క్షమాపణ

(అంశం : “మానవత్వం”)

క్షమాపణ

రచన: యాంబాకం

రావూరు అనే గ్రామంలో ఒక ఇల్లు కట్టే మంచి పని తనం మేస్త్రీ ఉండేవాడు. అతడు వట్టి సోమరిపోతు.ఏపనీ గడువు లోపల చేయడమనేది అతడు ఎరుగనే ఎరుగడు.
ఆఊరి లో లక్షాధికారి ఉండేవాడు. అతను ఆందరికి పెద్ద తనంగా, చాలా బుద్ధి కుశలతకలవాడుగా అంతే కాకుండా ఆఊరి లో న్యాయాధిపతి గా తీర్పులు చెప్పడంలో నేర్పరి. ఎంత పెద్ద తప్పు చేసిన వాళ్ళకైనా “మానవత్వం”తో శిక్ష విధించేవాడు కాదు.నోప్పించకుండా,నవ్వతూ మాటాడుతూనే బుద్ధి చెప్పి వాళ్ళ తప్పు వాళ్ళే తెలుసు కొనేటట్టు చేసేవాడు.
ఆ లక్షాధికారి ఒకసారి ఆ మేస్త్రీని పిలిచి మన ఊరి లో అందమైన బడి, గుడి నిర్మించ మని దానికి అగు ఖర్చు, గడువు కూడ పెట్టాడు.
లక్షాధికారి చెప్పిన ప్రకారం మేస్త్రీ వెంటనే పని మొదలు పెడతానన్నారు. కొంత నిధులు విడుదల కూడా లక్షాధికారి మేస్త్రీకి ఇచ్చి పెట్టారు. కాని మేస్త్రీ ఏ పని పూర్తి కాకుండానే ఐదు సంవత్సరాలు గడిచి పోయాయి.
ఒక రోజు లక్షాధికారి బడిని గుడిని ఏర్పాట్లు ఎంత వరకు తయారైనవో చూదామని వెళ్ళాడు. తీరవచ్చి చూడగా ఏముంది? ఏపని చూసిన అవక తవక గా వక్కలా ముక్కలా గా పనిచేయక పోగా అక్కడ ఉన్న పనివారితో చుట్టు ప్రక్కల వారితో కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకొంటూ కాలం వెల్ల బరుస్తున్నాడు మేస్త్రీ తీరికగా. ఇదంతా చూచాడు లక్షాధికారి కాని, కొంచెమైన మేస్త్రీని తిట్టడం కనపడలేదు. మందలించ లేదు.
లక్షాధికారి ని చేస్తూనే మేస్త్రీ లేచి నిలబడి దండంపెట్టి మీ రాక వలన సంతోషం తొరలో ఈ స్థలంలో నేను నిర్మించ బోవు బడి, గుడి, ను చూసి “అయ్యో ఇలాంటివి మా ఊరు లో లేక పోయింది! “అని అసూయ పడతారు. దీని అందచందాలు చూచిన నటులు కవులు వేయి విధాల పోగడతారు! అన్నాడు.
ఈ మాటలకు లక్షాధికారి మనస్సులో నవ్వు కొని “ఓయీ మేస్త్రీ !… నీ తెలివి తేటలకు నేను సంతోషించాను. ఓక చిన్న కథ చెబుతావిను.ఒక కమ్మరి సోమరి మట్టినీళ్ళతో కలపకుండానే చక్రం తిప్ప కుండానే తే వలసి బంక మన్ను తేకుండానే,కుండలను కాల్చకుండానే చూడండి నా కుండలు ఎంత నాణ్యమైన కుండలు అని పోగుడుకొంటూ కూర్చున్నాడట తీరా చూస్తే కనబడేది కష్టపడి చెమటోడ్చి కాయ కష్టం చేస్తే కుండలు వస్తాయి గాని మాటల తో అవుతుందా, చెప్పు?ఐతే,నీవు అలాంటి వాడివి కావులే నీపని చూచి మెచ్చుకొని,బహుమతులు ఇద్దామని వచ్చాను. ఏది, నువు నిర్మించిన అందమైన బడి, గుడి చూపించు…! “అంటూ, ముందుకు అడుగులు వేసాడు.
లక్షాధికారి తనను నిజంగానే పోగుడు తున్నాడని,
మురిసి పోయాడు మేస్త్రీ. పూర్తి కాని మండపాలు కొంచెంగా చెక్కి విడిచిన స్తంభాలు, పైకప్పు లేనిగదులు… ఇటువంటి వన్ని లక్షాధికారి కి చూపిస్తూ ఇంకా పెద్ద కబుర్లు చెప్ప నారంభించాడు మేస్త్రీ.
