెప్పింది.
సింహానికి కోపం తారాస్థాయికి చేరుకుంది..నేను ఉండగా ఈ అడివికి ఇంకొకరు ఎలా రాజు అవుతారు
అది ఎక్కడ ఉందో చూపించు దాని అంతు చూస్తాను అంటు ఆవేశంగా కుందేలు వెంట పయనం అయ్యింది..
కుందేలు బావి దగ్గరికి వెళ్లి ,ఇంకో సింహం లోపల దొక్కొన్ని ఉంది అని చెప్పింది.
సింహం కూడా వెళ్లి లోపలకి తొంగి చూసింది..
నీటిలో తన ప్రతిబింబం కనపడగానే కోపంగా గర్జించింది..లోపలన్న ప్రతిబింబం అలాగే గర్జించింది..
ఆవేశంలో ఉన్న ఎవరైనా సరే ఆలోచన విధానాన్ని కోల్పోతారు ఇక్కడ ఇదే జరిగింది.ఆవేశంలో ఉన్న సింహం అలాగే లోపలకి దూకేసింది..అలా కుందేలు తన తెలివితేటలతో సింహం భారీ నుండి తనని తాను రక్షించుకోవడంమే కాకుండా తన తోటి జంతువులని అందరిని కాపాడింది..”
ఈ కథ విన్న పిల్లలు కుందేలు ఎలా చేయగలిగింది.
అన్న అంటే రామ్ ” ఈ రోజు మీకు కొత్త పదాన్ని నేర్పిస్తాను అన్నాను కదా పిల్లలు…ఆ పదం ఏంటో తెలుసా “తోయిబా” అంటే ఆత్మవిశ్వాసం ..
కుందేలకు ఉన్నది అదే తోయిబా…
తను ఉన్న ఆకారాన్ని కానీ, బలాన్ని కానీ తక్కువ అంచనా వేయలేదు.తనని తాను నమ్మింది…
ఇప్పుడు చెప్పండి పిల్లలు మనకు ఉండవలసింది ఏంటి “తోయిబా ” అని ఒక్కసారిగా పిల్లలందరూ అన్నారు…
కథ కంచికి పిల్లలందరూ ఇంటికి వెళ్ళారు.కానీ బన్నీ , బంటి ఇద్దరు వెళ్లకుండా ఆడుకుంటూ జనసంచారం లేని ప్రదేశానికి వెళ్లిపోయారు..
బంటి ఆడుకుంటూ చూసుకోకుండా వెళ్ళిపోతూ బావిలో కాలు జారీ పడిపోయాడు..తనకి ఈత కూడా రాదు..
తనని కాపాడమని బన్నీని అడగసాగాడు…
బన్నీకి ఏమి చేయాలో పాలుపోలేదు..చుట్టూ పక్కల ఎక్కడ కూడా జనాలు లేరు..
కళ్ళు మూసుకొని రామ్ అన్న చెప్పిన కథాన్నీ గుర్తుకు తెచ్చుకున్నాడు.తోయిబా అనుకుంటూ దగ్గరలోన్న తాడును తీసుకొని లోపలికి విసిరేసి
బంటిని గట్టిగ పట్టుకోమని చెప్పి  బన్నీ తన శక్తిని ఉపయోగించి పైకి బలంగా లాగుతూ ఒక అరగంట తరువాత పైకి తీసుకొని వచ్చాడు..
పైకి రాగనే ఒకరిని ఒకరు హత్తుకొని తనివితీరా
ఏడచారు…
ఊరిలోకి వెళ్ళి జరిగింది మొత్తం వాళ్ళకి చెప్పారు…
అందరూ ఆశ్చర్యపోయారు.ఆరేళ్ల పిల్లాడు పదేళ్ల పిల్లాడిని ఎలా కాపాడాడు అని
అక్కడే ఉన్న రామ్ నవ్వుతూ ” ఇంత కష్టమైన పనిని కూడా  బన్నీ అంతా సులువుగా ఎలా చేశారో తెలుసా ఎందుకంటే వారిని ఎవరు కూడా మీరు ఈ పని చేయలేరు ,మీకు చేతకాదు అని ఎవరు ఆపలేదు.బన్నీ తనని తాను నమ్మాడు.అందుకు అది సాధ్యపడింది.”
మీరు చెప్పిన తోయిబా మంత్రం వల్లే ఇదే
సాధ్యపడింది అని చాలా ఆనందంగా బన్నీ చెప్పాడు
అక్కడే ఉన్న  గ్రామస్థులు అంతా ఏంటి అన్నారు…
” తోయిబా….. ఆత్మవిశ్వాసం అని చెప్పారు అక్కడే ఉన్న పిల్లలంతా ఏకకంఠంతో అన్నారు..
బంటి కూడా ఎన్నో విలువైన విషయాలను నేర్చుకొని ఇంకా ఎప్పుడు సెలవులు వచ్చిన ఈ గ్రామానికి తప్పకుండా వస్తాను అని తన మిత్రులందరికీ బాధగా వీడ్కోలు చెప్పి తన ఊరికి పయనం అయ్యారు..
“నేను ఈ ఊరిని , బన్నీని, రామ్ అన్నని ముఖ్యమైన తోయిబా మంత్రాన్ని ఎప్పటికీ మరచి పోను అని తన మనసులో అనుకున్నాడు బంటి “

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!