ప్రమాదం పొంచివుంది

(అంశం:” ప్రమాదం”)

ప్రమాదం పొంచివుంది

రచన::ధరణీప్రగడ వేంకటేశ్వర్లు

నాయకులు కుంభకోణాల్లో మునిగి తేలుతున్నారు,
మంచితనపు ముసుగులో రాక్షసులుగా వున్నారు,
పక్ష, ప్రతిపక్షాల స్వరంలో స్వార్థమే పరమార్థం,
ప్రజా సమాజం అంచులో ప్రమాదం పొంచివుంది;

చదువు కొనుగోళ్లు ఎక్కువైయ్యాయి,
యాజమాన్యం దోపిడీల దోసెట పట్టారు,
విద్యలో నాణ్యత, నైతికత కొరవడింది,
ప్రజా సమాజం అంచులో ప్రమాదం పొంచివుంది;

అధికారగణం భజన మేళాలతో,
రాజకీయంతో జతకట్టి,
లంచాల అశుద్దం ఆరగిస్తున్నారు,
ప్రజా సమాజం అంచులో ప్రమాదం పొంచివుంది;

బెబ్బులి యువతా మీ పంజా విసరండి,
నిండుగ అంబుల పొది ధరియించండి,
అస్త్రాలను చెడుపై సంధించండి,
ప్రజా సమాజానికి ప్రమోదం కలిగించండి

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!