విద్య
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: కార్తీక్ నేతి
ఎప్పటి నుండో తెలీదు,
నీలి నీడల్లోకి వెళ్ళిపోతోంది,
ప్రాధాన్యత తగ్గిపోతోంది,
పాఠ్యాంశంగా ఉండాలి కాబట్టి ఉంది,
మార్కులకు పరిమితం అయ్యింది,
అమ్మ, నాన్నల పిలుపు దాదాపుగా తగ్గిపోతోంది,
అప్పట్లో మాతృబాషని బోధించేవారు,
అన్యభాషను పరిచేయం చేసేవారు,
పురోగతో లేక అధోగతి తెలీదు కానీ,
అన్యభాషను బోధిస్తోంది,
మాతృబాషని బాషాని గుర్తు చేస్తోంది ,
మాతృబాష వెలుగు తగ్గిపోతోంది,
అన్యభాష వ్యాప్తి పెరిగిపోతోంది,
మనోహారం , ప్రోఫౌండ్ వేదిక
మాతృబాషని కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది.