అధరం మధురం

(అంశం :: మనస్సు దాటని ప్రేమ)

అధరం మధురం

రచయిత : : జయ కుమారి

పెళ్లి కూతురు లా ఉంది అమ్మాయి,

ఏముంది  మామా పోరి,

ఇంత అందమైన అమ్మాయి ని పొందలేక పోతున్నా వాడు దరిద్రుడు రా బావ,

మనం ఒక సారి ట్ర్య్ చేద్దామా

ఎవరు లేరు కూడా, చీకటి అనుకుంటూ..
4 త్రాగుబోతు వెదవలు జాను వెనుక పడతారు.

జాను వాళ్ళ నుంచి తప్పించుకోని  ,ఒక చెట్టు వెనకాల దాక్కుని కళ్ళు మూసుకొని

ఎక్కడ ఉన్నావు రాజీ , నీ కోసం ,నీ ప్రేమ కోసం నేను అందరిని వదులుకొని వచ్చేసాను .

భగవంతుడా ఈ దొంగ వెదవలు నుంచి కాపాడి,నా రాజీ దగ్గరకు నన్ను చేర్చు ప్లీజ్…

ఇంతలో ఏవరో భుజం మీదా చెయ్యి  వేయ్యడానికి ట్ర్య్ చేస్తున్నట్టు అనిపించి పక్కనే ఉన్న కర్రతో తలపై కొట్టబోయి ఆగిింది.

ఓయ్ నేనే నేను ఆగు. అనే సరికి ఆశ్చర్యం తొచూస్తూ ఒక పక్క ఏడుపు, మరో పక్క సంతోషం తో ఇడియట్, నిన్ను అని గట్టిగా కౌగిలించు కొని,ఏడుస్తూ..
రాజీ, ఏమైపోయావ్ రా ,
ఉదయం నుంచి నీ ఫోన్ స్విచ్చాఫ్ వస్తుంది.
ఎందుకు?… చెప్పు.!

రాజి:- హే.. ఆగు జాను ,ముందు నీవు కంగారు పడకు, కూల్ గా ఉండు. నేను వచ్చేసాను కదా!ఏడవకు ప్లీజ్  ఊరుకో తల్లి..!నీవు ఏడిస్తే నేను చూడలేను..!

జాను:-ఎంత భయం వేసిందో తెలుసా..!నీన్ను వదిలేసి ఎలా బ్రతకగలను అనుకున్నావ్ రాజీ.!అలా వదిలేసి వెళ్లిపోయావ్!నేను రాను అంటే అలా వదిలేస్తావా!నన్ను రెండు పీకి తీసుకువెళతావ,వదిలేస్తావా.!ఇంకెప్పుడూ అలా చెయ్యకు ప్లీజ్.!లవ్ యు రాజీ.నన్ను ఎక్కడికైనా తీసుకువెళ్లిపో!నాన్న వాళ్ళు వచ్చేస్తారు, నన్ను తీసుకువెళ్లిపోతారు.!నేను ఆ పెళ్లి చేసుకోలేను, నీకు తప్ప వేరేఇంకెవ్వరికి నా మనస్సులో చోటు ఇవ్వలేను.!ప్లీస్ రాజీ, వెళ్లిపోదాం.!అని గట్టిగా పట్టుకొని ఏడుస్తున్న జాను ని తన గుండెలకు హత్తుకొని.!

సరే నీవు ఏడవకు బంగారం, నేను వచ్చేసాను కదా ,పదా వేళదాం!అని కార్ డోర్ తీసి జాను ని కూర్చోపెట్టి.!ఆ నలుగురు పోకిరి వెధవలను ,మరో 4 పీకి .ఇక ఈ పిచ్చి వేషాలు ఎక్కడైనా వేసినట్టు చూసానో ఈ సారి మరోవిధంగా ఉంటుంది.అని వాళ్ళ కి బుద్ది చెప్పి  అక్కడ నుంచి బయలుదేరతారు..

జాను ఇంకా ఏడుస్తూనే ఉంటుంది. ఎందుకు జాను ఇంక ఏడవకు, వచ్చేసాను కధా.అయిన పిచ్చిమొద్దు ఇంత ప్రేమ పెట్టుకొనిఎంత ఫోజు కొట్టవే, ఎంత ఎడిపించావే నన్ను,ఎప్పుడైనా సరిగ్గా మాట్లాడవా  నాతోదగ్గరికి వస్తే దూరంగా పారిపోయేదానివి.పైగా నా పెళ్లికి రా అని ఫోన్ చేసి చెబుతావా!నిన్ను అనిఒక్కటి వేయ్యాలేి నెత్తిమీదా ,నేను రాకపోతే ఏమి చేసే దానివి, అయిన అర్ధరాత్రి ఈ ప్రయోగాలు ఏమిటి?ఒక్క క్షణం ఆలస్యం అయిన ఏమిజరిగేదో తెలుసా!