మేస్త్రీ చేసిన ఈ కబుర్లు వినగానే అతని సంగతి పూర్తిగా అర్థం మై పోయింది లక్షాధికారి కి.
“ఆహా!.. నువు ఎంతగొప్ప మేస్త్రి వి! ఎంత త్వరగా బడి గుడి నిర్మించేశావు. ఎంత ఆనందంగా వుంది చూడటానికి నా రెండు కనులు చాలటం లేదు? అని భుజం తట్టాడు. లక్షాధికారి మాటలలోని మర్మము తెలియక నిజంగా నే మెచ్చు కొన్నాడని ఉబ్బి పోయాడు మేస్త్రి.
కొంత దూరం నడిచి వెళ్ళి, లక్షాధికారి అతని తో” మేస్త్రి!.. నీవు నా ముందు నడుస్తూ, మన కట్టుబడి యొక్క చిత్ర విచిత్రలన్నీ వరసగా చూపించాలి! “అన్నాడు.
అలాగే మేస్త్రి ముందు నడుస్తున్నాడు. కొంత దూరం వెళ్ళి తటాలున అగాడు “ఇక్కడ కోనేరు ఉంది, అన్నాడు మేస్త్రి.
అందుకు లక్షాధికారి “అబ్బో అలాంటి దేమీలేదు. అదంతా చదునుగా కనిపిస్తూవుంది నాకు, ఎదుట ఒక పెద్ద భవనం కనపడుతూ వుంది “అని చెప్పగా అక్కడ ఇంకా భవనంపూర్తి కట్టలేదనీ. అదిలోతైన కోనేరు అనీ మళ్ళీ విన్నవించాడు మేస్త్రి”లేదు నాకు, తీర్చిదిద్దిన చక్కని కాలిబాట కనబడుతూవుంది నడు ముందుకు అని మళ్లీ గద్దించి అతని వైపు మరోలా చూశాడు లక్షాధికారి. మేస్త్రి భయపడిన వాడై గబ గబ ముందుకు నడిచి. నీళ్ళు తో నిండి వున్న పెద్ధ లోతైన గుంట లో పడ్డాడు. అతనికి ఈత రాదు. కొంత సేపు పెనుగులాడిన తరువాత కూలీలు మేస్త్రినీ పైకి లాగా రు. అప్పుడు మేస్త్రీ ని చూచి “ఎంత సదుపాయమైన స్నాన వాటీకా నిర్మించావయ్య మేస్త్రి! అని వెగతాలి చేసాడు.
తరువాత లక్షాధికారి మేస్త్రీ ని వెంట బెట్టుకొని గుడిమండపం చూడ బోయాడు అదీ అసంపూర్తిగా నే వుంది “ఎంచక్కటి మండపం! మేస్త్రి అనే పేరు నీకేతగినది ఆహా, ఆ సింహం బొమ్మలు ఆ నెమలినృత్యాలు ఆ గుర్రాలు,తీర్చి దిద్ది నట్లున్నయ్యో! ఆ దేవుని సింహాసనం ధగ ధగ లాడుతూ ఎలామెరుస్తూ వుందో! ఇరు ప్రక్కల ఉండే ఏనుగులు
జీవకళ ఉట్టిపడేటట్టు ఎట్లా చెక్కవయ్యా మేస్త్రి! ఏదీఒక సారి నీవు ఆ మండపం లోని ఆ గుర్రం మీద కూర్చోని నన్ను ఆనందపరచు,అన్నాడు
ఇందకు మేస్త్రి “అయ్యా! ఇంకా మండపం తయారు కాలేదు.ఇప్పడు అక్కడ దేవుని సింహాసనం కూడ లేదు. ఏ ముంది మళ్ళీ ఈ వారం నాటికల్లా తయారు చేస్తాను! అని బదులు చెప్పాడు.
“ఓస్ అదేమిటి,మెరుస్తున్న సింహాసనం, నిలబడి ఉన్న గుర్రాలు నాకు కనబడుతుంటే… అబద్దం ఆడుతావేం?కూర్చో పోయి దాని మీదకుర్చోవేం!అన్నాడు గట్టిగా లక్షాధికారి మేస్త్రీ ఇక బాగుండదని భయపడి సింహాసనం పక్కన ఉన్న గుర్రం బొమ్మ అమర్చవలసిన చోటుకు వెళ్లి అక్కడ గోడకు ఆనుకొని గుర్రం మీద కూర్చున్నట్టు గానే కూర్చున్నాడు. మేస్త్రి కి చిన్నప్పుడు బడిలో వేసిన గోడకుర్చి గుర్తుకు వచ్చింది.
