పల్లెటూళ్ళు

పల్లెటూళ్ళు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: మేక.సురేష్ కుమార్

పల్లెటుాళ్ళు దేశానికి పట్టుకొమ్మలు
అనుబంధాలకు నిలయాలు
సుఖసంతోషాలకు నెల వులు
పచ్చటి పైరు పంటలు
చల్లటి పైరగాలులు
కల్లా కపట మెరుగని ఆత్మీయ బంధాలకు ఆలవాలు
కుల, మతాలకివి ఆలయాలు
ఆటాపాటల ఐక్యతారాగాలు
కొండకోనలు,సెలయేరు సవ్వడులు
కోకిలమ్మ కుానిరాగాలు
ప్రకృతి రమణీయ సోయగాలు
రచ్చబండ మిాది కబుర్లు
అందమైన పట్టుపావడాల నెరజానలు
అవ్వ, తాతల చందమామ కధలు
చేదుడు బావి కాడి మగువల ముచ్చట్లు
కాడెద్దుల జోరు నడకలు
బసవన్నల రంకెలు
పసిపిల్లల దాగుడు ముాతలు
కాలుష్యం లేని స్వచ్ఛమైన గాలులు
నా పల్లె సీమలు… కల్మషమెరుగని కోనసీమలు
చందమామ వెన్నెల్లో చిట్టి తల్లుల ఆటలు
వేపచెట్టు బావి కాడి ఈదులాటలు..
ఆకాశానంటే తాటిచెట్ల వరుసలు..
వరి కల్లంలో  రైతన్నల కుానిరాగాలు..
చింత తోపులో ఊయలల ఊగిసలాటలు..
అందమైన నా పల్లెటుాళ్ళు…
ఆత్మీయ కొలువులు…
పిట్టగోడ కింద గోళీలాటలు..
కాలువ గట్ల పై చేపల వేటలు..
ఆహా! బహు చక్కని ఊళ్లు…
నా పల్లెటుాళ్ళు…..

You May Also Like

One thought on “పల్లెటూళ్ళు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!