కలవని దారులు

కలవని దారులు
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: నాగమణి రాళ్ళపల్లి

స్నేహమన్నావు నువ్వు
నిజమనుకున్నాను నేను,
ఆత్రపడొద్దాను నేను
ఆవేశపడ్డావు నీవు.
ఆంక్ష నాది, కాంక్ష నీది,
కల నాదీ,వల నీది,
మనసు నాది,మజా నీది,
బంధం కావాలన్నది నేను,
బరువది వద్దన్నది నీవు,
అపుడు తెలిసింది,
కలవని దారులు మనవని.
అందుకే….
ఎవరి పయనం వారిది!!!.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!