హా..కానీ నీవు వస్తా వు అని తెలుసు,మన ప్రేమ మీదా నాకు నమ్మకం ఉంది.ఆ శివయ్య నిన్ను నా దగ్గరకు పంపిస్తాడు..

రాజీవ్:-అవునా  !ఆహా.. ఆహా…అయిన ఒక్కసారి కూడా నాకు నీ ప్రేమ విషయం చెప్పలేదు.నేను ఎలా వస్తాను అనుకున్నావ్…అంత నమ్మకం ఏమిటి?.

జాను:నేను చేపితే కానీ నీకు తెలియదా!నా కళ్లల్లో నీకు కనిపించలేదా నీ పై నా ప్రేమ.అయినామది మాట ను మౌనం లో దాయగలం కానీ కనులలో దాయలేము.చాలా సార్లు చెప్పాలని వచ్చేదాన్ని,కాని నిన్ను చూడగానే నా హృదయం వేగానికి అదుపెన్నది లేకుండేది.

ఏమాని చెప్పను నేను నా శ్వాస తీసుకునే
సమయం కంటే నీ గురించి ఆలోచించే..
క్షణాలు ఎక్కువ అనా-
నా గుండే స్పందించే రేటు కన్నా-
నీ పేరు తలచిన్నప్పుడు నాలో కలిగే
ఊహల వేగం ఎక్కువని చెప్పనా …

నా ఊపిరి నీవు ..
నా హృదయం నీవు..
నా జీవితమే నీవు
నాప్రాణమే నీవు..
నా అనుఅణువున నీవే నిండి..
నా ప్రాణబంధమైయ్యావు అని చెప్పనా…

నీవు  అన్నా,నీ ప్రేమ  అన్నా నాకు పిచ్చి అని చెప్పనా…

ఓరి నీ !… ఎంత అందంగా చెప్పవే నీ ప్రేమను. భలే ముద్దుగా ఉన్నవే…ఈ మాటల్లో పడి చాలా దూరం వచ్చేసాం..ఎక్కడైనా ఆగి భోజనం చేసి బయలు దేరదాo..

హ్మ్మ్… అలాగే.

ఎక్కడికి రాజీ..

ఏమో చూద్దాం ఎక్కడ వరకు వెళ్లగలమో అక్కడి వరకు…

జాను :-
నాకు భయం గా ఉంది రాజీ. అమ్మ, నాన్న అందరూ కంగారు పడుతుంటారు, గొడవలు కూడా జరుగుతాయి కదా..

రాజీవ్:- హ్మ్మ్ …అవ్వన్నీ త్వరలోనే సర్దుకుంటాయి, మన వాళ్లు మన ప్రేమ ను అర్ధం చేసుకుంటారు….

సరే,అవి ఏమి ఆలోచించకుండా నిద్రపో..

జాను:- సరే..రాజీ భుజం మీదా తల పెట్టుకొనిరాజీవ్ తో కబుర్లు చెబుతూనే…నిద్రపోయింది…

రాజీవ్ కి చిన్నపిల్లల తన భుజం పై నిద్రపోతున్న జాను చూసి,పిచ్చి జాను ఎంత అమాయకురాలివే…ఓహ్ గాడ్ …!ఫైనల్లీ నా జాను నా దగ్గర..జాను నుదుటిపై అడ్డుపెట్టుకొని నవ్వు కుంటూ కార్ అద్దంలో జాను ను చూసుకుంటూ కార్ ని తను అనుకున్న చోట ఆపాడు.

జాను-తెల్లారి కళ్ళు తెరిచే సరికి మంచంమీద ఉంది.
రాజీవ్ సోపాలో నిద్రపోవడం చూసి..సోపా దగ్గరకు వెళ్లి రాజీ చూడూ ఒక్క రోజులో ఎన్ని జరిగిపోయాయో..అని  నవ్వుకుంటూ,నిద్రపోతున్న రాజీ నుదుటిపై ఒక ముద్దు ఇవ్వగానే..ఒక్కసారిగా జాను ని తన మీదాకు లాక్కుని ఇలానే ఉండి పోరా తల్లి జీవితం అంతా..
ఓహ్ అవునా సర్…
హ్మ్ అవును మేడం..
హ్మ్మ్ సరే ,ఇంక వదులు ఫ్రెష్ అయ్యి వస్తా…

ఉహు… నేను వదలను..

