ఆరోగ్య ప్రదాయిని

ఆరోగ్య ప్రదాయిని

రచన: ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్

నేటి ఉరుకుల పరుగుల
యాంత్రిక జీవితంలో
చిరునవ్వు కూడా కనిపించని మనుషుల
మధ్య జీవనం రోగాల నిలయమే
నవ్వడం ఒక యోగం
నవ్వించడం ఒక భోగం
నవ్వక పోవడం ఒక రోగం అని జంధ్యాల చెప్పినది అక్షర సత్యం……!

మానసిక ఒత్తిడి ని దూరం చేసేది హాస్యం
తెనాలి రామలింగడి కథలు
రాజబాబు, అల్లు రామలింగయ్య, రేలంగి,
రమణారెడ్డి వంటి హాస్యనటుల నటన
మానసిక ఆహ్లాదం కలిగి ఒత్తిడి ని దూరం చేసేవి
నవరసాలలో హాస్యం ఆరోగ్యప్రదాయిని
అతిసర్వత్ర వర్జయేత్ అన్నట్లు మితి మీరని హాస్యం అందం ఆరోగ్యం..!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!