అప్పుడు లక్షాధికారి! మేస్త్రి నీ గుర్రంస్వారి చాల నచ్చింది ఇవాళ భోజన వేల వరకు ఇటు అటు కదల కుండా కూర్చో వాలి తెలిసిందా?”అన్నాడు.
ఒక వేళ మేస్త్రి అలా కూర్చోక పోయినట్టయితే లక్షాధికారి రే వచ్చి కూర్చోపెట్టేలా ఉన్నాడు అతని కోపంచూస్తే.
“ఫలానా మేస్త్రి కొత్త భవనంలో గుర్రం పైన ఎక్కి కూర్చున్నాడట! “అనే వార్త ఆ ఊరి లో వ్యాపించి,చూడటానికి జనం తండోప తండాలుగా చూడవచ్చారు. ఎటువంటి ఆధారము లేకుండా కూర్చుని ఉన్న మేస్త్రీ ని చూసి పగలబడి నవ్వుకోసాగారు.
ఆ సమయంలో లక్షాధికారి మళ్ళీ అక్కడ కి వచ్చి :మేస్త్రి! నిన్ను చూచి ప్రజలందరూ మెచ్చు కొన్నారు నిజంగానే స్వారీ అని అందరూ అనుకొంటున్నారు!అన్నాడు.నవ్వుతూ!
అటు తరువాత,మేస్త్రి ని వెంట బెట్టుకొని గోపురం చూడ బోయాడు లక్షాధికారి ఇది వరకు లాగే ముందు మేస్త్రి వెనుక లక్షాధికారి నడుస్తున్నాడు. ఆ ప్రదేశం అంతా ముళ్ళ పొదలతో నిండి వుంది. అది చూచి లక్షాధికారి ఎంత మాత్రం సహించలేక పోయాడు.
మేస్త్రి మన గోపురం ఉన్న స్థలం ఎంత సొంపుగా ఉన్నది! చక్కగా నిర్మించావు ఆ గోపురం మీద ఉన్న బొమ్మలు రకరకాల చిత్రాలు దేవతల విగ్రహాలు ఒకటా రెండా అబ్బ అబ్బ కనులపండుగ చేసే గోపురం నే నెక్కడా చూడలేదు! ఏమీ పావురములు,రకరకాలపిట్టలుఎదీ దగ్గర గా వాటిని ఎప్పుడూ చూడ లేదు పట్టుకు రా చూద్దాం!అన్నాడు. ఏమిటి?పట్టుకు రావడం ఏమిటి?అయినా అధికారి ధిక్కరించ లేక మేస్త్రి అక్కడ లేని పావురాళ్ళ ను, పిట్టలను పట్టుకోసాగాడు. అతనికి చేతులు తలనొప్పి నారంభించింది.
ఇంతలో లక్షాధికారి కి ఒక ఉపాయం తట్టింది. అక్కడ ఉన్న ఒక కూలి ని పలిచి మేస్త్రి భార్యను పలుచుకొని రమ్మని పంపెడు. కాసేపటికి మేస్త్రి భార్య అక్కడకు చేరుకొని అక్కడ జరిగే వింత తన భర్త దే అని భర్త ను నలుగురి లో తిట్టంమొదలు పెట్టింది ఆతిట్లు విని అందరూ చెవులు మూసుకుని పగలబడి నవ్వవేరు.
అప్పుడు మేస్త్రీ లక్షాధికారి కాళ్ళు పైన పడి నా వల్ల పెద్ద పొరపాటు జరిగింది అని “క్షమాపణ” కోరుకొన్నాడు.
అప్పుడు లక్షాధికారి మేస్త్రీ ని శిక్షింపక “మానవత్వం” తో ఆలోచించి మేస్త్రి ని క్షమించగా. ఐదు సంవత్సరాల లో పూర్తి కాని బడి,గుడి, నెలల కాలంలో సుందరంగా రూపుదిద్దు కోన్నాయి.
సోమరి తనం పోగానే మేస్త్రి నేర్పరితనం లోకానికి వెల్లడి అయింది అప్పుడు లక్షాధికారి మేస్త్రీ ని అందరిలో సత్కరింగా జనులు మెచ్చు కొన్నారు.లక్షాధికారి “మానవత్వం” తోనే బడి, గుడి నిర్మించాడు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!