నీ బిగికౌగిలి లో ఒక యుగం కూడా క్షణం గా మారి పోతుంది చూడూ..

చాలు ని కవిత్వం వదులు బాబు నీకు అంత తొందరెందుకు, పెళ్ళిఅయ్యే వరకు ఆగాలి రాజీ.ప్లీస్ వదులవాచిరాకుగా ఉంది రాజీ స్నానం చేసి వస్తాను…

అవునా నేను రానా..
ఎక్కడికి రాజీ..
స్నానం అన్నావ్ గా,ఇద్దరం ఒకే సారి చేస్తే బాగుంటుంది..

ఓయ్ చంపుతా! పెళ్లి అయ్యేవరకు పిచ్చి పిచ్చి వేషాలు వేశవానుకో…

రాజీ:-  చీ.. పో జాను…

జాను:-  హా..హా…

అలా కుదురుగా ,

నా బుజ్జి రాజీ…

రాజీవ్:-పోవే, పో.. ఎక్కడికి వెళ్లినా నా దగ్గరకే రావాలి గా,నా బంగారం ముద్దు,ముద్దు గా రాజీ అటుంటే ఎంత బాగుంటుందో.జాను స్నానం చేసి వచ్చే సరికీ టిఫిన్ రెడీగా ఉంటుంది….కాసేపు కబుర్లు చెప్పుకుంటూ అలా రూమ్ లొనే ఉండిపోతారు…

రాజీవ్:-జాను ఇక్కడ ఒక ప్రదేశం చాలా బాగుంటుంది అంట వెలదమా..

జాను:- అమ్మో ఎవరైనా చూస్తే,

రాజీవ్: హా చూస్తే ఏంటి, ఏమి కాదు,అలాగే ఇక్కడ ఏదైనా గుడి ఉంటే పెళ్ళి కూడా చేసేసు కుందాం..

హ్మ్మ్ సరే .

జాను:- భయట కు రాగానే wow రాజీ wonderful ,చాలా చాలా నచ్చింది ఈ ప్రదేశం .ఇటువంటి ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టం…రాజీ థాంక్యూ సో మచ్ చాలా చాలా సంతోషం గా ఉంది ఈరోజు అంటూ ..

చిన్న పిల్లలా ఆడుకుంటున్న జాను చూసి,ఎంత స్వచ్ఛమైన మనస్సు నీది…ఎప్పుడూ నిన్ను ఇలా సంతోషం గా ఉండేలా చూసుకుంటా జాను..మా అమ్మ లా నిన్ను చూసుకుంటా. ఐ ప్రామిస్ తల్లి…

అలా నడుస్తూ రాజీవ్ చెయ్యి పట్టుకొని ఈ ప్రపంచాన్ని జయించినంత సంతోషం గా ఉంది రాజీ నీ చేయి పట్టుకుని నీ అడుగులో అడుగువేసుకుంటూ నడుస్తూవుంటే…
ఎంత బాగుందో కదా…

ఇలాగే జీవితం అంతా.. ఉండి పోతే హాయ్ గా…

అవును రాజీ …ఈ ప్రకృతి ప్రతిరోజు ఇంత అందంగా ఉంటుందా.లేక నీ తో ఉండటం వల్ల ఇంత అందంగా వుందా..

రాజీవ్:-
మన జంట ను చూసి..
మన ప్రేమ కు మురిసి..
మన మనస్సులో పరవశం ఇలా అనిపిస్తుంది   జాను.

అక్కడి కి కొంచెం దూరం లో జలపాతం ,చుట్టూ ఉన్న అందమైన పూలు మొక్కలు,

ఆకాశాన్ని తాకుందా అనిపించే అంత ఎతైన     కొండ, కొండపైనించి జారే జలపాతం,పక్షుల కిల,కిల రావలే శ్రావ్యమైన సంగీతం లఎటు చూసినా అందమైన ప్రకృతి సోయగాలు కనువిందు చేస్తున్నాయి..మనస్సు ప్రశాంతత, పక్కనే మనస్సు కు నచ్చిన తన వాడు,ఇంత కన్నా మంచి సమయం మళ్ళీ రాదు అనేటట్టుగా,వారి ప్రేమ ను  జయించి సంతోషంగా ఉన్నారు జాను,రాజీ ఇద్దరూ…

రాజీ , జాను ని  దగ్గరకు తీసుకొని .

