పెండ్లి

(అంశం:: “నా ప్రేమ కథ”)

పెండ్లి

రచన: చెరుకు శైలజ

గోవిందరావు విమలకు ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు ముగ్గురి పెళ్లిళ్లు అయిపోయాయి. చిన్న కూతురు పెళ్లి తాను పదహారేళ్ళ వయసు లో చేద్దాం అనుకుంటు ఉండగానే, నాన్నా నేను ఇప్పుడే పెళ్లి చేసుకొను డిగ్రీ వరకు చదువుకుంటాను అంది . పెళ్లి అయ్యక చదువుకోవచ్చు అని నచ్చ చేప్పాడు. కాని తను వినిపించుకోలేదు. మిగితా కొడుకులు కూతురు కూడా చదువుకొని నాన్న మాకంటే చిన్న తనంలో పెళ్లి చేశావు ఇప్పుడు రోజులు మారాయి కదా అన్నారు.ఆ విషయంలో తల్లివిమల ఏమి మాట్లాడలేకపోయింది.
ఊరులో పెద్ద వ్యవసాయదారుడు మంచి పేరు పలుకుబడి ఉంది గోవిందరావుకి. ఇంట్లో జీతగాళ్లు పాడి పంటలతో ఎప్పుడు ఇల్లు కళకళ లాడుతు ఉండేది. విశాలి తన డిగ్రీ చదువు కోసం పట్నం లో పెద్ద అన్న ఇంట్లో ఉండి సాగించింది. విశాలి డిగ్రీ చివరి సంవత్సరం లో గోవిందరావు గుండె పోటు తో మరణించారు. తన చిన్న కూతురి పెళ్లిచేయకుండనే భర్త కన్ను మూశాడని విమల ఏడుస్తూనే ఉంది .ఆయన చనిపోయిన పదిహేను రోజులు ఊరంతా భోజనాలు .పది మంది అయ్యావారులతో చాలా బాగా కర్మ కాండలు జరిపించారు . పెద్ద కొడుకు విమలతో అమ్మ ఇక్కడ నువ్వు ఒక్క దానివి ఎలా ఉంటావు. మాతో వచ్చేయి నా దగ్గర తమ్ముడు దగ్గర ఉందువు అన్నాడు. లేదురా ఇప్పుడే నేను ఈ ఇంటిని వదిలి రాను. మరి చేతకానప్పుడు చూద్దాం .ఈ లోపు మీరు చెల్లెలుకు ఒక మంచి సంబంధం చూడండి.
ఈ సంవత్సరం లోపే చేస్తే ఆయన ఆత్మ కైన తృప్తి గా ఉంటుంది. లేకపోతే ఆయనకు బిడ్డ పెండ్లి గురించే బాధ ఉండేది. పెళ్లి చేద్దాం అనుకునెంతలో అకస్మాత్తుగా ఇలా జరిగింది. అంటు కండ్ల నీళ్లు పెట్టు కుంది.సరే అమ్మ చూద్దాం అన్నారు కొడుకులు. అందరు వెళ్లి పోయారు ఊరులో అమ్మ కి తోడు గా విశాలి ఉంది. సంబంధాలు చూస్తున్నారు కాని అందరు చూసి వెళ్లడమే కాని ఏవరు యస్ చెప్పడం లేదు . విశాలికి ప్రతి ఒక పెళ్లి చూపులకు అన్నల దగ్గరకు వెళ్లడం మరల ఊరుకి వచ్చి తల్లి దగ్గర ఉండడం. తన డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు రాసి ఊరీకి వచ్చేసింది.పై చదువుదాం అంటే తలి ఒప్పుకోవడం లేదు. ఏమనలేక తల్లితో ఉండిపోయింది. పెద్ద కొడుకు ఒకరోజు ఊరికి వచ్చాడు . అమ్మ ఒక సంబంధం చూశాను. చెల్లెలకు రేపు వచ్చి చూస్తారు వాళ్ళు. మీరిద్దరూ రండి నాతో అన్నాడు. నేను ఎందుకు రా నువ్వె చెల్లెలుని తీసుకోని వెళ్ళు. కుదిరీతే నేను వస్తాను లే అంది. సరే విశాలిని తీసుకొని వెళ్ళాడు. విశాలికి పెళ్లి చూపులు ఇష్టం లేదు. ఏమి చెప్పలేక అన్నతో వెళ్లింది. పెళ్లి చూపుల రోజు విశాలికి స్నానం కూడా చేయాలనిపించలేదు.మొఖం కడుక్కొని సింపుల్ గా బ్లూ షిఫాన్ చీర కట్టుకుంది.