చిత్రం భళారే విచిత్రం

(అంశం::”చిత్రం భళారే విచిత్రం”)

చిత్రం భళారే విచిత్రం

రచన:: జ్యోతిరాణి

ఒక చిత్రం
కనిపించే దృశ్యం వెనుక
కనబడని శ్రమజీవితాలెన్నో

కనపడే కథ వెనుక
ఎన్నోసార్లు కథను
మలచడంలో చేసిన
ప్రయత్నాలు ఎన్నో..

ఒక భావం రావడానికి
తనలో తాను నటిస్తూ
అదే భావం రాబట్టడానికి
తనలోని తనను
ఓర్పుగా ఉంచుకున్న క్షణాలెన్నో..

ఒక చిత్రం వెనుక
మారిపోయే తారల అంచనాలే కాకా
అదే ఆధారంగా బ్రతికే
మనుషుల జీవితాలెన్నో..

24 రంగాల వారు తమను
తమ కుటుంబాన్ని మరిచి
24 గంటలు దాదాపుగా
కష్టపడితే వచ్చేదే చిత్రం..

ఒక చిత్రం వాస్తవ ప్రపంచం నుండి
పాత్రల చుట్టూ లీనమయ్యేవి కొన్ని..
పాత్రలలో తమలోని
తమను చూసుకునేవి కొన్ని
ప్రశ్నించేలా కొన్ని..
ఎన్నో చిక్కుముడులకు
సమాధానంగా కొన్ని
హాయిగా నవ్వుకునేల కొన్ని
ఎన్ని సార్లు చూసిన
ఏదో ఒక కొత్తదనం
ఉంది అనేలా మైమరిపించే
చిత్రాలు ఎన్నో..
గుండెలను పిండేసినట్లు
హృదయాన్ని తాకేవి కొన్ని..
సులువుగా సందేశాత్మకంగా
వీక్షకులను చేరేవి కొన్ని
అందరి జీవితాలు
ఎదో ఒక విషయంలో
చిత్రం తో ముడిపడినవే
నిజంగా చిత్రం భళారే విచిత్రం
అందరిని మంత్రముగ్ధులను
చేస్తూ ఆనందాన్ని పంచుతుంది..

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!