దీపావళి శుభాకాంక్షలు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: బాలపద్మం
నరకాసుర వధతో
సత్యభామ కరుణించిన శాంతులు
అమావాస్య చీకట్లను
తొలగిస్తూ పంచే వెలుగులు
శరత్కాల చలి గాలులను
వేడెక్కించి అందించు దీపాలు
చీడ కలిగించు క్రిమి కీటకాలను
పారద్రోలు బాణసంచా ధ్వనులు
ఇలలో తారలను వెదజల్లు భూచక్రాలు
తిరిగి వాటిని నింగికి చేర్చు తారా జువ్వలు
కర్ణభేరికి ఉల్లాసమిచ్చు బాంబుల మోతలు
కంటికి ఇంపైన చిచ్చుబుడ్డి శోభలు
పక్క ఇంటికి స్నేహ గీతికలందించు రాకెట్లు
సుఖ సంతోషాలతోడ సౌభాగ్యమిచ్చు
తోరణాలు శ్రీ లక్ష్మీ పూజలు
ఆప్యాయతలను పంచు
తీయని మిఠాయిలు
కుల వర్గ ప్రాంతల కతీతం
దీపావళి పండుగ సంబరాలు
నిత్యం మనకు పంచాలి
శాంతి సౌభ్రాతృత్వాలు
super
సింపుల్ గా బాగుంది
super bagundi
nice one