తప్పు ఒప్పు
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: పసుమర్తి నాగేశ్వరరావు
నిజాయితీ గా బతకడమే ఒప్పు
చేయకు ఎన్నడూ తప్పు
తప్పు చేస్తే తప్పదు ముప్పు
నిజం ఎప్పుడూ నిప్పు
మంచిమాటలు కలిగిస్తాయి కనువిప్పు
తప్పును దిద్దుకోమని చెప్పు
తప్పుడు మాటలతో నోటిని చేయకు స్లిప్పు
అప్పుడే పొందగలవు నువ్వు మెప్పు
బలమైన ఆహారం పప్పు
కలపాలి రుచికి ఆహారంలో ఉప్పు
రుచి తెలుసుకొనుటకు చేయాలి సిప్పు
తప్పదు ఇవ్వడం బేరర్ కి టిప్పు
పూలతో అందం కొప్పు
ముడి వీడకుండా పెట్టాలి క్లిప్పు
ఆనందానికి వేయాలి ఒక ట్రిప్పు
మూఢచారాలకు పట్టించాలి తుప్పు