దేవుడు కూడా క్షమించడు

(అంశం – మానవత్వం ముసుగులో వ్యాపారం)

దేవుడు కూడా క్షమించడు

రచయిత : జీ వీ నాయుడు

మానవత్వం పరిమళించాలి
అప్పుడే కలిగేది ఈ జన్మకు సార్ధకత
మానవ సేవే మాధవ సేవ
అక్షరాలల్లో మహా అద్భుతం
అమలులో అంతా వ్యాపారం
నేను అనను అందరూ అలా అని
ఉన్నారు కొందరు త్యాగ మూర్తులుగా
సేవే పరమావాదిగా అంకితమై
అలాంటి సేవామూర్తులకు
చేస్తాను పాదాభివందనం.

వృద్దాశ్రమాలు,అనాధాశ్రమాలు
వెలుస్తున్నాయి ఎన్నో ఎన్నెన్నో
సూచిక బోర్డుల్లో అంతా ఉచితం, సురక్షితం
లోపలకెళితే అడుగుతారు
ఎంత కట్టగలవనీ కొందరు
బోర్డులు విషయం ప్రశ్నిస్తే
మేమూ నడపాలికదా సంస్థలనీ అంటారు
మరి ఇది సేవో వ్యాపారమో
తలలు పట్టుకుంటున్నారు బాధితులు భారమైన హృదయాలతో
మారండి మహాప్రభువులు
మానవత్వం చాటండి
సేవలో వ్యాపారానికి స్వస్తి
పలకండి పలకండి పలకండి
లేకుంటే దేవుడు కూడా క్షమించడు…

You May Also Like

One thought on “దేవుడు కూడా క్షమించడు

  1. మంచి సందేశాన్ని అందించారు సార్, ధన్యవాదాలు సార్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!