ప్రతిబింబం

 ప్రతిబింబం

రచయిత :: ఎన్.ధనలక్ష్మి

ప్రేమను పంచే అమ్మవి నువ్వు ..
భరోసాన్నీ ఇచ్చే నాన్నవి నువ్వు ..
నిత్యం పోట్లాడే సోదరి ప్రేమవి నువ్వు ..
నన్ను నాకే కొత్తగా చూపే నేస్తానివి నువ్వు

నా ఆనందాన్ని రెట్టింపు చేసే చెలిమివి నువ్వు ..
నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచే  స్ఫూర్తివి నువ్వు ..
నా అందాన్ని  రెట్టింపు చేసే నా మార్గాన్నివి నువ్వు ….

నేను ఏడిస్తే నువ్వు ఏడుస్తావు ..
నేను నవ్వితే నువ్వు నవ్వుతావు ..
నేను భయపడితే నువ్వు భయపడతావు …

నా ముఖాన్ని అనవసర క్రీం తో కప్పినప్పుడు ….నన్ను నాకే సరి కొత్తగా భయంకరంగా చూపించావు ..
బాహ్య సౌందర్యం కన్నా ..అంతః సౌందర్యం మిన్న అనేలా తెలియచేసావు ..

పగిలిన తరవాత తిరిగి అతకవద్దు ..స్ట్రాంగ్గ ఉండు అని నేర్పిన నా గురువువి
రోజుకి నిన్ను చుడనిదే నాకు పొద్దు గడవదు ..
ఏమి చేయాలి ?ఎలా చేయాలి ?ఎలా ఉండాలి ?
అనే నేర్పు నా ప్రియా అద్దము …

వదలను నిన్ను ఎపుడు !ఇప్పుడు కూడా వస్తున్నా నీ దగ్గరికి ఓ అద్దము !!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!