నేను ఎన్ని కాలాలు వేచానో..
ఎన్ని గెలాలు వేశానో..
మనస్సు అడిగే మరుల సుడికే..
ప్రేమ అభిషేకాలనే..
పన్నీటి మేఘాలుగా వర్షించి…
ఈరోజు నీ ఊపిరి తగిలి..
నాలో అనుఅణువున జరిగే రాసలీలల
సరిగమలు..అంటూ జాను పెదవుల ను తన పెదవులతో ముడి వేసి అమృత రస జడిలో తడిసిన వేల…

ఇద్దరు ప్రేమ తన్మయత్వం లో ఉండగా ఒక ఉరుము  శబ్దం విన్న ఇద్దరు ఉలిక్కిపడి దూరంగా జరిగి ఒకరునొకరు చూసుకుంటూ…
రాజీ ఓయ్ ….ఏంటి అలా చూస్తున్నావ్…
జాను:పో  …రాజీ…జాను సిగ్గుతో రాజీ నుంచి దూరంగా జలపాతం దగ్గరికి వెళ్లి ఆ నీటి లో ఆడుకుంటున్న జాను దగ్గరకు వచ్చి వెనుక నుండి కౌగిలించు కొని,

ఎందుకు అలా వచ్చేశావు..అంటూ జాను ని తనకు ఎదురుగా తిప్పుకొనిజాను కళ్ళలోకి కొంటెగా చూస్తూ,

అలా సగంలోనే ఆపేస్తే పాపం జాను,  అని మళ్ళీ మళ్ళీ తన పెదవుల కు పని చెబుతూనే జాను ని తన చిలిపి మాటలతో రెచ్చగొడుతూమదనసామ్రా జ్యం ,ఈ పూట నాదే అని జాను నడుమును  తడుముతూ  …ఏంటే ఇంత అద్భుతంగా ఉంది. ఈ నడుము నన్ను పూర్తిగా నీ మైకం లో ముంచేేస్తుంది.ఇలా అయితే తట్టుకోవడం కష్టం..

జాను:- ఆపు రాజీ నీ చిలిపి పనులు,నావల్ల కావడం లేదు.
రాజీ:-  ఏమి కావడం లేదు జాను చెప్పు
జాను:-       ఏమి చెప్పనునీ కైపు చూపు మత్తులో నన్ను నేను అదుపుచెయ్యలేకపోతున్న అని తన చేతులతో మొఖం ను దాచేస్తూ..

పో… రాజీ ప్లీస్ రాజీ అలా చూడకు నాకు సిగ్గుగా ఉంది..

రాజీవ్:- ఓయ్.. నీకు నా దగ్గర సిగ్గు ఎందుకు..నిన్ను ఇలా చూస్తుంటే..
జాను:హా చూస్తుంటే..
రాజీవ్:చిలిపి జాబిలి  తన వెన్నెలను అంతా నీలో నింపి,నా కోసం ఇంత అందంగా ముస్తాబు చేసింది అనిపించింది మల్లె పగడాల పచ్చని వెచ్చని జలపాత లోయలో..
నన్ను నీలో దాచేసుకొమ్మంది..

జాను:- అవునా,ఇంకేం అన్నది…

రాజీవ్:-నన్నుమాయచేసి దాచేసిన  సోయగాల మల్లెల  పరిమళలాలు నను   మోయలేని  తీయ్యని హాయి పూల జల్లులులో  తడిపి,తడిఆరని మధురమైన నీ అధర సుధలను రుచి చూడమన్నది .

జాను:-ఆహా…. అవునా …

మరీి ఊరించకు జాను,నన్ను చేరదీసి నీలో ఏకం చేసుకో..

జాను:-ఆహా…మరి ఇప్పటి వరకు నువ్వు చేసేది ఏమిటీ

నన్ను నీ ప్రేమ మైకం లో ఎప్పుడో ముంచి ,నీ కౌగిలిలో బందీని చేసేశావు..

ఇంక నన్ను  చేరతీసి చంపకు  రాజీ …

భారమైన యవ్వనంను మోయలేను..

ధోరసిగ్గును ,తుంచితే  వూరుకోదు ఈ క్షణం..

