మధురమే

మధురమే

 తీయగా పాడే కోయిలలు
పసికొమ్మల్లోని లేలేత చిగురుటాకులు

అందంగా విచ్చుకునే కుసుమాలు
కమ్మని సువాసనల మామిడి పిందెలు

మధుమాసం
మహోన్నతం
మధురసభరితం
నీలి ఆకాశానికి పోటీగా
నేలమ్మ పచ్చదనం

ఆకుపచ్చ చీరలో మెరిసే ప్రకృతి
వసంతపురుషుడి రాకతో మధురానుభూతి

సప్తవర్ణ కాంతితో పులకరించే మనసు
సకలజీవులను పరవశింపజేసే వసంత సొగసు

పూలజల్లు కురిపించే మన్మధుడి విల్లు
వికసించదా భువిపై హరిత హరివిల్లు

రచయిత:మంజీత కుమార్

You May Also Like

One thought on “మధురమే

  1. హరిత హరివిల్లు విరిసింది నీ కవితాక్షరాల్లో👌👌💐💐
    మంజీతా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!