చేరిన గమ్యం

చేరిన గమ్యం

రచయిత :: సుజాత

విది రాసిన రాతను మార్చడం ఎవరి తరము కాదు కలిసిరాని కాలానికి ఎన్నో.అవంతారాలు వెంట్రుకలు ఉన్నకొప్పును.ఎటంటే అటే మార్చగల్గుతాము కాని విదిరాసిన రాతను.ఎవరు మార్చగల్గుతారు ఎన్నో అగాధాలు ఎన్నో బలైపోయిన జీవితాలు ఎన్నో కనివిని ఎరగని వింతవింత రోగాలు వింత మార్పులు మా తాతలు,తాతలు కూడ విని ఎరగని రోగాలు పారే
ప్రవహాన్ని కట్టలు వేసి ఆపగల్గుతాం.కాని ఒక నిండు ప్రాణాన్ని ఏ మేడలు మిద్దెలు నోట్ల కట్టలు పోసి ఒక ప్రాణాన్ని కాపాడుకోగలమా లేదు విది ఆడించే ఆటలో మనం కీలుబొమ్మలమే మనం ఎటు పోతున్నామో కూడ తెలియని పరిస్థితి మనది

ఆ డబ్బు దర్పం మన వెంట ఏది రాదు అయి ఎందుకు ఆ పాపపు చింతన డబ్బు డబ్బు అనే వెర్రి వ్యామోహం ఎందుకు? మన బందాలకు మన ప్రేమలకు విలువలు లేకుండా పొతున్నాయి.మనం సంపాదించిన డబ్బు పరపతి ఏది మనం పట్టుకుని వెళ్ళం కద ఎందుకు మరి సంపాదించిన డబ్బు పైన అంత వ్యామోహం.తన నిస్సహాయస్థితి పైన తనపై తనకే అసహ్యం వేస్తోంది.నా జీవితం ఎటు కాకుండా పోయింది.ఇంక తోడు అనుకున్న తల్లిదండ్రులు పోయారు ఇంక ఎవరు తోడు.అనుకుంటూ ఆలోచిస్తుంది.

అంతలో అమ్మ రాజి అన్నయ్య తమ్ముడు వచ్చారు అనడంతో రాజి ఈ లోకంలోకి వచ్చింది. కట్టలుగవస్తున్న తన.దుఃఖాన్ని పెదవులపై ఆపుకుంది. అన్నయ్యను తమ్ముడిని చుడగానే అన్నయ్య అంటు ఒక్కసారిగా  భుజాలపైవాలి బోరుమని ఎడ్చింది. ఇద్దరు దగ్గరగా తిసుకుని ఓదారుస్తూ రాజి ఎడువకు మేము వచ్చాము.ఇంక బాధపడకు అని ఓదారుస్తున్నారు.అయిన తన దుఃఖాన్ని ఆపడం అన్నయ్య తమ్ముడి వల్ల కావడం లేదు.

అయ్యా మిగతా కార్యక్రమాలు అన్ని జరగాలి పొద్దుపోతే పనికి రాదు రండయ్య అనడంతో సరేననిబయటకు వచ్చారు.పురోహితులు చెప్పినట్టుగ తండ్రి కర్మకాండలు అన్ని ఎదావిదిగ  జరిపించారు.అందరుఉన్నారు.అందరి ముందు బాగానే నటించారు.దహనసంస్కారాలు అయిపొయాయి.వచ్చిన  బందువులు వెళ్ళిపోయారు.ఇంక ముగ్గురే మిగిలారు.

అక్క మాతో వచ్చేయి మనమందరం కలిసి ఒకే చోట  ఉందాము.నాన్నకు ఉన్నవి అన్నింటినీ అమ్ముకునివెళ్దాము అని తమ్ముడు గిరి అన్నాడు. అవును రాజి తమ్ముడు చెప్పింది. సబబుగానే ఉంది.మేమా మాఉద్యోగాలు వదులుకుని ఇక్కడికి రాము మా పిల్లలకుఅసలు ఈ ఊరే తెలియదు.ఇక్కడ ఉంచుకుని ఎమ్చెస్తాము అన్నాడు.హరి.అన్ని వింటుంది కాని ఎమ్ చెప్పాలో తెలియక  నోరు మూగపోయింది.