నన్ను రెచ్చగొట్టి చంపకు రాజీ…

రాజీవ్:- అబ్బో ..ఆహా…
జాను:- హ్మ్మ్ ప్లీజ్ నన్ను ఇలా వదిలేయ్
రాజీవ్:- ఎందుకు నేను అంటే ఇష్టం లేదా
జాను:- రాజీ నోటి మీద చేయివేసి ఇంకెప్పుడూ అలా   అనకు రాజీ..
నీకో విషయం చెప్పనా..

నిన్ను మొదటి సారి చూసిన క్షణమే నను నేను మర్చిపోయాను..

నా ఊపిరి గా మారిపోయావు..
అసలు నీవు అంటే ఎంత పిచ్చి అంటే…
అనుక్షణం నీ కోసం ఆలోచనలు,తపన
నీకై,నీ నవ్వుకై  నిరీక్షణ…
నా ప్రతి ఉదయం నీతో మొదలుఅవుతుంది.
నా రేయి కి నీ  ఆలోచనలు కమ్మని జోలలు…
నా కలలో కూడా నీవే…

నీ పక్కన ఉంటే విశ్వాన్ని జయించినంత సంతోషం…
నీ భుజంపై తల వాల్చి కూర్చుంటే ,నీవు నా నుదటి ఇచ్చే ముద్దు. అమ్మ ప్రేమ లో వున్నా మాధుర్యాన్ని ఇస్తుంది.
నీ చెయ్యి పట్టుకుని నడుస్తూవుంటే నాన్న తో వున్నంత ధైర్యంగా ఉంటుంది..

నీతో వున్నంతసేపు ఏమి గుర్తురావు,
నీ కళ్ళలోకి చూస్తూ…

అసలు నా చిరునవ్వుకి చిరునామా నీవు,
నేను అంటేనే నీవు…
నీవు లేని నా జీవితం ఊహించడం కూడా నా వల్ల కాదు రాజీ.
అంటూ రాజీ ని గట్టిగా హత్తుకొని నీ మీద ప్రేమను తెలపడానికి నాకు మాటలు రావడం లేదు.
తన పెదువులతో రాజీ పెదవులపై మధురసంతకం చేస్తూ,
ఇంకెప్పుడూ నన్ను వేరు చేసి మాట్లాడకు నేను తట్టుకోలేను…
ఈ ప్రపంచంలో ఎవరు ఎన్ని అన్న భరించగలను  కానీ ,నీవు నన్ను  చిన్నచూపు చూసిన, తట్టుకోలేను రాజీ..

నీవు నా ప్రాణం…, నీవు నా జీవితం…

రాజీవ్:-
ఓయ్ ….
నీవు నా గుండెల్లో ఉన్నావ్  …
నా గుండెచప్పుడు ఉన్నంత కాలం నీవు నాలో, నాతోనే వుంటావ్..

నా గుండె చప్పుడు విను అంటూ జాను ని తన గుండెలకి హత్తుకుని నీవు నా ప్రాణం తల్లి.
అని జాను పెదవులపై ముద్దు ఇస్తూ…

జాను ..హ్మ్మ్ చెప్పు రాజీ..

ఈరోజు కోసం నేను చాలా ఎదురుచూసాను.నీ పక్కన ఇలా ఉంటాను అనుకోలేదు .చాలా భయపడ్డాను ,నీవు ఆ పెళ్లి ఎక్కడ చేసుకుంటావో అని.

జాను:-అవును రాజీ..నాకు అలానే అనిపించింది .నీకు దూరమై ఎలా బ్రతకాలి అని..

