ఊరే బంగారం

( అంశం::”ఓసి నీ ఇల్లు బంగారం గానూ”)
ఊరే బంగారం   
రచన:: తిరుపతి కృష్ణవేణి

వీధి అరుగు మీద కూర్చుని ఏదో దీర్గంగా ఆలోచిస్తున్న సుబ్బారావు గారిని , పక్కింటి పరంధామయ్య గారు “ఏమిటి? సుబ్బారావు గారు ఎదో ఆలోచనలలో వున్నారు? అనిపలకరించారు.
హా! ఏముందండీ, పిల్లలు ఎదుగుతున్నారు, వాళ్ళ చదువులు వాటికి అయ్యే ఖర్చులు, రేపు వాళ్ళ పెళ్ళిల్లు పేరంటాలు పైగా ఇద్ధరు ఆడపిల్లలు, అమ్మాయిలంటే ఖర్చుతోకూడుకున్న
వ్యవహారమాయే?
ఈసారి వ్యవసాయం కూడా అంతంత మాత్రంగానే ఉంది. అదే ఆలోచనలలో పడ్డాను. అన్నారు సుబ్బారావు గారు .” ఓసి నీ ఇల్లు బంగారం గాను” సుబ్బారావు గారు, బలే వారండి! మీరు ఇప్పటి నుండే ఇలాంటి ఆలోచనలు ఏమీ పెట్టుకోకండి . పిల్లల చదువులు పూర్తి అవటానికి చాలా టైమ్ వుంది. అయినా మీ పిల్లల కేమండి బంగరాలు! చక్కని నడవడిక, మంచి క్రమశిక్షణ,చదువులో కూడా, అన్నీ ఫస్ట్ ర్యాంక్ లే సాధిస్తూంటారు. చూస్తుండండి ” మీ పిల్లలు బాగా చదువుకొని మీరు గర్వపడేలా తయారు అవుతారు”.
ఆ భయాలేవి పెట్టుకోకండి. నిర్చింతగాఉండండి.
పట్టుదలతో చదివి అనుకున్నది సాధిస్తారు. అందరితో “శభాష్” అనిపించుకుంటారు.
అని “ధైర్య వచనాలు చెప్పి”మళ్ళీ కలుస్తాను అని పరంధామయ్య గారు అక్కడనుండి వెళ్లి పోయారు.సుశీల సుబ్బారావు గారిది ఓ మధ్య తరగతి వ్యవసాయ కుటుంబం.
ఇద్ధరు ఆడ పిల్లలు వారిని ఎంతో అల్లారు ముద్దుగా పెంచి మంచి నడవడిక విద్యాబుద్ధులు నేర్పి సామాజిక విలువలు కలిగిన విద్యావంతులుగా తీర్చి దిద్ది, భవిష్యత్ లో తమ “పిల్లలఎదుగు దలను చూసుకోవాలి” అన్నదే వారి తాపత్రయం .ప్రతిభ, కీర్తి చాలా చురుకైన పిల్లలు. ఎప్పుడూ చదువు లో ముందుంటారు. తల్లిదండ్రుల కు చేదోడవాదోడుగా పొలం పనులలో సహాయంగా వుంటారు. ఎదిగే కొద్దీ ఒదగాలి అన్నట్లుగా ఉపాధ్యాయులతో ఎంతో అణకువగా మసలుతూ అందరి మన్ననలు పొందుతూ తమ ప్రతిభా పాటవాలను మెరుగు పర్చుకుంటూ అందరితో శబాష్ అనిపించు కునేలా ఉంటుంది, వాళ్ళ ప్రవర్తన.
వారిది ఒకటే ఆశయం
“మమ్మల్ని ఇంతకష్ట పడి చదివిస్తున్న అమ్మా నాన్నల ఋణం తీర్చుకోవాలి” అంటే మేము పెద్ద ఉద్యోగాలు సాధించాలి,వారిని కూర్చో పెట్టి సుఖంగా పెంచాలి. వృద్ధాప్యంలో వారు ఆనందంగా గడపాలన్నదే వారి ఆశ.
ఆ పట్టుదలతో పిల్లలిద్దరూ కష్టపడి చదువు తున్నారు.వయసుతో పాటు మార్పులు వస్తాయి. అన్నట్టు మంచి రూపు రేఖలు రంగు గుణవతు0లైన వారిని చూసిన ఎవరైనా” ఓసి నీ ఇల్లు బంగారం గాను” ఎంత ముచ్చటగా వున్నారే పిల్లలు, అని అనుకోవలసిందే!. కాలేజీ చదువులు ముగిశాయి.పిల్లలిద్దరూ సివిల్ సర్వీస్ పరీక్షలకు సిద్ధం అవుతున్నారు.
దండ్రులతో పాటు తమ ఊర్లో ఉన్న వాళ్ళందరూ గర్వపడేలా మంచి ఉద్యోగాలు సాధించాలి.
ఈ ఊర్లో సరైన సౌకర్యాలు అందుబాటులో లేక చదువు కునే మాలాంటి ఆడపిల్లలకు ఎంత కష్టమో రాగింగు పేరుతో అమ్మాయిలు పడే ఇబ్బందు లను దృష్టిలో పెట్టుకొని మనం చదువుకునే చదువు ప్రజలకు ఉపయోగ పడాలి. ఊర్లో ప్రజలు కష్టాలని లేకుండాసుఖంగా ఉండాలి వాళ్ళ సమస్యలు తీర్చే అధికారిగా ఉద్యోగం సాధించాలి.ఆడపిల్లల్ని ఆటపాట్టించే అకతాయి గాళ్ళఆటకట్టించాలి.
మన చదువులు అందరికి ఉపయోగపడే విధంగా వుండాలి అని అక్కా, చెల్లెళ్ళు ప్రతిభ, కీర్తీ లు నిర్ణయించు కున్నారు.అనుకున్నట్టు గానే వారు సివిల్స్ లో మంచి ర్యాంక్ సాధించారు.ఒకరు పోలీస్ అధికారిగా, ఒకరు కలెక్టర్ గా ఎంపికయ్యారు. ఊరంతా ఒకటే ఆనందం.
తమ ట్రైనింగు పూర్తి చేసుకొని ఎంతో కష్ట పడి ప్రతిభ తన ప్రతిభను చాటు కుంటు తన సొంత జిల్లాకే కలెక్టర్ గాను అలాగే కీర్తి కూడా జిల్లా పోలీస్ అధికారి నిగా తమ సొంత జల్లాకే రావటం విశేషం.తమ ఊరికే బంగారు భవిష్యత్ కలిగించారు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!