” నీ జీవితం “

” నీ జీవితం “

రచయిత: క్రాంతి కుమార్ ( ఇత్నార్క్ )

నీ సంతోషం ఒకరికి బాధ కాకూడదు
నీ బాధ పదిమంది పంచుకునేలా నడుచుకోవాలి

నీ గెలుపు ఒకరి త్యాగం వల్ల రాకూడదు
నీ ఓటమి పదిమందికి సంతోషం కాకుండా మసలుకోవాలి

నీ మరణం ఒకరి జీవిత గమ్యం కాకూడదు
నీ ప్రవర్తన పది మందిలో స్పూర్తి నింపేలా చూసుకోవాలి

నీ ప్రేమ ఒకరికి జీవిత బంధనం కాకూడదు
నీ ప్రేమ వల్ల ఒకరు స్వేచ్ఛను పొందేలా ప్రేమించాలి

నీ అభిమానం వల్ల ఒకరు ఇబ్బంది పడకూడదు
నీ సద్గుణాలకు అభిమానులు ఉండేలా ప్రవర్తించాలి

నీ మాటలు ఒకరి జీవితాన్ని నాశనం చేయకూడదు
నీ సలహా కోసం ఎదురు చూసేలా మాట్లాడాలి

నీ భయం వల్ల ఒకరు ఆందోళన పడకుడదు
నీ తోడు ఒకరికి జీవితాంతం కావాలి అనిపించాలి

నీ నమ్మకాల వల్ల ఒకరి ప్రాణం పోకుడదు
నీ మీద నమ్మకంతో నరకానికి అయిన వచ్చేలా ఉండాలి

నీ వ్యక్తిత్వం వల్ల ఒకరు కష్టాల్లో పడకుడదు
నీ వ్యక్తిత్వాన్ని పదిమంది మెచ్చుకునేలా జీవించాలి

You May Also Like

2 thoughts on “” నీ జీవితం “

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!