నీవు,నేను ఎప్పుడూ ఒక 5 నిముషాలు కూడా పక్కపక్కన కుర్చీని  మాట్లాడుకోలేదు,ఒకరినొకరు ముట్టుకోలేదు.
అయిన..మనకు ఒకరు అంటే ఒకరికి ప్రాణం..ఆ పెళ్ళికొడుకు నాతో మాట్లాడుతూ ఉంటే నీవె గూర్తు వచ్చావ్ ,అతను నా చేయ్యి పట్టుకున్నపుడు ఏక్కడలేనిచీరాకు,బాధ, చచ్చిపోవాలనిపించింది.పరాయిమగవాడు తాకుతున్న ఫీలింగ్ నిజంగా,అప్పుడు అర్ధం అయ్యింది..నీవు తప్ప నా మనస్సులో స్థానం ఎవ్వరికీ ఇవ్వలేను అని..ఆ పెళ్ళికొడుకు కి కూడా అనుమానం వచ్చింది నా ప్రవర్తన ను చూసి.నీకు ఈ పెళ్లి ఇష్టం లేదా అని.నేను ఒక్క క్షణం కూడా ఆలోచించలేదువెంటనే అతనికి చెప్పసా .ఇష్టం లేదు,నేను వేరొకరిని లవ్ చేస్తున్న అని చెప్పాను అంతే పెద్ద గొడవమా అమ్మకి ఫోన్ చేసి  తిట్టేసారు.పెళ్ళి ఆగిపోతుంది అనుకున్నాను.కానీ వెంటనే ముహూర్తం పెట్టాశారు.నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు మా మావయ్య, అత్తయ్య వాళ్లు, ఆఖరికి మా చెల్లి కూడా ,ఏమందో తెలుసా బరితెగించసావ్ నీవుఅంది,మా అమ్మ అయితే  కొట్టేసింది.మా నాన్న కు తెలియనివ్వలేదు.తెలిస్తే ఆయన ఏమందురో,నేను మా నాన్న కి చెప్పాలని ట్ర్య్ చేసా కానీ మా వాళ్లు చెప్పనివ్వలేదు.చివరకు ఇలా చేసాను.అమ్మ నాన్న ఎలా ఉన్నారో,అని భయం గా ఉంది రాజీ..

రాజీ:-సరే అదంతా వదిలేయి.నీకో విషయం చెప్పనా…

జాను:-ఏంటి..
రాజీ:-నీ  పెదవులు  చాలా బాగున్నాయి జాను..

జాను:-ఓయ్ నిన్ను.. అని రాజీ ని కోట్టడానికి తన వెంట పడి పరిగెడుతూ నీటిలో జారిపడింది.

జాను ని లేపడానికి వెళ్లిన రాజీని కూడా నీటిలోకి లాగి.

ఇప్పుడు పరిగేట్టు ,బాగా దొరకవు అని ఆపకుండా కొడుతూ, నీటిని చిమ్ముతూ ఉంది.

ఆపవే అంటున్నా వినకుండా అల్లరి చేస్తున్నజాను ని గట్టిగా పట్టుకొని.!తన గుండెలకు దగ్గరగా తీసుకొని పెదవులపై ముద్దు ఇస్తూ.. జాను నడుముపై చెయ్యి వేసిఇంకా దగ్గరగా లాగుతాడు.!

జాను కు ఈ హాయి చాలా కొత్తగా ఉంది.!తనకే తెలియని మత్తు లో ఉండిపోయింది.!

ఇష్టం లేకున్నా కష్టం గా దూరం జరిగి.ఏంటి రాజీ వద్దు,ఇంకా ముందుకు వెళితే బాగోదు.!

రాజీ:-ఎందుకు బాగోదు చాలా బాగుంటుంది..!ఇది  నా  ప్రేమను తెలిపే తీయ్యనైనా పద్ధతి తెలుసా..!ఇదేమీ ప్రేమో కదా..ఇంత తీయ్యని హాయి తో మనస్సును పురికొలుపుతుంది.!

రాజీ్:-హా పెళ్లిలో సప్తపది తో ముడివేస్తారు..కానీ ఇక్కడ   అధరరాలతో సప్తపది జరుగుతుంది.

హా ..రెండు మనస్సులు, రెండు తనువులు ఒకటిగా మారే సృష్టి రహస్యం ఇది.

తెలుసా జాను..
ప్లీస్ డార్లింగ్…
మూడ్ చెడగొట్టకే.!
జాను:-అబ్బాయి గారి పని మంచి జోరు గా ఉందే ఈరోజు.
రాజీ్:-నచ్చిన జావేరి, కనుల విందు చేస్తూ నా ముంగిట నిలువగా..
ఈ రేయిని నాకు దాసోహం చేసుకొనా.!
రతి దేవినే మించిపోయిన ఒంపుసోింపుల సోయగాలతో,మురిపించే మొహం లోనన్ను
మాయచేస్తుంటే ఎలా.అందుకే
ఒకేఒక లోకం నాకు..
ఒకేఒక ప్రాణం నువ్వే…
నాప్రేమ ను అంతా నీకే ఇచ్చి …
నీతోనే జీవితం గడిపేద్దాం అని.

జాను ని ఎత్తుకోని సప్తవర్ణాల పూల మొక్కలనే పాన్పుగా మలచి…తడిసిన నీ అందాలు నన్ను ఇంకా ఇంకా మత్తుఎక్కిస్తున్నాయి జాను  అంటూ.!

తన ముద్దులాట మొదలుపెట్టాడు  రాజి.!

