అమ్మ ద్వేషం వెనక ఉన్న అసలు నిజం

అమ్మ ద్వేషం వెనక ఉన్న అసలు నిజం

ఎన్.ధన లక్ష్మి

కామాక్షీ :
” ఏయే పావని నిద్ర పోయింది చాలు లే …
రేపు పొద్దున్న నీకు పెళ్లి అయ్యి అత్త గారింట్లో ఇలాగే పడుకుంటే నిన్ను ఏమి అనరు పెంచినందుకు నన్ను అంటారు. త్వరగా లేసి వంట చేసి క్యారీ తీసుకొని వేళ్ళు నాకు సీరియల్ చూడడానికి టైమ్ అయింది …
పావని   :
అమ్మ రోజు నేనే చేస్తా కదా ఈ రోజు నువ్వే చేయి….
నాకు ఈ రోజు ఆఖరి పరీక్ష ఉంది….
కామాక్షీ  :
పావని లాగి పెట్టీ ఒక్కటీ ఇచ్చి ఏమి నోరు లేస్తుంది. ఇష్టముంటే, తినాలి అనిపిస్తే చేసి తీసుకొని వెళ్తే వేళ్ళు లేదు అంటే లేదు..పావని బాధగా వాళ్ళ అమ్మ వైపు చూస్తూ  రెఢీ అయి ఏమి తినకుండా వెళ్లిపోయింది.
పల్లవి :
హమ్మయ్యా ! ఇంకా ఎగ్జామ్స్ అయిపోయాయి
ఇంకా హ్యాపీగా మా బావ గాడిని పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోతా..మా ఇంట్లో అందరూ వెయిట్ చేస్తున్నారు ..నా పెళ్ళికి నువ్వు పది రోజులు ముందు రావాలి .నాకు తోడుగా ఉండాలి ఏంటి అర్థం అయిందా.
హే పావని! ఏంటే నేను లోడ లోడ వాగుతున్నా ఏమి మాట్లాడం లేదు
పావని :
నీకు ఏమి పల్లవి మంచి కుటుంబం ఉంది..కళ్ళలో పెట్టుకునే చూసే అమ్మ ,నాన్న ఉన్నారు…
నాకు ఊహ తెలిసేటప్పటికి అమ్మ, నాన్న విడాకులు తీసుకున్నారు..అమ్మ జాబ్ కి వెళ్ళిపోయేది. అప్పటి నుంచి నాకు ఒంటరితనం అలవాటు అయింది .
చిన్నప్పటి నుంచి ఎక్కడకి వెళ్ళాలి అన్న ,ఏమి చేయాలి అన్న నేను ఒక్క దానే వెళ్ళేదానిని.
అమ్మ బాగా చూసుకునేది. ఏమి అయిందో తెలియదు కానీ ఒక సంవత్సరం నుండి నన్ను కనిషం మనిషీ లాగ చూడడం లేదు . అప్పుడప్పుడు అమ్మ కొడుతుంది .ఇష్టమొచ్చినట్టు తిడుతోంది. నాతో ప్రేమగా మాట్లాడి చాలా రోజులయింది తెలుసా!
ఈ పరీక్షలు కోసమే నేను వెయిట్ చేస్తున్న ఇవి  అయిపోయిన తరువాత నేను ఎదో ఒక జాబ్ తెచ్చుకొని  ఈ దగ్గర్లో ఏదైనా రూం తీసుకొని
నా జీవితం నేను బ్రతుకుతాను…
పల్లవి :
వావ్ సూపర్ …నీకు రెక్కలు రాగనే ఎగిరిపోవలి అని చూస్తున్నావు  మరి ఇన్నాళ్లు ఎందుకు చేయలేదు ..
హ్మ్మ్ ..చెప్పు ఎందుకు సైలెంట్ అయ్యావు .
అప్పుడు చేయలేవు ..ఎందుకంటే నీకు అప్పుడు రెక్కలు లేవు కదా… అంతవరకు నీకు మీ అమ్మ అవసరం ఉంది..సమాజంలో  ఒంటరి మహిళ బతకడం ఎంత  కష్టం నీకు తెలియంది కాదు…
మీ అమ్మ గారు అనుకుంటే నిన్ను వదిలి పెట్టి ఇంకో వివాహం చేసుకునే వారు కానీ చేసుకోలేదు… ఇన్నాళ్ళు  బాగా ఉండే అమ్మ ఎందుకు సంవత్సరం నుంచి వింతగా ప్రవర్తిస్తున్నారు .. దాని వెనుక ఉన్న నిజం ఏంటో కన్నుక్కో ..అని కోపంగా చూస్తూ వెళ్లిపోయింది..