నాన్న ఈ.ఆస్తిని ఈ ఇంటిని నా చేతులలో పెట్టి నీ అన్న తమ్ముడు జాగ్రత్త అని చెప్పి కన్ను మూసారు నాన్న మాటను.పక్కన ఎలా పెట్టాలి తండ్రి రెక్కలుముక్కలు చెసుకుని సంపాదించిన ఆస్తిని అమ్ముతానంటే ఎలా ఊరుకుంటాను అది నా వల్లకాదు ఎమైనా కాని దానికినేను ఒప్పుకోను వీళ్ళు ఎలా అమ్ముతారు నాన్న అంతా నా పేరున రాసారు వీళ్ళకి ఆ విషయం   తెలియదు కాబోలు వీళ్ళు అసలు మనషులేన నేను అంగన్వాడీ స్కూల్ టిచరును ఆ జాబు వదులుకుని పుట్టిన ఊరుని ఈ ఆస్తిని వదిలి ఎలా వస్తాను.

అరేయ్ తమ్ముడు అన్నయ్య మీరు ఆస్తులను అమ్మడం నాకు ఇష్టం.లేదు మీరు ఎప్పటిలానే వస్తూపొతూ ఉండండి నేను అన్ని చుసుకుంటాను.నేను ఈఊరు వదిలి రాలేను.ఆస్తులను.అమ్మడం ఏ మాత్రం నాకు ఇష్టంలేదు.అక్క అలా ఎలా అవుతుంది.మేము ఒప్పుకోము అమ్మాల్సిందే మీరు ఇలా అంటారనే మీరు ఏది ఉంచకుండా అమ్ముకు పోతారనే అమ్మకు పట్టిన గతి నాకు కూడ ఎక్కడ పట్టిస్తారనే భయం ఉద్దేశ్యంతోనే ఆస్తిఅంతా నా పేరున రాసారు.నాన్న అన్నది రాజి ఇది అంతా మోసం నీవు రాయించుకున్నావు  అని గొడవ చెసారు అసలు ఆస్తి నీకు ఎందుకు వస్తుంది.మేము ఆస్తి నీకు చిల్లీగవ్వ కూడ ఇవ్వము మీరు ఇవ్వడం ఎంటి మీ ఆస్తి నాకు ఏదొ దానం ఇస్తున్నట్టుగ మీరు ఇవ్వడం ఎంటి నాన్ననే తన ఇష్టంగా నా పేరున రాసారు.

అయిన ఆస్తులను ఎవరు పట్టుకుని పోతారురా మీలాంటి  మూర్కులు తప్ప ఇంకా ఎవరు పట్టుకు పోరు తెలుసా మీపై నమ్మకం ఉంటే నాన్న ఈలా  ఎందుకు చెస్తారు.ఏ ఇంత నమ్మకం లేకుంటే ఎలా అమ్మ చావుబతుకలలో ఉంటే.డబ్బులు సర్థండి బాబు నాయన అని ఎంత మొరపెట్టుకున్నారు.మీకు గుర్తు ఉంద అప్పుడు నాన్న ఎంతబాధ పడ్డారో తెలుసా పొలం తాకట్టు పెట్టి తెచ్చారు.మళ్ళీ కష్టపడి పొలంలో పండిన పంటను అమ్మి పొలం తాకట్టులోంచి విడిపించారు.అప్పుడే అమ్ముకుంటే ఇప్పుడు మీకు ఏమి మిగిలేది పోతూ కూడ అన్నయ్య తమ్ముడు జాగ్రత్త బిడ్డ అనే చెప్పారు.

కాని మీద కోపం పెట్టుకోలే మంచములో పడ్డ అమ్మ ఎలాంటి పిల్లలను కన్నాను దేవుడా అని కుమిలిపోతూ చచ్చిపోయింది.అదికూడ మరిచి పోయార మీకు తల్లిదండ్రులు బరువు అనుకున్నారు.కాని వాళ్ళు మీరు  భారం అనుకోలేదు ఎక్కడ మీ మీద పడుతారోనని మీరు భయపడ్డారు.నాన్న ఎన్నడూ బాధ పడలేదు నాన్న సంపాదించిన డబ్బు ఆస్తులు.కూడబెట్టి మీకే ఉంచారు తెలుసా స్తిరాఆస్తులు అమ్ముకోవడం నాన్నకు ఇష్టం లేదు అవి ఎప్పటికైన కష్టంలో ఆదుకుంటాయి.