జాను విడిపించుకొనే ప్రయత్నం కూడా చేయకుండా రాజీ కళ్ళలోకి చూస్తూ తన ప్రేమ
మైకంలో  పూర్తిగా మునిగిపోయి.!

చీలిపి పనుల కోలాటం లో తను జతకలిసిపోయింది.!

నీలమై నిలిచెను మొదటి ముద్దు.!

విశాలమైన నుదుటిపై ముద్దు!
ఇక నా ప్రపంచమే నీవు అని చెప్పటం.!
జాను లో మైమరుపును గమనించిన రాజీ మనస్సు ఆనందం తో మురిసిపోయింది.!

రత్నమై రెండవముద్దు

నీలికళ్ల  పై పెట్టె ముద్దు దాని అర్ధం.
నా కలల రాణివి నీవే అని చెప్పటం. జాను కళ్లపై  ముద్దు ఇస్తూఉంటే జాను కలతల్ని మరిచి రాజీ బిగికౌగిలి ల్లో ఇంకా హాయి గా ఉంది.!
ముత్యమమై మూడోముద్దు

ముత్యమల్లే మెరిసే ముక్కుపై పెట్టె ముద్దు,
దాని అర్ధం నా ఊపిరి లో ఊపిరై, నా శ్వాస లో కలిసిపో అని ముక్కుపై ముద్దు

జాను:-  ఆహా !  అవునా సర్ !

ఒకరినొకరు వారి మేని పరిమళాలు ఆస్వాదిస్తూ …
జాను నీ తన మాటలతో,చేతలతో అణుఅనణువు ని తడుముతూ, ఇంకా ముందుకు వెళుతూనే ఉంది వాళ్ళ ప్రణయ యుద్ధం.

వజ్రమై నాలుగో ముద్దు!

జాను మెరిసే నీ అధరాలు చిందేను మధురాలు అంటూ ఎర్రని పెదవుల పై పెట్టె ముద్దుదాని అర్ధం నిను ప్రేమించేది నేనే అని చెబుతూ జాను పెదవులలోని మధువులు ఆస్వాదిస్తూ ఈ లోకాన్ని మర్చిపోయారు ఇద్దరు

ఏ రతిమన్మథుల రాసకేళిిలో పాన్పుగా మారేయో ఈ మేఘాలు చిలిపి జల్లులు వర్షిస్తూ
ఈ లోకంలోకి తీసుకొనివచ్చేయి ఇద్దరిని.

పగడమై ఐదో ముద్దు!

పాలబుగ్గ పై పెట్టె ముద్దు దాని అర్ధం అన్ని పాలుపంచుకోమని అర్థం అంటూ జాను బుగ్గపై ముద్దుల వర్షం కురిపించాడు..

వైడూర్యమై ఆరోవ ముద్దు!

లేత చేతిపై పెట్టే ముద్దు  దాని అర్ధం, నీ చేతిని ఎప్పుడూ వదలనని   నీకు చేసే ప్రోమిస్

కెంపులై ఏడోవ ముద్దు!

ఆడవారి అందాలను రేటింపు చేసే మత్తైన ప్రదేశం తెలుపు,పసుపు రంగులో ఉన్న  నీ చిట్టినడుముపై అంటూ రాజీ జాను చీరకోంగును పక్కకు జరిపి తన పెదవులతో ముద్దు ఇస్తూ నీ చిలిపి మనస్సు నీదేనని చెప్పడం.!

ఈ ముద్దుతో జాను పూర్తిగా రాజీ వశమై
తన తమకం తాళలేక ,రాజీ ని గట్టిగా హత్తుకొని  ఎగసిపడే ఎద లోతుల్లో సవ్వడి చేస్తున్నా హృదయ స్పందనలు వినిపించేంత  గట్టిగా హత్తుకొని ,వారిమధ్య గాలి కూడా చొరబడని అంత దగ్గరై పోయారు.

రాజీ చేసే చిలిపి అల్లరి తట్టుకోలేక
జాను ఇక చాలు వదులు ప్లీస్ అంటుందే కాని
రాజీ ని వదలాలని లేదు.!

ఒకరిలో ఒకరు  కలిసిపోవాలన్న తపన
ఇద్దరిలో విరహాగ్ని జ్వాల లు చేలరేగుతున్నాయి.! ఆ వేడిని తట్టుకోలేక వంటిపై నూలుపోగు కూడా నిలువకున్నది.!

