అనవసర అనుమానం

(అంశం : “మానవత్వం”)

అనవసర అనుమానం

రచన: జీ వీ నాయుడు

రజనీ, సాంబ లది ప్రేమ వివాహం. ఇద్దరు ఒకే కాలేజీలో చదువు కున్నారు. ఒకే సంస్థ లో ప్రవేటు ఉద్యోగులు. పరిచయం కాస్తా, ప్రేమ గా చిగురించి ప్రణయంగా మారింది. ఇరువురు ఒకరిపట్ల ఒకరు అలవి కాని అనురాగం తో జీవితం గడుపుతున్నారు. హైదరాబాద్ లో నివాసం.. వివాహ సమయం లో రజనీ వాళ్ళ తండ్రి అన్ని లాంచనాలతోనే వివాహం చేశారు. వారికి ఇరువురు సంతానం. పాప శాంతి కీ నాలుగేళ్లు. బాబు సుధీర్ కు ఎనిమిది ఏళ్ళు. ఇరువురు ప్రవేటు ఉద్యోగం చేసుకుంటూ ఉండే సమయం లో సాంబ కు ఓ రోజు ఒక ఆలోచన కలిగింది. ఎప్పుడు ఈ చాళీ చాలని జీతం తో ఎంత కాలం ఇలా.
ఈ ఉద్యోగం మానేసి, ఓ కాంట్రాక్టర్ దగ్గర కొంత కాలం పనిచేస్తే ఇలా జీతం వస్తుంది. కొంత అనుభవం వస్తుంది. అనంతరం సొంతం గా కాంట్రాక్ట్ పనులు చేసుకుంటే మంచిగానే సంపాధించు కోవచ్చు అని ఆలోచన చేసి, రాత్రి భార్య కు చెప్పారు. కోడలు మగ బిడ్డను కంటాను అంటే అత్త వద్దంటుందా అని సెటైర్లు వేసింది రజనీ.
అంతే ఆ మరుసటి రోజే కార్యరూపం దాల్చారు.
కాంట్రాక్టర్ దగ్గర ఉద్యోగం లో చేరారు సాంబ.
రెండు ఏళ్ళు సాఫీగా సాగింది.
ఆరునెలలకు ఒకసారి సాంబ ఇంటికి వచ్చే వారు. ఇద్దరు పిల్లలు భార్య తో ఒక వారం సంతోషం గా గడిపి తిరిగి వెళ్లే వారు. ఆరు నెలలు గడిచినా ఇంటికి రావడం లేదు సాంబ. కారణం పని ఒత్తిడి.
భార్య ఫోన్ చేసినా, గతంలో లాగా సంతోషం గా మాట్లాడే వారు కాదు. దీంతో రజనీ లో రోజు రోజు కు అసహనం పెరుగుతుంది. కోపం కట్టలు తెగుతుంది. అయినా ఎక్కడా బయట పడకుండా మేనేజ్ చేస్తుంది రజనీ.
ఇక ఉండలేక, ఒక రోజు అడిగింది భర్త ను.
” ఏమండీ, ఎంత వర్క్ బిజీ ఐతే మాత్రం, పెళ్ళాం, పిల్లలు కూడా పట్టరా, కనీసం సంతోషం గా మాట్లాడాలి అని అనిపించడం లేదా.. నాకు ఏమీ అర్ధం కావడం లేదు. నాకు ఏదో అనుమాభం గా ఉంది. తమరు ఏదో అక్కడ రాసలీలల్లో మునుగుతున్నారు అని అనుకుంటున్నా ” అంటూ ఏడ్చింది ఫోన్లోనే రజనీ.
” అబ్బా, ఇదేమి ఖర్మరా దేవుడా.. నాకు అసలు ఆ ఆలోచనే లేదు. ఎందుకు ఇలా అంటుంది.. ఎలాగూ అనుమానించింది. ఇక్కడ ఇక ఏమీ చేసినా ప్రాబ్లెమ్ లేదు.. అయినా, వీళ్లకు ఇదేమి పాడుబుద్దీ. ఇంటికి వెళ్లకపోతే ఇలా నిందలు వేస్తారా ” అంటూ తనలో తానే మదనపడుతున్నాడు సాంబ.
ఇంతలోనే వంట మనిషి వచ్చి ” సాంబ సారువారూ… పెద్దయ్య గారు పిలుస్తున్నారు ” అంటూ పిలిచింది.
సరే వస్తున్నా అంటూ లేచి వెళ్ళాడు సాంబ.
” సాంబ గారు, మీకు శుభాకాంక్షలు. ఎందుకు అంటే, మీరు బాగా పనిచేస్తున్నారు అని మా టీమ్ ఆఫ్ డైరెక్టర్స్ నీకు జీతం పెంచారు. మీరు వచ్చే నెల నుంచి లక్ష రూపాయలు తీసుకోవచ్చు జీతం గా. ఆల్ దీ బెస్ట్. అయితే వచ్చే నెల నుంచి కొత్త ప్రాజెక్టు స్టార్ట్ చేస్తున్నాము. జనవరి 10నుంచి 20 వరకు మాత్రమే మీకు సెలవు ఉంటుంది ” అని కొత్త రూల్స్ లెటర్ సాంబా కు అందించారు ఆ కాంట్రాక్టర్ రంజిత్.
” ఏమిటీ ఇంత మంచి జీతం ఆఫర్ ఇచ్చినా హ్యాపీ ఫీల్ కావడం లేదు.. ఏదైనా ప్రాబ్లెమ్ ఉందా ” అన్నాడు రంజిత్.
“సార్.. నేను నాలుగు నెలలు లేదా ఆరు నెలలకు ఒక సారి మా ఫ్యామిలీ తో ఉండాలి. అలా అయితే.. నాకు అభ్యంతరం లేదు” అన్నాడు సాంబ. ఓకే మానవత్వం నాకు ఉంది. నీకు సెలవు ప్రతి నాలుగు నెలల కు వారం రోజులు ఓకే అన్నాడు రంజిత్. అంతే బయలుదేరారు సాంబ రజనీ దగ్గర కు. కోపం గీపం బలాదూర్. అందరు హ్యాపీ గా ఉన్నారు.
………

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!