చప్పట్లు….పొగడ్తలు

(అంశం:” ప్రమాదం”)

చప్పట్లు….పొగడ్తలు

రచన::డా|| బాలాజీ దీక్షితులు పి.వి

నిప్పులు కక్కే చూపులకు
ఎదుగుదల ఓర్చలేని మనసులకు
మంచితనం చూడలేని బ్రతుకులకు
విషం పులుముకున్న కౌగిల్లకు
ధర్మపరుడైనా దయకోరాల్సిందే

బాగుంటే ఓర్వలేని
సంతోషం తాడలేని
ప్రతిభను భరించలేని
ప్రపంచంముందు
సత్యవ్రతుడు సాగిలపడాల్సిందే

బ్రతుకున నీతి
నడకన నిజాయితీ
చేతనైన చేయూత
కూడ ప్రమాదమే
స్ఫూర్తిలేని
రాకాసుల ముందు
రక్షణలేని మనసుకు ప్రమాదమే
అందుకే
చప్పట్లు….పొగడ్తలు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!