సగం సగం

అంశం: అందమైన అబద్ధం

సగం సగం
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

 రచన: రాళ్ళపల్లి నాగమణి

రేయి పగలు, వెలుగు చీకటి,
తీపి చేదు, ఉప్పు కారం,
వాన ఎండలకు మల్లె,
విరుద్ధమైనా సరే,
మనం సగం సగం.
నా ఆశయాలు,లక్ష్యాలు,
నా పధం, నా ఉనికి
నేనెప్పుడు వదులుకోను…
నీ లక్ష్యం వేరయినా,
ధర్మపధం విడనంత  వరకూ,
నువ్వూ నేనూ సగం సగం,
రెండు అర్ధలు కలిసిన సంపూర్ణం.
మనది, అర్ధవంతమైన దాంపత్యం.
నువ్వే నేను, నీలో నేనని,
ఎప్పుడైన తమకంలో నేనంటే,
అది అందమైన అబద్ధం.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!