బావ

బావ 

రచన :: VT రాజగోపాలన్

నీ కౌగిలిలో తలదాచి, నీ చేతులలో కను మూసి… జన్మ జన్మకు జతగా మసలే వరమే నన్ను పొందనీ…

కౌగిలి వద్దులే బావా, మనువాడకనే, పో మధూ, వర్షంలో తడిచి ఎంత ముద్దొస్తున్నావో…

ఛీ పో బావా, పాడు మాటలు నీవూను,

బావా ఇప్పటికే ఆలస్యమయ్యింది..

అవును మధు, నేను అదేగా చెబుతున్నా, నీవా వినిపించుకోవు, మరెలా…

ఎప్పుడూ ఇదే యావ బావా నీకు, ఇప్పుడే హత్తుకుంటే, మనువాడాక మళ్ళా హాయి ఉండదు బావా… నాన్న గారు ఎదురుచూస్తూ ఉంటారు, ఈ పిల్ల ఇంకా రాలేదేమి అని !

వేడి నిట్టూర్పుతో, సరేలే మేడం, మీరెట్టా చెబితే అట్టాగాలే, వర్షం కాస్త తెరిపిచ్చింది,
పద వెళదాం.

ఇంటి వరండాలో రాఘవయ్య గారు, కూతురు కోసం ఎదురుచూస్తూ, పచార్లు చేస్తున్నారు, బండి శబ్దంతో కాస్త ఊపిరి వచ్చింది ఆయనకు. ఏంటమ్మా ఇంత ఆలస్యం, వర్షం వేరేను,  అరె, శ్రీధర్ రావోయ్.
నాన్నా, బావే నన్ను తీసుకొచ్చాడు, దారిలో తడిసిపోయాం, అంటూ ఓ తువ్వాలు బావకిచ్చి తుడుచుకో బావా, కాఫీ పెడతాను తాగి వెళుదువు గానీ… అంటూ ఓ ఓరచూపు చూసింది. ఎందుకులే వర్షంలో తడిచింది, ఒళ్ళంతా వేడిగానే ఉంది.

అరె తాగి వెళ్లొచ్చు ఇలా కూర్చో, ఎలా ఉన్నార్రా ఇంట్లో అందరూ… ఆ అంతా బాగానే ఉన్నారు మావా… మారలేదు, నాకు బయట
సంబంధాలు చూస్తూ ఉన్నారు, నాకు మధుని చేసుకోవాలని ఉంది, చేసుకుంటాను కూడా మీరు అనుమతిస్తే, కొన్ని రోజుల్లో అన్నీ సర్దుకుంటాయి..

తప్పురా శ్రీధర్, అలా చేయకూడదు. నేను ఒప్పిస్తా గానీ మీ వాళ్ళని. నాన్న మన వైపే కదా, అమ్మే కదా, మాట్లాడతా, అంతవరకు ఓపిక పట్టు సరేనా… అంటూ లోనికెళ్లాడు..

మధూ వేడి వేడి పకోడీలతో, కాఫీ మంచిగుందే. అబ్బా, చాలు చాలు గానీ, ముందర తిను, రాబోయే రోజుల్లో నేనేగా నీకు అన్నీ… వేడి వేడి గానే ఉంటుంది.

ఓ వారం గడిచింది. ఉదయం ఏడింటికి, ఓ పేపర్ పట్టుకొని, సుజాత, అన్నయ్యా… అన్నయ్యా అంటూ, ఏదీ నా కోడలు, దాని నోరు తీపి చేయాలి అంటూ లడ్డు ను, మధు కు అందించింద. నా కోడలు  కలెక్టర్ అయ్యింది, ఐఏఎస్ లో 9వ రాంక్ వచ్చింది.
శ్రీధర్ ఇప్పుడే చెప్పాడు అంటూ, అన్న కాళ్ళ మీద పడి ఆశీస్సులు అందుకుంది. రాఘవయ్య గారు, నీ ఇష్టం సరే, మీ సుపుత్రుడు ఏమంటాడో, ఈ పిల్ల ఏమంటుందో, తెలుసుకోవాలి కదే,  కాస్త ఓపిక పట్టు.

సుజాతకు ఓ పక్క కోపమున్నా, కోడలు పిల్లా… నీవైనా చెప్పవే మీ నాన్నకు, అత్త ఇంటికి వెళతానని.

అట్టాగే అత్తా మన ఇంటికి రాకుండా, వేరే ఎక్కడకు వెళతాను నేను… బావ అంటే ప్రాణం కదా నాకు, నీకూ తెలుసు.

మంచి ముహూర్తం పెట్టండి, సరేనా…

నా తల్లే, ఈ మాట చాలే నాకు. ముందర ఇంటికెళ్లి వాడి చెవిలో వేస్తాను.

ఎందుకమ్మా ఇక్కడే ఉన్నాగా నేను… నిన్ను తీసుకొచ్చింది నేనేగా.

అయ్యో నా మతి మరుపు మండా, సంతోషంలో ఏమీ తెలియట్లేదురా, శ్రీధరూ.

సరే బయల్దేరమ్మా, వెళదాము అంటూ వంట గది వైపు చూస్తుంటే… మధు చూస్తున్న చూపులకు, ఓసారి వెళ్లి కౌగిలించుకోవాలని మనసు కోరుతున్నా, మధు చేతులు చాపి పిలుస్తుంటే, వస్తాను మావా.

మనువాడాకనే మధూ అంటూ… బయలుదేరాడు మన శ్రీధర్.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!