మంచి మనస్సు

( అంశం::”ఓసి నీ ఇల్లు బంగారం గానూ”)
మంచి మనస్సు   
రచన:: జయ

శ్రావణ శుక్రవారం వేకువజామునే లేచి,ఇల్లు శుభ్రం చేసి,తల స్నానం చేసి మహాలక్ష్మి లా తయరు అయ్యి పూజకు అన్ని సిద్ధం చేసుకొనిపంతులు గారి కోసం ఎదురుచూస్తుంది సీత.
ఈ లోపు అత్తగారు వచ్చి అన్ని సిద్ధం చేసావా సీత.
హా అయ్యింది అత్తమ్మా పంతులు గారి కోసం చూస్తున్న. సరే మీ మావయ్య కు కొంచెం కాఫీ ఇవ్వు సీత .
నేను కూడా రెడి అయ్యి వస్తా.
సరే అత్తమ్మా.
ఈలోపు పంతులు గారు వచ్చి అమ్మా సీత. పూజ దగ్గర అన్ని సిద్ధం చేసావా .
ఇప్పటికే ఆలస్యం అయ్యింది. రామ్మ పూజ మొదలుపెడదామం.
నమస్తే పంతులు గారు,మీ కోసమే ఎదురు చూస్తున్న. అన్ని సిద్ధం చేసే ఉంచాను అండి.
సరే రామ్మ అత్తమ్మా ను,పిల్లను పిలవు. అని పంతులు గారు పూజ చెయ్యడం మొదలు పెట్టారు.
ఈ లోపు లేడి పిల్లలా చెంగున వచ్చి అమ్మ పక్కన కూర్చుంది.
స్వాతి పంతులు గారి కి నమస్కారం పెట్టు అనే సీత మాట పూర్తికాక ముందే స్వాతి నమస్కారం తాత గారు అంటూ పంతులు గారి పాదాలకు నమస్కరిస్తుంది.
సీత తప్పు స్వాతి పంతులు గారు అనాలి,తాత గారు కాదు.
పంతులు గారు పర్వాలేదు తల్లి. చిన్న పిల్లలు దైవం తో సమానం వాళ్ళు ఎలా పిలిచిన ముద్దుగానే ఉంటుంది.
పైగా స్వాతి నా మనవరాలు లా ఉంది.
పూజ కార్యక్రమంలో పూజ ఘట్టం ముగిసింది.
వ్రత కథ మొదలుపెట్టారు పంతులు గారు.
స్వాతి,సీత,అత్తగారు కథ శ్రద్ధ గా వింటున్నారు.
కథ లో చారుమతి మొదలగు స్త్రీలు అమ్మ వారిని పూజించగా వారి ఇళ్ళల్లో బంగారం, డబ్బు,వాహనాలతో నిండి పోయింది అని పంతులు గారు చెబుతుంటే ,స్వాతి ఎందుకు తాత గారు చారుమతి అంటీ ఇంట్లో అంత బంగారం వచ్చింది అనే మాటకు పంతులు గారు చారుమతి చాలా మంచి సుగుణాలు ఉన్న స్త్రీ అమ్మా, అందరిని చాలా ప్రేమ గా చూసుకుంటుంది.
ఎవ్వరిని ఎప్పుడు చిన్న మాట కూడా అనేది కాదు, పైగా నిత్యం దైవనామస్మరణలో ఉండేది.
కావున అమ్మ వారు తనకి స్వప్నం లో కనిపించి తనని పూజించమని చెప్పి. తనకి వరాలు ఇస్తుంది.
ఓహ్ అవునా తాత గారు అయితే మా అమ్మ కూడా అలానే ఉంటుంది అమ్మ కూడా పూజ చేసింది గా మాకు కూడా అవాన్ని ఇస్తారా అమ్మ వారు.
ఆహా “ఓరిని నీ ఇల్లు బంగారం గాను”.అని నవ్వి .
హా ఇస్తారు అమ్మా నువ్వు బా చదువుకొని,అమ్మ నాన్న మాట వింటూ మంచి గా ఉంటే ఆ అమ్మవారు నీకు తోడుగా వుంటారు అమ్మా. అని దీవించి పంతులుగారు వెళ్ళిపోతారు.
మరుసటి రోజు స్వాతి బడికి వెళ్లి ఇంకా తిరిగి రాదు.
సీతకి టైం దాటే కొద్దీ కంగారు పడుతూ వుంటుంది.
అత్తమ్మా పిల్ల ఇంకా ఇంటికి రాలేదు భయం గా ఉంది అని ఏడుస్తుంది.అత్త మామ లు ఇద్దరు కంగారు పడకు సీత వచ్చేస్తుంది.
అయిన స్వాతి కి పెత్తనాలు ఎక్కువ కదా ఎక్కడో ఆట కనిపించి ఉంటుంది ఆగి ఆడుకుంటూ ఉంటుంది. మా వాడికి అప్పుడే చెప్పకు వాడు కంగారు పడతాడు. మీ మావయ్య వెళ్లి వెతుకుతారు లే.
బడి వదిలే టైం దాటి రెండు గంటలు అయ్యింది అని ఏడుస్తుంది.
ఈలోపు స్వాతి రానే వస్తుంది.
సీత స్వాతి ని చూడగానే భయం ఒక పక్క ,కోపం ఒక పక్క, తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోయింది.
స్వాతిని అరుస్తూ ,స్వాతి చెప్పేది వినకుండా కొడుతుంది.
స్వాతి ఏడుస్తూ డాబా పైకి వెళ్లి ఏడుస్తుంది.
స్వాతి ని అలా చూడలేక సీత చాలా ఏడుస్తుంది. అత్తమ్మా కొంచెం స్వాతి ని సముదాయించరు అని అడుగుతుంది. నువ్వు వెళ్లి పిల్లకి తినడానికి ఏదైనా తీసుకురా నేను ఊరుకో బెడతాను అని పిల్ల దగ్గరికి వెళుతుంది.
నానమ్మ ను చూడగానే వెళ్లి పట్టుకొని ఏడుస్తుంది. చూడు తల్లి నీవు రాలేదు అని అమ్మ ఎంత కంగారు పడిందో తెలుసా. ఆ బాధలో కొట్టింది.
అది కాదు బామ్మ నేను వచ్చే దారిలో ఒక ఆవిడ కళ్ళు తిరిగి పడిపోయింది ఆమెను మా స్నేహితులు సహాయంతో ఆసుపత్రికి తీసుకువెళ్లి వాళ్ల వాళ్ళని పిలిచి వచ్చేసరికి లేట్ అయ్యింది .
నేను చెప్పేది వినకుండా అమ్మ కొట్టింది. ఆ మాటలు విన్న సీత అరిగెత్తుకు వచ్చి సొర్ర్య్ తల్లి నాదే తప్పు.
నువ్వు చాలా మంచి పని చేశావ్ తల్లి.
గుడ్ గర్ల్ అని మెచ్చుకుంది.
మంచిపనులు చేసిన నువ్వు బంగారం రా.
అమ్మ నీకు చెప్పకుండా ఇంకెప్పుడూ ఇలా చెయ్యను అని అమ్మ ను కౌగిలించుకొని చెప్పేసారికి సీత తను చేసిన పనికి సిగ్గు పడుతుంది.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!