ఆ చెట్టే నాకాదర్శం

ఆ చెట్టే నాకాదర్శం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్

అబ్బాయి పిలిచాడని
ఆయనపోయి ఆరేళ్ళయిందని
అరవైఏళ్ళ వయస్సులో
అమలాపురం వదలలేక
అమ్మాయత్త గారి అమ్మలు నుంచి
అరబ్ ఎమిరేట్స్ విమానంలో
ఆరిజోనా రాష్ట్రంలో ఉన్న
అబ్బాయి దగ్గరకి వెళ్ళాను
ఆరుబయట చెట్టు అందమైన ఆకులతో
అందరిని ఆకట్టుకుంది
ఆకుల రంగులు మారి
అమ్మవారి శరన్నవరాత్రుల
అయిన వెంటనే ఒక్కొక్క ఆకు రాలి పూర్తిగా
అందవిహీనమైన
నా బతుకులాగే మోడు బారిందని అనుకున్నా
ఆమోడు బారిన కొమ్మలే
చిగురించి ఆకుపచ్చని ఆకులతో కనిపించిన సమయాన
అనుకున్నా భగవంతుడిచ్చిన జీవితంలో కష్టసుఖాలు తప్పవని
ఆదరక బెదరక ముందుకు సాగితే సాఫల్యత తధ్యమని
అందుకే ఆచెట్టే నాకాదర్శం..!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!