మొదటి ప్రేమ లేఖ

మొదటి ప్రేమ లేఖ

వయసు వలలు విసురుతుంటే
ప్రేమ తలపులు గుచ్చుతుంటే

రాస్తున్నా మొదటి ప్రేమ లేఖ

నా మొదటి ప్రేమలేఖ
చిరునామా రాయలేదు
నీవెవ్వరో ఇంకా కానరాక

ఎదలో కట్టిన
ప్రేమ గూడు అడుగుతుంది
అలసిపోయే రెక్కలు
సేద తీరే చోటు
నా హృదయ రూపంలో
నీకోసం ఎదురు చూస్తుందని

ఎప్పుడొస్తుందో ఆ రోజు
కానీ మదిలో భావాలు
విచ్చుకున్నాయి ఈరోజు

ఏ ఆత్మీయ హృదయాన్ని
వరిస్తుందో మనసు
కానీ ప్రతి క్షణాన్ని
స్వాతి ముత్యాల్లాంటి
మెరిసే హృదయ భావాల్ని
పోగేసి హారంగా కూర్చుతూ
అల్లుతుంది నీకోసం
నీ ఎద పైన ఒదిగి పోవాలని

ఎలా వుంటావో
ఎప్పుడు వస్తావో
జాడ తెలియని నీ కోసం
ప్రతి చిన్ని క్షణాన్ని
ప్రేమ తలపులలో నింపి
ఎదురు చూస్తుంది నా మనసు

వర్షించే నా మధి
స్పందన జల్లులు
అందుకో వెల్లువలా పొంగే
ప్రేమ కానుకలుగా స్వీకరించి,

నా ప్రేమ జల్లులే
స్వచ్చమైన స్వాతి
చినుకులై నీ ఎదపై
కురిపిస్తూ వుంటే
తరిస్తావని ఆశిస్తూ

చివరగా ఇది చేరవలసిన
వాళ్ళకే ముందస్తు ప్రేమ దస్తూరి
పరాయోల్లకు లేదు కిరాయి

                                   రచయిత:స్వాతి

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!