చూడడానికి తెల్లగా బొద్దుగా పెద్ద జడతో బాగుంటుంది. కాని తను పెళ్లి చూపులకు వచ్చినవాళ్ళకు ఎందుకు నచ్చడం లేదో ఇప్పటికే అర్థం కావడంలేదు. అబ్బాయి తలిదండ్రులు అక్కలు నాలుగురు వచ్చారు వాళ్ళ పెళ్లిళ్లు అయిపోయాయి. ఒకడే కొడుకు. పెళ్లి చూపులు అయిపోయాయి . ఎవరో ఒకరు వచ్చి చెప్పారు అబ్బాయి అమ్మాయితో మాట్లాడుతడట అన్నారు. నాకైతే మతిపోయింది .ఏం మాట్లాడుతాడో అని భయంగా బయట వరండాలో లోకి వెళ్లి ఆయన ఎదురుగా కూర్చున్నాను . దైర్యం చేసి తలెత్తి పైకి చూడలేకపోయాను. మీతొ ఒక విషయం మాట్లాడాలి అనుకుంటున్నాను. మరి ఇలా భయంగా కూర్చోంటే ఏలాగ విశాలి అన్నాడు. చాలా రోజులకు నా పేరు నాకు ఎంతో కొత్త గా మధురం గా అనిపించింది. అతని గొంతులో ఏదో తెలియని గిలిగింతగాఅనిపించింది .చెప్పాండి అన్నాను. తల పైకి ఎత్తి కుండానే, ఇటు చూడు నన్ను సరిగ్గా చూశావా! నేను నీకు నచ్చానా! మొదటిసారి ఒక అబ్బాయి తన ఇష్టాన్ని అడగడం నిజంగా కలలాగా అనిపించింది. ముందు మీరు చెప్పండి నేను నచ్చనా మీకు నీవు నచ్చవు కనుకనే నీతో ప్రత్యేకంగా మాట్లాడలనుకున్నాను అన్నాడు. నా పేరు తెలుసా విశాలి తెలియదు అన్నట్టు తలుపింది. విక్రమ్ నా పేరు. ఏం తెలుసుకున్నావు .మీరు ఇష్టపడ్డారు అదే చాలు ఏం విషయం నాకు అవసరం లేదు. అన్ని మా అన్నయ్య లు చూసుకుంటారు. అలా ఎలా విశాలి. నాకు ఒక మంచి ఉద్యోగం లేదు .ఏం ఆస్తులు లేవు. సొంత ఇల్లు లేదు. పైగా నేను ఒక్క డినే కాబట్టి మా అమ్మ నాన్న నా దగ్గరే ఉంటారు. నేను చిన్న బిజినెస్ చేస్తున్నాను ఇవి నీకు నచ్చాలి కదా! చాలా పెద్ద ఇంటి అమ్మాయివి .రేపు నన్ను పెళ్ళి చేసుకొని ఏ ఇబ్బందీ పడకూడదు. ‌ఒకసారి ఆ మాటలకు నా మనసు స్పందించింది కండ్లలో వస్తున్న నీళ్లని అదిమి పట్టుకోనీ ఆయనకైసి చూశాను. . ఎంతో అందంగా ఉన్నాడు ఒడ్డు పొడుగు తెల్లని తెలుపు ఆ ఉంగారాల జుట్టు సింపుల్ గా జీన్ ప్యాంటు, టీ షర్ట్ తో చాల చక్కగా ఉన్నాడు ఇప్పుడు నన్ను పూర్తిగా చూశావు కదా! నచ్చానా అన్నాడు. మీరు నచ్చారు. మీ వ్యక్తిత్వం ఇంకా నచ్చింది. ఇంత కన్నా కావాల్సింది ఏముంది.అంది .అవి అన్నీ మనం కలిసే కష్టపడి సంపాదించుకుదాం అంది . థాంక్యూ విశాలి నాకు ఇలాంటి అమ్మాయే కావాలి.ఎప్పుడు నా సపోర్ట్ మీకు ఉంటుంది. నవ్వుతూ అంది ఆమె నవ్వుతో అతను సృతి కలిపాడు. ఏమైందిరా ఇంతసేపు మాట్లాడు కుంటారు అంటు విక్రమ్ చిన్న అక్క వచ్చింది. రేపు పెండ్లి అయ్యాక కొన్ని మాటలు దాచుకోండి అంది .ఈలోపు అందరు నవ్వుకుంటూ వరండా లోకి వచ్చారు. కాఫీలు టిఫిన్ చేసి వాళ్లు వెళ్లిపోతు ఉంటే, విశాలి తలుపు వెనుకల నిలబడి తొంగి చూసింది . విక్రమ్ అది గమనించి ఏదో మరిచిపోయినట్టుగా వెనుకకు వచ్చి విశాలిని చూసి చిన్నగా నవ్వి వస్తాను.తొందరలో ముహూర్తం పెట్టించుకుందాం అన్నాడు .విశాలి నవ్వుతూ విక్రమ్ ను చూసి తన బుగ్గలు ఎరుపెక్కగా సిగ్గు పడుతు లోపలికి పరుగెత్తింది.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!