ప్రమాదాన్ని నివారించుకోండి

(అంశం:” ప్రమాదం”)

ప్రమాదాన్ని నివారించుకోండి

రచన::పసుమర్తి నాగేశ్వరరావు

ఏ నిమిషానికి ఏమి జరుగునో
ఎవరూహించెదరు ఒక కవి అన్నట్లు
ఏ ఆపద చెప్పిరాదు
కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుంది
హఠాత్తు గా జరిగేవి ప్రమాధాలు
అనుకోకుండా జరిగేవి ప్రమాదాలు
నిర్లక్ష్యం తో కూడేవి ప్రమాదాలు
అప్రమత్తంగా లేకపోవడం వలన ప్రమాదాలు

ప్రమాదం ప్రమాదం ప్రమాదం
నోరు మంచిదైతే ఊరు మంచి అవుతుంది లేకపోతే ప్రమాదం
నోరా వీపుకి చేటు తేకే లేకపోతే ప్రమాదం
కోపం పాపానికి ధూపం లేకపోతే ప్రమాదం

జూదం పానం మగువ వేట సప్త వ్యసనాలు ప్రమాదం
అవినీతి అక్రమాలు అన్యాయం ప్రమాదం
రేష్ డ్రైవింగ్ సెల్ డ్రైవింగ్ ప్రమాదం
ఈర్ష్యా ద్వేషాలు అహంకారాలు ప్రమాదాలు
ఇవన్నీ వ్యక్తిగత ప్రమాదాలు
కాలుష్యం ప్లాస్టిక్ వినియోగం చెట్లు నరకడం పర్యావరణ ప్రమాదం
కల్తీ మందులు కల్తీ వస్తువులు జనావాలి ఆరోగ్య ప్రమాదం
ఉచితాలు ఆర్థికభారం దేశానికే ప్రమాదం
ప్రపంచమే ప్రమాదం అంచుల్లో ఉంది.
మేలుకోండి కళ్ళుతెరవండి ప్రమాదాన్ని నివారించుకోండి

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!