నాన్న అనుభవంతో చెప్పిన నిజం నా జీవితం కూడ మీ కోసమే బలైపోయింది.నా పెళ్లి కోసం దాచిన డబ్బులు నీ చదువు కోసం పెట్టారు కట్నం ఇస్తేకాని మేము చేసుకోము అన్నారు.ఉన్న పలంగా అప్పుడు నాన్న దగ్గర డబ్బులు.ఎక్కడినుంచి వస్తుంది. అలా ఎన్ని సంబాందాలు ఎత్తిపోయినవి.ఇంకోడు కట్నంలేకున్న చేసుకుంటానని వెలుగ బెట్టింది. చూసారుగ నేను చెసిన కష్టం కూడ ఇంటికే ఇంక నేను ఎటు పోయేది ఉంది.అంది బాధగా

ఎమండి వీరయ్యగారు ఇల్లు ఇదేననండి అవునండి అంది ఎక్కడో చుసిన గుర్తు ఎక్కడో గుర్తు రావడం లేదు చక్కగా ఆరుఅడుగుల పొడవు లైట్ గ్రీన్ చెక్స్కఉన్న షేర్టు వేసుకున్నాడు తలస్నానం చెసినట్టుగ ఉన్నాయి గాలికి అందంగా ఎగురుతున్నాయి.తల వెంట్రుకలు రండి అంది మానాన్నగారు లేరు పోయారు.

తెలుసండి అందుకే వచ్చాను నా పేరు వసంత్ అంటు తన వైపు చుసారు.అంతే గుర్తుకు వచ్చింది ఆ మీ..మీ వసంత్ కదు అవును మీరు రాజ్యలక్ష్మి.ఇంట్లో రాజి అని పిలుస్తారు అంటు నవ్వారు ఇద్దరు క్లాసుమెట్స్ ఫస్ట్ నుండి డిగ్రీ వరకు కలిసే చదవుకున్నారు వాళ్ళు వాళ్ళు నాన్నగారు ఇక్కడి నుండి షిప్ట్ అయ్యారు మళ్లీ ఇన్నాళ్లకు కలుసుకున్నారు

రాజీ వైపు చుసాడు అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే కుందనపు బొమ్మల ఉంది తను కూడ అలాగే  ఉన్నాడు కాకపోతే.కొద్దిగా వొళ్ళు చెసాడు తన వైపు అలాగే చుస్తున్నాడు.

టీ తెస్తాను అంటు లోనికి వెళ్ళింది.

రాజీ అన్నయ్య తమ్ముడు పలకరించి పాత విషయాలు అడిగి తెలుసుకున్నారు.పెళ్లి చేసుకున్నార ఎంత మంది పిల్లలు అని అడిగారు.నేను ఇంక పెళ్లి చేసుకోలేదు అని చెప్పారు.మరి మీకు పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం ఉందా అని అడిగారు.

అంతలో రాజీ కాఫీ పట్టుకుని అందరికి ఇచ్చింది.తనవైపు చూస్తు నన్ను చేసుకునే అమ్మాయి దొరకాలి కదండి .

నాకు తన వైపుచూస్తు నవ్వింది.మరి మీరు ఎందుకు చేసుకోలేదు అని అన్నాడు.

నన్ను చేసుకునే అబ్బాయి.దొరకలేదు అందుకని అని ఇద్దరు ఒకరినొకరు చూస్తు నవ్వారు.
మీకు ఎవ్వరికీ అభ్యంతరం లేకుంటే నేను రాజీని పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు తన వైపు చూస్తు

మాకు కూడ ఎ అభ్యంతరం లేదండి మా చెల్లెలుకు ఇష్టమైతే చాలు అన్నారు.నీ అభిప్రాయం ఎంటి అన్నట్టుగా చుసాడు వసంత్ తను సిగ్గుతో తల వచ్చుకుంది.
అన్నయ్య తమ్ముడు ఇద్దరు చుసారు.ఎంటి  అన్నట్టుగా రాజీ వైపు తల ఊపింది ఇష్టం అన్నట్టుగా
రాజీ నీతో మాట్లాడాలని ఉంది పక్కకు.వస్తావ అని సైగ చెసాడు. సరేనని పెరటివైపు వచ్చింది ఇన్ని రోజులు పెళ్లి అంటే విరక్తి బావన ఉండేది వసంత్  చుడగనే మంచి అభిప్రాయం కల్గింది  పెళ్లి ఇష్టం కల్గింది.రాజీ చెప్పు మాట్లడవె దేవుడు కోరకుండానే వరం ఇస్తే ఎమ్ మాట్లాడాలి అంది తన కళ్ళల్లోకి చుస్తు మళ్లి నిన్ను ఇలా చుస్తాను అనిపించలేదు వసంత్ అంది.

వసంత్ తెలిసిన వాడే ఎవరో అయితే  ఎమని అనే దాన్నొ కాని వసంతే వచ్చి అడిగి నప్పుడు ఇంకేం ఎదురు చెపుతాను సరే అంది మంచి ముహూర్తంలో రాజీ మేల్లో తాలి కట్టాడు రాజీకి ఒక తోడు వసంత్ దొరికాడు.రాజీ జీవితం ఒంటరై పోతుంది.అనుకున్న రాజీ జీవితం సుఖాంతమైంది.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!