జాను కూడా రాజీపై తన పెదవుల యుద్ధం చేయడం మొదలు పెట్టింది. జాను ,రాజీ మెడ పై పెట్టిన ముద్దు తో ఇద్దరు పరవశం లో లోకాన్ని మరిచి

రెండు తనువులు ఒకటిగా కలిసిపోయారు..
వారి ని చూసి నెలరాజు కూడా మబ్బుల చాటుకు జారుకున్నారు వారి ఏకాంతాన్ని  భగ్నం చెయ్యలేక.!

అలిసిన వారి తనువులు ఎప్పటికో విశ్రాంతి తీసుకున్నాయో వారికే తెలియలేదు.!

జాను కి మెలుకువ వచ్చి చూసే సరికి రాజీ గుండెలపై ఉంది.!
తనని రాజీవ్ పై అలా చూసుకొనే సరికి సిగ్గుతో ముసి ముసి నువ్వులు నవ్వుతూ.!

చెయ్యవలిసినదంతా చేసేసి, ఏమి తెలియని అమాయకుడులా!
ఎంత ముద్దుగా ఉన్నాడో అని నుదిటిిపై ముద్దు ఇచ్చి,రాజీ మీద నుంచి లేచి

ప్రకృతి ఒడిలో ఈ రేయి ఇంత అందంగా మలిచి,నా జీవితంలో ఇది ఒక మరపురాని రోజుగా,మిగిలిపోయే లా చేసిన ఈ ప్రకృతి లో ప్రేమ కు ఏమి ఇవ్వగలను ప్రేమను తప్పా..!

వారి మధ్య జరిగినది తలుచుకోని సిగ్గుతో

రాజీ
నీ గుండెలపై వాలి పరవశిించు ఆ మధుర క్షణాన..
నాలోని బిడియం కనుమరుగై తీరాలు దాటి..
నీ ఎదపై చంటి పాపనై వేళా …
నాలో ఆడ జన్మ పులకించి రంగుల సీతా కోక చిలుకై…
మన కలల విరుల వనంలో.!
నీ చూపుల చిలిపి తనం.!
నను అనుఅణువున తడుముతూ.!
నను నీలో ఏకం కమ్మంది.!
అలా ఆలోచిస్తు కూర్చున్నా జాను ని వెనుక నుంచి హత్తుకొని ఏమి ఆలోిచిస్తున్నావ్ జాను.!

మన మధ్య జరిగిన విషయం గురించే.!
దాని గురించి ఎందుకు ఆలోచించటం.!
అది కాదు రాజీ.!

ఆ సంఘటన తరుచుగా నా కలలోకి వస్తుఉండేది.!
నీ తలుపు తోనే ఉంటాను కదా అందుకే కలలో కూడా నీవే అనుకున్నాను.!

అదే కల ఇలా నేరవేరుతుంది  అనుకోలేదు.!

రాజీ పెళ్లి కాకుండా మనం ఇద్దరం ఒకటి అయ్యాం ఇది తప్పు కదా.!

రాజీ:-

ఏది తప్పు జాను.!

మన ఇద్దరి మనస్సు లు ముడిపడి
,మన ప్రేమ మొదలు అయిన రోజే
మనకి మనువు జరిగిపోయింది.!

అసలు పెళ్ళి అంటనేే రెండు మనస్సు లు ఒకటిగా ముడిపడటం అది ఎప్పుడో జరిగిపోయింది మనకు.!
తాళి అనేది కేవలం సమాజానికి సాక్ష్యం అంతే.!

అయిన రేపు మనం పెళ్ళి చేసుకుందాం! దాని గురించి నీవు ఆలోచించవలిసిన పనిలేదు.
ప్రశాంతంగా ఉండు.

ప్రేమతో మన వారితో గడిపే క్షణాలు పూర్తిగా వారి ప్రేమను అనుభూతి చెందాలి జాను ఈ టైం లో పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు.!
ఇంకో విషయం మా అమ్మానాన్న లను,
మీ వాళ్లతో మాట్లాడమని చెప్పాను,
ఇంకా మీ వాళ్ళు,నా వాళ్ళు, సమాజం  అంటూ ఎవరి గురించి ఆలోచించకుండా ప్రతి నిముషం ను  ఎంజాయ్ చెయ్యి జాను.!

తెల్లారి గుడిలో ,ఆ అమ్మవారి సాక్షి గా రాజీ, జాను మెడ లో తాళి కట్టి తన భార్య గా చేసుకున్నాడు.!

You May Also Like

One thought on “అధరం మధురం

  1. చాల అద్బుతంగా రాసారు కధా గమనం చాల బాగుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!