అవును ! పల్లవి చెప్పింది నిజమే!! అమ్మ ఒక్కప్పుడు ఇలా ఉండేది కాదు. ఎంత అల్లరి చేసినా కూడా నన్ను కొట్టేది కాదు. నన్ను ఎప్పుడు ప్రేమగా చూసుకునేది. పల్లవి అన్నట్టు  ఏదో ఉంది. . అదేంటో నేను తెలుసుకోవాలి!
పావని అసలు నిజం ఏంటో  కనుక్కోవాలని ఏడుస్తూ ఇంటికి వెళ్ళి వాళ్ళమ్మ  గది మొత్తం వెతికింది. రిపోర్ట్స్ చూసి షాక్ అయ్యి గుండెలు బాదుకుని  కన్నీరు మున్నిరు అయింది. వాటిని కప్ బోర్డ్ లో పెట్టీ తన అమ్మ గురించి తప్పుగా అనుకున్నందుకు తననే తను నిందించుకుంది..
కామాక్షీ :
ఆఫీస్ నుంచి వచ్చి పావనినీ పిలిచి ఇదిగో ఈ అడ్రెస్స్ లో రేపు ఇంటర్వ్యూలు ఉన్నాయి…వెళ్లి జాబ్ తెచ్చుకో..ఇంకా ఎన్నాళ్ళు నా మీద పడి బతుకుతావు . చదువు అయిపోయింది ఇంకా అయిన నీ కాళ్ల మీద నువ్వు నిలపడు…
పావని :
ఏడుస్తూ తన అమ్మను హగ్ చేసుకొని..
నువ్వు క్యాన్సర్ తో బాధ పడుతున్నావు ఎందుకు అమ్మ నా నుంచి ఈ నిజన్నీ దాచి పెట్టావు.
నన్ను దూరం పెడుతున్నావు అనుకున్న ,నన్ను ఎప్పుడు తిడుతూ , కొడుతూ ఉంటావు అనుకున్న కానీ నాకు ఒంటరిగా బ్రతకడానికి కావాల్సిన ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని పెంచుతున్నవు అనుకోలేదు…
కామాక్షీ :
నీకు ఎలా చెప్పను ??
చిన్నప్పుడు మీ నాన్న దూరం అయ్యారు. నేను ఉద్యోగానికి వెళ్తూ  నీకు ఒంటరితనన్ని బహుమతిగా ఇచ్చాను.ఇప్పుడు శాశ్వతంగా దూరం అవుతున్న అని ఎలా చెప్పను??
అందుకే చెప్పలేదు.నేను లేకపోయిన నీ జీవితం నువ్వు బతకాలి.అందుకే నా మీద అసహ్యం కలిగేల చేస్తున్న. అప్పుడు నీకు నా మీద అసహ్యం కలిగి ఒంటరిగ  బతకడం అలవాటు చేసుకుంటావు అప్పుడు నేను పోయాక కూడా నీకు ఎటువంటి బాధ తెలియదు.నిన్ను మానసికంగా చాలా సార్లు బాధ పెట్టా క్షమించు…”
” నువ్వే నన్ను క్షమించు.నా చిన్నతనం నుంచి ఎంతో ప్రేమగా పెంచావో నాకు తెలుసు! అన్ని తెలిసి కూడా నిన్ను తప్పుగా అపార్థం చేసుకున్న నేను..”
తల్లి కూతురు ఒకరినొకరు హత్తుకొని తనివితీరా ఏడ్చారు.నాటి నుంచి పావని వాళ్ళమ్మ ను కంటికి
రెప్పల చూసుకుంది..
పావనికి జాబ్ వచ్చింది…వాళ్ళమ్మ ను ప్రేమ చూసుకోవడం మొదలుపెట్టింది…
పావని ప్రేమ వల్ల ఆవిడ 5 ససంవత్సరాలు బ్రతికి తర్వాత  ఈ లోకం విడిచి పెట్టి వెళ్ళిపోయారు…
” ఆశ ,ప్రేమ మనిషిని బ్రతికిస్తుంది….
నిరాశ,భయం మనిషిని చంపేస్తుంది…”

**

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!