పరిమళించిన మానవత్వం (కథాసమీక్ష)

పరిమళించిన మానవత్వం
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

సమీక్ష: ఐశ్వర్య రెడ్డి

కథ: పరిమళించిన మానవత్వం
రచన: నెల్లుట్ల సునీత

ఈ కథ చదువుతుంటే మానవత్వం మంచితనం ఇంకా మిగిలే ఉన్నాయి అనిపించింది.
ఒకరికి సాయం చేస్తే దేవుడు మనకు సాయం చేస్తాడో లేదో కాని మనతో పది మంది చేయి కలుపుతారు అని నిరూపించి చూపించారు.
ఈ కథ మొదలైంది ప్రకృతిని వర్ణిస్తూ అలాంటి ప్రకృతిని మనం మన దైనందిన జీవితంలో ఈ సిటీ లైఫ్ లో చూడలేకపోతున్నాము, నిజంగా అలాంటి ప్రకృతి ఒడిలో ముఖ్యంగా గ్రామాల్లో ఉన్న వారందరూ అదృష్టవంతులే. ఒక చిన్న పిల్లాడు రాకేష్ తల్లి చనిపోయి, తండ్రి ఆరోగ్యం సరిగా లేకపోతే మానసికంగా ఎంత నలిగిపోతాడో, అలాగే అలాంటి పిల్లల ఆవేదన ఎంత హృద్యంగా ఉంటుందో ఈ కథలో చూపించారు. ఇది మీ నిజజీవితంలో జరిగింది అని రాశారు, నిజంగా అంత గొప్ప సహాయం చేసినా మీకు కృతజ్ఞతలు చెప్పకుండా ఉండలేకపోతున్నాను. సహయం చిన్నదైన పెద్దదైన కాని అలా చేయాలనే ఆలోచన రావడమే గొప్ప విషయం. ఎందుకంటే ఈ రోజుల్లో మన ఇంట్లో వాళ్ళ తో కాని మన బంధువులతో కాని సమయాన్ని గడపలేక ఉరుకుల పరుగుల జీవితంలో సతమతమవుతున్నాము, స్వార్థం ఎక్కువై పక్క మనిషిని పట్టించుకోవడమే మానేసి లగ్జరీల కోసం డబ్బు సంపాదనలో మునిగి తేలుతున్నాం. అలాంటిది ఒక పిల్లవాడి గురించి అతని తండ్రి గురించి మీరు పడిన తపన అంతా ఇంతా కాదు, ఆ పిల్లవాడి భవిష్యత్తు బాగుండాలనే సునీత గారి తాపత్రయం అర్థం చేసుకోని ఊరి వాళ్ళు, మరియు ఆ స్కూలు టీచర్లు అందరు ముందుకు రావడం, కొంత డబ్బులు జమ చేసి పిల్లాడి పేరున వేసి తండ్రి ని హాస్పిటల్ లో వేయడం హర్షనియం. సంకల్పం మంచిదైతే చాలదు…దైర్యం తో ముందడుగు వేయాలి. ఆ విషయాన్ని కథలో చక్కగా చెప్పారు. మొత్తానికి ఆ పిల్లవాడి జీవితాన్ని మీకు వీలైనంతలో చక్కదిద్దగలిగారు. నిజంగా కథ మానవత్వపు పరిమళంలా ముగ్ద మనోహరంగా ఉంది. పక్క వారికి సాయం చేస్తే మనస్సు ఎంత ఆనంద భరితం అవుతుందని. ఈ కథ చదివిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఇక నుండి అయినా సరే ఎవరైనా కష్టాల్లో మన కళ్ళ ముందర ఉన్నప్పుడు ఎంతో కొంత మనకు వీలైనంత సహాయం చేద్దాం ,,
అందరూ మనవాళ్ళే అనుకుందాం, మన తోటి వారిని గౌరవిద్దాం.
ధన్యవాదాలు.

You May Also Like

2 thoughts on “పరిమళించిన మానవత్వం (కథాసమీక్ష)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!