సృష్టివైచిత్రం

(అంశం::”చిత్రం భళారే విచిత్రం”)

సృష్టివైచిత్రం

రచన:: మక్కువ. అరుణకుమారి

భానూదయాన అరవిరిసిన కమలాల కనువిందులు చిత్రమే కదా!

చంద్రోదయాన కురిసిన శరచ్ఛంద్రికలలో తానమాడి పులకితమైన కలువభామలు చిత్రమే కదా!

అనంత ఆ సాగరగర్భంలో ఎగజిమ్మే బడబానలమే కాదు
అమూల్య ఆణిముత్యాల శోధన చిత్రమే కదా!

కారుచీకట్లను కమ్ముకొచ్చే కరిమబ్బులు అమృతజలధారలు కురిపించడం చిత్రమేకదా!

గిరిశీఖరాల నుండి జాలువారే ఝరులు మానవాళికి మధురాంబువులు అందించడం చిత్రమే కదా!

విరిసి మురిపించే సుమబాలలు మధురఫలాలై తేనేలూరడం చిత్రమే కదా!

చిరువిత్తుల మొలకలే చిగురించి అమృతాహారాన్ని అందించడం చిత్రమే కదా!

మర్రిగింజే మహివృక్షమై శాఖోౌపశాఖల చల్లని నీడలో సేదదీర్చడం చిత్రమే కదా!

రూపులేని గొంగళి సప్తవర్ణాల కోక ధరించిన సీతాకోకచిలుకలై కులుకులొలికించడం చిత్రమే కదా!

ఒడలంతా గాయాలపాలైనా,మధుర గేయాలాపన చేసే
ఆ వేణు నాదాలు చిత్రమే కదా!

మావిచిగురులు మేసి మత్తెక్కి కూసే కోకిల కలకూజిత రవాలు చిత్రమే కదా!

ఆ నీలిగగనాన నీలిమేఘం చూసి పురివిప్పి ఆడేటి నెమలిపిట్టల నటవిన్యాసం చిత్రమే కదా!

ప్రకృతి పురుషుల ఆనందలయన్యాసమే ఈ సృష్టి చిత్రం…… భళారే విచిత్రం

★★★

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!